• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వెయిటేజిపై పట్టు తప్పనిసరి  

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో వృక్షశాస్త్రం పరీక్ష ప్రశ్నపత్రం 60 మార్కులకు ఉంటుంది. బోటనీ అంతకు ముందు తరగతుల్లో చదవని, అంతగా పరిచయంలేని సబ్జెక్టు కావడంతో విద్యార్థులు కాస్త కంగారు పడే అవకాశం ఉంది. కానీ ప్రణాళిక ప్రకారం ప్రతి పాఠంలోని నిర్వచనాలు, ముఖ్యాంశాలను పటాల సహాయంతో చదివితే సులువుగా సమాధానాలు రాయవచ్చు. పటాల భాగాలు, మొక్కల రసాయననామాలపై పట్టు సాధిస్తే పూర్తి మార్కులు పొందవచ్చు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ బోర్డు 30% సిలబస్‌ తగ్గించింది. కాబట్టి విద్యార్థులు ప్రస్తుత సిలబస్‌కు అనుగుణంగా ఒక ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమవ్వాలి.

యూనిట్ల వారీగా మార్కులు

అధ్యాయం - 1: జీవ ప్రపంచం - 2 మార్కులు ప్రశ్న ఒకటి మాత్రమే వస్తుంది. ఇందులో వర్గీకరణలో మౌలిక ప్రమాణం, మామిడి శాస్త్రీయ నామం అంశాలు ముఖ్యమైనవి.

అధ్యాయం - 2: జీవశాస్త్ర వర్గీకరణ (6 మార్కులు) - 4, 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. శైవల మంజరి, ఎరుపు అలలు, ఫైకోబయాంట్, మైకోబయాంట్, మైకోప్లాస్మా వ్యాధులు, వైరాయిడ్స్, వైరస్‌లు, డయాటంలో కణ కవచ స్వభావం అంశాలు ముఖ్యమైనవి. క్రైసోఫైట్స్, డైనోఫ్లాజెల్లేట్స్, యూగ్లినాయిడ్స్‌లో నాలుగు ముఖ్య లక్షణాలను నేర్చుకోవాలి.

అధ్యాయం - 3: మొక్కల విజ్ఞానం - వృక్షశాస్త్రం - 2 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. వృక్షశాస్త్ర పిత, హేర్బలిస్ట్స్, పరాశరుడు రచించిన పుస్తకాలు, పురావృక్షశాస్త్రం, ఫైకాలజి, మైకాలజి అంశాలు ముఖ్యమైనవి.

అధ్యాయం - 4: వృక్షరాజ్యం (4 మార్కులు) - 4 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. గోధుమవర్ణ - ఎరుపువర్ణ శైవలాల మధ్య తేడాలు, లివర్‌ వర్ట్స్‌ - మాస్‌ మొక్కల మధ్య నాలుగు తేడాలు తెలుసుకోవాలి.

అధ్యాయం - 5: పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం (12 మార్కులు) ఒక 8 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. పీచువేర్లు, వెలామిన్‌ వేర్లు, మకుటదలో పరిస్థితం, అండన్యాసం అంశాలు ముఖ్యమైనవి. ఏవైనా నాలుగు వేరు, కాండ రూపాంతరాల ముఖ్య లక్షణాలను గుర్తుంచుకోవాలి. వాటి పటాలను సాధన చేయడం ద్వారా ఒక దీర్ఘ సమాధాన ప్రశ్నకు జవాబు సులభంగా రాయవచ్చు.

అధ్యాయం - 7: పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి                         (12 మార్కులు) 8 మార్కుల ప్రశ్న, 2 మార్కుల ప్రశ్న ఒక్కోటి చొప్పున వస్తాయి. దీనిలో అండకోశంలోనికి పరాగనాళం ప్రవేశించే విధానాలు, త్రి సంయోగం, అసంయోగ జననం ముఖ్యమైనవి. పిండకోశం, ఫలదీకరణం, సూక్ష్మ సిద్ధ బీజాశయ పటాలను సాధన చేయడం ద్వారా ఒక 8 మార్కుల ప్రశ్నకు జవాబును సులువుగా రాయవచ్చు.

అధ్యాయం - 8: ఆవృత బీజాల వర్గీకరణశాస్త్రం                (6 మార్కులు) - 4, 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. భూఫలనం, ఒమేగా వర్గీకరణశాస్త్రం, సాంఖ్యక వర్గీకరణశాస్త్రం ముఖ్యమైనవి. లిలియేసి కుటుంబ మొక్కల పుష్పభాగాల్లోని ఆవశ్యక అంగాలు, బెంథామ్‌ అండ్‌ హూకర్‌ వర్గీకరణ లోని నాలుగు ముఖ్య లక్షణాలు నేర్చుకోవాలి. పుష్ప చిత్రాన్ని సాధన చేయాలి. పుష్ప సంకేతాలు గుర్తుంచుకోవడం ద్వారా కుటుంబ లక్షణాలు సులభంగా రాయవచ్చు. 

అధ్యాయం - 9: కణం - జీవ ప్రమాణం           (6 మార్కులు) - 4, 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. లైసోజోమ్స్, వాయురిక్తికలు, సూక్ష్మదేహాలు, శాటిలైట్‌ క్రోమోజోమ్, మధ్యపటలిక అంశాలు ముఖ్యమైనవి. హరితరేణువు, మైటోకాండ్రియా, కేంద్రక పూర్వజీవకణం పటాలు బాగా సాధన చేయాలి.

అధ్యాయం - 10: జీవ అణువులు (6 మార్కులు) - 4, 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. గ్లైకోసైడిక్‌ బంధం, జ్విట్టర్‌ అయాన్‌ రూపం, అమైనో ఆమ్లం, చక్కెరలు, కొవ్వు ఆమ్లాలు, న్యూక్లియోటైడ్లకు ఉదాహరణలు ముఖ్యమైనవి. కేంద్రకామ్లం ద్వితీయ నిర్మాణం, ప్రొటీన్ల రకాల ముఖ్య లక్షణాలను నేర్చుకోవాలి. 

మ‌రింత స‌మాచారం కోసం 

మోడ‌ల్ పేప‌ర్ స‌మాధానాల‌తో

Posted Date : 20-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌