• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అన్వయించుకొని చదివితే 

మార్కులుఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో వృక్షశాస్త్రం పరీక్ష ప్రశ్నపత్రం 60 మార్కులకు ఉంటుంది. బైపీసీ విద్యార్థులకు ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్టు. దీనిలోని ప్రతి అంశాన్ని నిత్యజీవితానికి అన్వయించుకొని చదవాలి. ప్రతి పాఠాన్ని ఒక ప్రణాళికతో చదివితే వృక్షశాస్త్రంలో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ బోర్డు 30% సిలబస్‌ తగ్గించింది కాబట్టి విద్యార్థులు ఈ మార్పును గమనించి వార్షిక పరీక్షలకు సన్నద్ధమవ్వాలి. 

యూనిట్ల వారీగా వెయిటేజి...

అధ్యాయం - 1: మొక్కల్లో రవాణా (6 మార్కులు) - 4, 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి.

నీటిశక్మం, పోరిన్లు, ద్రవాభిసరణ, వ్యాపనం, బిందుస్రావం, అపోప్లాస్ట్, సింప్లాస్ట్‌ పదాల నిర్వచనాలు నేర్చుకోవాలి. 

    కోశిక ద్రవ్యసంకోచం, సులభతర విసరణ పటాలను సాధన చేయాలి.

అధ్యాయం - 3: ఎంజైమ్‌లు (4 మార్కులు) - 4 మార్కుల ప్రశ్న  వస్తుంది. ఎంజైమ్‌ నిరోధకాలు, వివిధ రకాల సహకారకాల ముఖ్య లక్షణాలను నేర్చుకోవాలి.

అధ్యాయం - 4: ఉన్నత మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ           (6 మార్కులు) - 4, 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. 

    వీటిలో కాంతి జలవిచ్ఛేదన, అవధికారక సిద్ధాంతం, C3, C4 మొక్కల్లో CO2  ప్రాథమిక స్వీకర్త ముఖ్యమైనవి. హరితరేణువు పటాన్ని సాధన చేయాలి.

అధ్యాయం - 5: మొక్కల్లో శ్వాసక్రియ - 8 మార్కులకు దీర్ఘ సమాధాన ప్రశ్న గ్లైకాలిసిస్‌ లేదా క్రెబ్స్‌ వలయం నుంచి వచ్చే అవకాశం ఉంది. 

    గ్లైకాలిసిస్‌ రేఖా చిత్రం, క్రెబ్స్‌ వలయాన్ని బాగా సాధన చేస్తే ఒక దీర్ఘ సమాధాన ప్రశ్నకు జవాబు సులభంగా రాయవచ్చు.

అధ్యాయం - 6: మొక్కల పెరుగుదల, అభివృద్ధి - ఇందులో నుంచి 4 మార్కుల ప్రశ్న మాత్రమే వస్తుంది. ఆక్సిన్స్, జిబ్బరెల్లిన్స్, సైటోకైనిన్‌ల ఏవైనా నాలుగు శరీరధర్మ సంబంధ ప్రభావాలను నేర్చుకోవాలి.

అధ్యాయం - 7: బ్యాక్టీరియమ్‌లు - 2 మార్కుల ప్రశ్న ఒకటి మాత్రమే వస్తుంది. జన్యుపరివర్తనం, జన్యువహనం, సంయుగ్మం, ప్లాస్మిడ్, బహురూపక బ్యాక్టీరియాల నిర్వచనాలు ముఖ్యమైనవి.

అధ్యాయం - 8: వైరస్‌లు - 4 మార్కుల ప్రశ్న ఒకటి మాత్రమే వస్తుంది. TMV, T - సరిసంఖ్య గల బ్యాక్టీరియోఫేజ్‌ల నిర్మాణం అతి ముఖ్యమైనవి. పటాలను సాధన చేసి నాలుగు ముఖ్య లక్షణాలను నేర్చుకోవాలి 

అధ్యాయం - 9: అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత (6 మార్కులు) - 4, 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటిలో దృశ్యరూపం, జన్యురూపం, బిందు ఉత్పరివర్తనాలు, బఠానీ  మొక్కలోని ముడతలు పడిన విత్తనాలు గల మొక్క జన్యు స్వభావం ముఖ్యమైంది. ఏక సంకర సంకరణం, పరీక్షా సంకరణం, సహ బహిర్గతత్వం, అసంపూర్ణ బహిర్గతత్వం, పున్నెట్‌ చదరాలను సాధన చేస్తే 4 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు సులువుగా రాయవచ్చు.

అధ్యాయం - 10: అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం (6 మార్కులు) - 4, 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఎక్సాన్లు, ఇన్‌ట్రాన్లు, హెటిరో క్రొమాటిన్, యూక్రొమాటిన్, కాపింగ్, పాలి అడినలైజేషన్‌ (టైలింగ్‌), జన్యుసంకేతం; డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏల మధ్య తేడాలపై బాగా దృష్టి పెట్టాలి. లాక్‌ - ఒపెరాన్‌ పటాన్ని సాధన చేయాలి.

అధ్యాయం - 11: జీవసాంకేతిక శాస్త్రం సూత్రాలు, ప్రక్రియలు (10 మార్కులు) - 8, 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. అణు కత్తెరలు, పాలిండ్రోమిక్‌ వరుసక్రమం, డౌన్‌ స్ట్రీమ్‌  ప్రక్రియ, PCR ముఖ్యమైనవి. పునఃసంయోజక డీఎన్‌ఏ సాంకేతిక విధానం, సాధనలు నేర్చుకోవాలి. పటాలను బాగా సాధన చేస్తే దీర్ఘ సమాధాన ప్రశ్నలకు జవాబులను సులభంగా రాయవచ్చు. 

అధ్యాయం - 12: జీవసాంకేతిక శాస్త్రం - దాని అనువర్తనాలు (6 మార్కులు) - 4, 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. BEAC, GMO ల విస్తరిత నామాలు, Cryవ జన్యువుల రకాలు ముఖ్యమైనవి. జన్యుపరివర్తిత మొక్కలు, Bt పత్తి నాలుగు ఉపయోగాలు తెలుసుకోవాలి.

అధ్యాయం - 13:  ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు (10 మార్కులు) - 8, 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. కనిపించని ఆకలి, పాక్షిక వామన వరి రకాలు, అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత కలిగిన గోధుమ రకాలను నేర్చుకోవాలి. కణజాలవర్ధనం రేఖాచిత్రం లేదా మొక్కల ప్రజనన విభాగంలో ఒక కొత్త రకాన్ని విడుదల చేసే క్రమంలో వివిధ దశలు దీర్ఘ సమాధాన ప్రశ్నగా ఇచ్చే అవకాశం ఉంటుంది.

అధ్యాయం - 14: మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు - 2 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. స్టాటిన్స్, స్విస్‌ జున్నులోని పెద్ద రంధ్రాలకు గల కారణాలు, పారిశ్రామికంగా ఉపయోగపడే రెండు ఎంజైమ్స్, రోగ నిరోధకతను అణచివేసే కారకాలను నేర్చుకోవాలి.

*     పూర్తి సిలబస్‌ చదవడానికి వీలుకానివారు కేవలం 5 చాప్టర్లు చదివినా పరీక్షల్లో ఉత్తీర్ణులవడానికి అవకాశం ఉంటుంది. మొక్కల్లో శ్వాసక్రియ, జీవసాంకేతిక శాస్త్రం సూత్రాలు - ప్రక్రియలు, జీవసాంకేతిక శాస్త్రం - దాని అనువర్తనాలు, ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు, మొక్కల్లో రవాణా లాంటివి చదవాల్సి ఉంటుంది. వీటి నుంచి 2 దీర్ఘ సమాధాన ప్రశ్నలు, 3 స్వల్ప సమాధాన ప్రశ్నలు, 5 అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈ చాప్టర్లపై దృష్టి సారించాలి.

మ‌రింత స‌మాచారం కోసం 

మోడ‌ల్ పేప‌ర్ స‌మాధానాల‌తో

Posted Date : 27-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌