• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఓడించేయ్‌... ఒత్తిడిని!

పరీక్షల గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతుంటే విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగి పోతూ ఉంటుంది. ఇది పరిమితుల్లో ఉంటే అనుకూల ఫలితాన్నే ఇస్తుంది. లక్ష్యం దిశగా ముందుకు వెళ్లడానికి సహకరిస్తుంది. కానీ మితిమీరితే మాత్రం దుష్పరిణామాలు ఏర్పడతాయి. ఆరోగ్యంతోపాటు మార్కులపైనా వ్యతిరేక ప్రభావం పడుతుంది. అందుకే పరీక్షల సన్నద్ధత సమయంలో కొన్ని మెలకువలు పాటించటంతో పాటు తగిన జాగ్రత్తలూ తీసుకోవాలి!

సిద్ధార్థ్‌.. మంచి విద్యార్థి. తరగతిలో ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్నలకు ఠక్కున సమాధానమిస్తాడు. కానీ పరీక్షల తేదీలు సమీపిస్తున్నకొద్దీ స్థ్థిమితంగా ఉండలేడు. చెమటలు కక్కేస్తుంటాడు. నీరసపడిపోతాడు. ఎంత చదివినా ఇంకా ఎంతో మిగిలిఉందనే భయం. చదివింది పరీక్షలో గుర్తుంటుందో లేదోనన్న కంగారు. కడుపునిండా అన్నం తినటం లేదు. సరిగా నిద్ర పోవటం లేదు. అతడిని చూసి తల్లిదండ్రులూ ఆందోళన పడుతున్నారు.

ఈ ఒత్తిడి సాధారణంగా పరీక్షల ముందు విద్యార్థులంతా ఎదుర్కొనేదే! కొందరు విద్యార్థులకు ఇది పెద్ద విషయం కాదు. వీరు దాన్ని ముందుకు సాగడానికి తోడ్పడే సాధనంగా మలుచుకుంటారు. పట్టుదలగా చదవడం, పునశ్చరణలపై దృష్టిపెట్టడం వంటివి చేస్తుంటారు. అందరి విషయంలోనూ ఇలాగే ఉంటుందని భావించలేం. ఎందుకంటే ఎక్కువమందిలో ఇది వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఎప్పుడూ తరగతి గదిలో ముందుండే విద్యార్థులూ పరీక్షల దగ్గరకొచ్చేసరికి బోల్తా పడుతుండటానికి కారణమిదే. దీని వల్ల ఒక్కోసారి విద్యార్థులకు చదవడమూ భారంగా అనిపిస్తుంది. ఈ ప్రభావం పరీక్షలు రాయటంపై పడుతుంది. ఒత్తిడి తీవ్రంగా ఉంటే విద్యార్థులు తమకు బాగా తెలిసిన జవాబులనూ గుర్తుతెచ్చుకోలేక ఇబ్బందిపడతారు. నిరాశతో సహజసిద్ధమైన ప్రతిభను ప్రదర్శించలేక మార్కులు కోల్పోతారు.

లక్షణాలివీ!
పరీక్షల ఒత్తిడికి గురైన విద్యార్థులను కొన్ని శారీరక, మానసిక లక్షణాల సాయంతో గుర్తించవచ్ఛు అన్నీ అందరిలో కనిపించకపోయినా కొన్నింటి ఆధారంగా ఒత్తిడిని కనుక్కోవచ్చు.

 

మానసికం:
* చిరాకు, కోపం, నిరాశ, నిస్పృహ
* విశ్రాంతికి దూరమవడం
* మానసికంగా అలసిపోవడం
* ఉదాసీనంగా ఉండటం, దేనిపైనా ఆసక్తి లేకపోవడం
* దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం

 

శారీరకం:
* కండరాలు పట్టేయడం
* అతిగా చెమటలు పట్టడం
* ఆకలిలో మార్పులు, జీర్ణశక్తి తగ్గిపోవడం
* నిద్ర పట్టకపోవడం
* హృదయ స్పందనలో అనుకోని మార్పులు
* తరచూ మూత్ర విసర్జన చేయాలనిపించడం
* ఛాతిలో అసౌకర్యంగా ఉండటం
* మలబద్ధకం/ విరేచనాలు
* వెన్నునొప్పి

ఒత్తిడికి కారణాలేంటి?
* సన్నద్ధతకు తగినంత సమయం లేకపోవడం
* చదువుతున్నది సరిగా అర్థం కాకపోవడం
* అనుకున్న మార్కులు సాధించాలన్న ఆరాటం
* పరీక్షల్లో మార్కులు సరిగా రావేమోనన్న భయం.
* సరిగా సిద్ధంకాలేదేమో అన్న సందేహం.
* తోటివారు తమకన్నా ఎక్కువగా చదివేస్తున్నారన్న భయం.
* తల్లిదండ్రులను మెప్పించాలన్న తపన
* పోటీ ఎక్కువగా ఉందని భావించడం.

Posted Date : 11-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌