• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంటర్‌ పాఠ్యాంశాలు 30 శాతం తగ్గింపు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ పాఠ్యాంశాల (సిలబస్‌)ను ఇంటర్‌ విద్యా శాఖ 30 శాతం తగ్గించింది. కరోనా కారణంగా కళాశాలలను తెరవడంలో జాప్యం జరుగుతున్నందున పాఠ్యాంశాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే సీబీఎస్‌ఈ 30 శాతం తగ్గించినందున ఇందుకు అనుగుణంగా కొన్ని పాఠాలను తొలగించారు. సాధారణంగా 220 పనిదినాలు రావాల్సి ఉండగా.. సెప్టెంబరు 5 నుంచి కళాశాలలను ప్రారంభిస్తే 175 వరకు పనిదినాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలను ప్రారంభించారు. ఇటీవల లెక్చరర్లు ప్రవేశాల కోసం ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. పదో తరగతి పూర్తిచేసి ఇంటర్‌లో చేరేందుకు ఆసక్తి చూపిన వారికి బ్రిడ్జి కోర్సు పాఠాలు బోధించనున్నారు.

ఏపీ ఇంట‌ర్మీడియ‌ట్ (2020 - 21) కొత్త సిల‌బ‌స్ వివ‌రాలు

Science Subjects                                    Arts Subjects

Posted Date : 11-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌