• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సమస్య సాధనలో సూత్రాలే కీలకం

గణితంలో సూత్రాలు, సిద్ధాంతాలు, పటాలు నేర్చుకుంటే పూర్తి మార్కులు పొందవచ్చు. ముఖ్యంగా ప్రతి లెక్కకు సంబంధించిన సూత్రాలు నేర్చుకోవాలి. ఇవి సమస్య సాధనలో కీలకంగా ఉపయోగపడతాయి. మిగిలిన       సబ్జెక్టుల్లా చదవకుండా కేవలం ప్రాక్టీస్‌తోనే      గణితంలో అధిక మార్కులు సాధించవచ్చు.

గణిత శాస్త్రం - I(ఎ)

ఇంటర్మీడియట్‌ గణితశాస్త్రం - I(ఎ) ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి. విభాగం - ఎలో 2 మార్కుల ప్రశ్నలు 10 ఉంటాయి. వీటన్నింటికీ జవాబులు రాయాలి. విభాగం - బిలో 4 మార్కుల ప్రశ్నలు 7 ఉంటాయి. వీటిలో 5 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. విభాగం - సిలో 7 మార్కుల ప్రశ్నలు 7 ఉంటాయి. వీటిలో 5 ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాలి.

యూనిట్ల వారీగా వెయిటేజి 

ప్రమేయాలు: ఈ చాప్టర్‌ నుంచి ప్రమేయ రకాలు, వ్యాప్తి, వాస్తవ మూల్య ప్రమేయ ప్రదేశం, వ్యాప్తికి సంబంధించి 2 మార్కుల ప్రశ్నలు రెండు; 7 మార్కుల ప్రశ్న ఒకటి వస్తాయి.

మాత్రికలు: దీని నుంచి 2 మార్కుల ప్రశ్నలు రెండు; అనుబంధ మాత్రిక, విలోమ మాత్రికల నుంచి 4 మార్కుల ప్రశ్న ఒకటి వస్తాయి. క్రామర్‌ పద్ధతి, మాత్రికా విలోమ పద్ధతిలో సమీకరణాలను సాధించడం నుంచి 7 మార్కుల ప్రశ్నలు రెండు వస్తాయి. మొత్తం మాత్రికల నుంచి 22 మార్కులు వస్తాయి. 

సదిశల సంకలనం: ఈ యూనిట్‌ నుంచి 2 మార్కుల ప్రశ్నలు రెండు, 4, 7 మార్కుల ప్రశ్నలు ఒక్కోటి చొప్పున వస్తాయి. 

సదిశల గుణనం: ఈ అధ్యాయం నుంచి 2, 4, 7 మార్కుల ప్రశ్నలు ఒక్కోటి చొప్పున వస్తాయి. 

గణితశాస్త్రం - I(బి)

ఇంటర్మీడియట్‌ గణితశాస్త్రం - I(బి) ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి. విభాగం - ఎలో 2 మార్కుల ప్రశ్నలు పది ఉంటాయి. వీటన్నింటికీ మొత్తం జవాబులు రాయాలి. విభాగం - బిలో 4 మార్కుల ప్రశ్నలు ఏడు ఉంటాయి. వీటిలో 5 ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాలి. విభాగం - సిలో 7 మార్కుల ప్రశ్నలు ఏడు ఉంటాయి. వీటిలో 5 ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాలి.

యూనిట్ల వారీగా వెయిటేజి

బిందుపథం: ఈ చాప్టర్‌ నుంచి 4 మార్కుల ప్రశ్నలు రెండు వస్తాయి. 

సరళరేఖ: దీని నుంచి 2 మార్కుల ప్రశ్నల రెండు, 4 మార్కుల ప్రశ్న ఒకటి వస్తాయి. ఇందులోని త్రిభుజం - పరికేంద్రం, లంబకేంద్రాలకు సంబంధించి 7 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. మొత్తంగా ఈ చాప్టర్‌ నుంచి 15 మార్కులు వస్తాయి. 

సరళరేఖా యుగ్మాలు: ఈ యూనిట్‌లో అభ్యాసం 4(బి), 4(సి)ల నుంచి రెండు 7 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఒకటి సిద్ధాంతాల నిరూపణ, మరొకటి ప్రశ్నల సాధనల నుంచి రావడానికి అవకాశం ఉంది. 

త్రిపరిమాణ నిరూపకాలు: ఈ అధ్యాయంలో ఒక 2 మార్కుల ప్రశ్న వస్తుంది.  

సమతలం: దీని నుంచి ఒక 2 మార్కుల ప్రశ్న వస్తుంది. 

దిక్‌ కొసైన్‌లు - దిక్‌ సంఖ్యలు: ఈ చాప్టర్‌ నుంచి ఒక 7 మార్కుల ప్రశ్న వస్తుంది. 

అవధులు - అవిచ్ఛిన్నత: దీని నుంచి రెండు 2 మార్కుల ప్రశ్నలు, ఒక 4 మార్కుల ప్రశ్న వస్తాయి. 

అవకలనం: ఈ చాప్టర్‌ నుంచి రెండు 2 మార్కుల ప్రశ్నలు, 4, 7 మార్కుల ప్రశ్నలు ఒక్కోటి వస్తాయి. దీని నుంచి మొత్తంగా 15 మార్కులు వస్తాయి. కాబట్టి విద్యార్థులు ఈ చాప్టర్‌పై దృష్టి సారించాలి. 

అవకలజాల అనువర్తనాలు: ఈ యూనిట్‌లో స్పర్శరేఖ, అభిలంబరేఖలకు సంబంధించిన అభ్యాసం 10(బి), 10(డి)ల నుంచి 2, 4, 7 మార్కుల ప్రశ్నలు ఒక్కోటి చొప్పున వస్తాయి. దీనిలోని ఆరోహణ, అవరోహణ ప్రమేయాలపై అభ్యాసం 10(జి) నుంచి 2, 4 మార్కుల ప్రశ్నలు ఒక్కోటి వస్తాయి. ఇదే చాప్టర్‌ నుంచి గరిష్ఠ, కనిష్ఠ విలువలను కనుక్కునే ఒక 7 మార్కుల ప్రశ్న కూడా వస్తుంది. దీని నుంచి మొత్తంగా 26 మార్కులు వస్తాయి. కాబట్టి విద్యార్థులు వెయిటేజి ఆధారంగా సాధన చేయాలి. 

మ‌రింత స‌మాచారం కోసం 

మోడ‌ల్ పేప‌ర్ స‌మాధానాల‌తో

Posted Date : 20-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌