• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

* 92 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలకు నోటిఫికేషన్‌స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌).. 92   మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (టెక్నికల్‌) పోస్టుల భర్తీకి స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్‌/ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్‌ ప్లాంట్లు, యూనిట్లు, గనుల్లో నియమిస్తారు.


కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 92 ఉద్యోగాల్లో.. ఎస్సీలకు 30, ఎస్టీలకు 25, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు 37 కేటాయించారు. 


సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసవ్వాలి. 31.12.2023 నాటికి ఎసీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 33 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థుల వయసు 31 ఏళ్లు మించకూడదు.    దరఖాస్తు ఫీజు ఓబీసీ అభ్యర్థులకు     రూ.700. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులు,  ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.200. 


ఎంపిక

అభ్యర్థులను ఆన్‌లైన్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్‌/ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) జనవరి 2024లో జరిగే అవకాశం ఉంది. 

ఆన్‌లైన్‌ పరీక్షలో 2 పార్ట్‌లకు  200 మార్కులు ఉంటాయి. పార్ట్‌-1లోని డొమైన్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌కు 100 మార్కులు. వ్యవధి 40 నిమిషాలు. పార్ట్‌-2లోని ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు 100 మార్కులు. వ్యవధి 80 నిమిషాలు. దీంట్లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌.. అనే నాలుగు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కూ 25 మార్కులు. అభ్యర్థి రెండు పార్టుల్లోనూ అర్హత సాధించాలి. 


ట్రెయినింగ్, ప్రొబేషన్‌

ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ.. దీన్ని విజయవంతంగా పూర్తిచేసినవారికి ఏడాది ప్రొబేషన్‌ ఉంటుంది. 

 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (టెక్నికల్‌)కి ప్రాథమిక వేతనం రూ.50,000. దీనికి అదనంగా డీఏ, పీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, హౌసింగ్‌/హెచ్‌ఆర్‌ఏ, ఉద్యోగికీ, కుటుంబ సభ్యులకూ ఉచిత వైద్యం లాంటి సౌకర్యాలు ఉంటాయి. 

ఏడాది శిక్షణను పూర్తిచేసుకున్న అభ్యర్థులకు అసిస్టెంట్‌ మేనేజర్‌-ఇ1 గ్రేడ్‌ హోదా ఇస్తారు. వేతన శ్రేణి రూ.60,000-1,80,000 ఉంటుంది. 

ఎంపికైన అభ్యర్థులను సంస్థకు చెందిన ప్లాంట్‌/యూనిట్‌/మైన్స్‌లో ఎక్కడైనా నియమించవచ్చు. నాలుగేళ్ల వరకూ ఎలాంటి బదిలీలకూ అనుమతించరు. డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులను రెండేళ్ల తర్వాత అనుమతిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. దరఖాస్తు సమయంలోనే పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. అడ్మిట్‌కార్డ్‌ ద్వారా పరీక్ష కేంద్రం వివరాలను తెలియజేస్తారు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 31.12.2023

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జనవరి, 2024

వెబ్‌సైట్‌: sail.co.in


సన్నద్ధత ఇలా

పార్ట్‌-1లో సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇంజినీరింగ్‌లో చదివిన సబ్జెక్టుల్లో ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి. 

పార్ట్‌-2లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. బ్యాంక్, ఎస్‌ఎస్‌సీ, రైల్వే పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయొచ్చు. 

ఈ సబ్జెక్టుల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే మాక్‌ టెస్టులూ రాయాలి. 

ముఖ్యంగా నిర్ణీత సమయంలోగా ప్రశ్నలన్నింటికీ సమాధానాలు గుర్తించేలా సాధన చేయాలి. 

నెగిటివ్‌ మార్కులు లేవు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. తర్వాత ఆలోచించి మిగతా వాటికీ జవాబులు రాయొచ్చు. 

గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ: ఆన్‌లైన్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలకు ఎంపికచేస్తారు. సంబంధించిన కాల్‌లెటర్స్‌ను సెయిల్‌ వెబ్‌సైట్‌లోని కెరియర్‌ పేజ్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ సమాచారాన్ని అభ్యర్థులకు ఈమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. 

సీబీటీ, జీడీ, ఇంటర్వ్యూలకు 75:10:15 వెయిటేజీ ఇస్తారు. ఆన్‌లైన్‌ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితాను తయారుచేస్తారు. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ ఇగ్నోలో నాన్‌ టీచింగ్‌ కొలువులు

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

Posted Date : 14-12-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.