• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సబ్జెక్టుపై పట్టు సాధించాలి

ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో 30% సిలబస్‌ను తగ్గించారు. విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా అంశాలను చదవాలి. భౌతికశాస్త్రం అంటే చాలా కఠినమైన సబ్జెక్టు అని భావిస్తుంటారు. కానీ ఇందులోని నిర్వచనాలు, పటాలు, సిద్ధాంతాలు, ప్రమాణాలు నేర్చుకుంటే ప్రశ్నలకు జవాబులు సులువుగా రాయవచ్చు. ప్రతి అంశంపై విషయావగాహన పెంచుకుంటూ ప్రణాళిక ఆధారంగా చదివితే భౌతికశాస్త్రంలో పూర్తి మార్కులు పొందవచ్చు.

యూనిట్ల వారీగా ప్రశ్నల సరళి

    పని - శక్తి -  సామర్థ్యం, డోలనాలు, ఉష్ణగతిక శాస్త్రాల నుంచి వ్యాసరూప ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. 

    సరళ రేఖాత్మక చలనం, సమతలంలో గమనం, గమన నియమాలు, కణాల వ్యవస్థ - భ్రమణ చలనం, గురుత్వాకర్షణ, ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు, పదార్థాల ఉష్ణధర్మాలు, చలన సిద్ధాంతం యూనిట్ల నుంచి నాలుగు మార్కుల ప్రశ్నలు వస్తాయి.

    భౌతిక ప్రపంచం, ప్రమాణాలు - కొలతలు, సమతలంలో గమనం, గమన నియమాలు, ప్రవాహాల యాంత్రిక ధర్మాలు, పదార్థాల ఉష్ణ ధర్మాలు, చలన సిద్ధాంతాల నుంచి రెండు మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. 

విద్యార్థులు ఈ అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. ప్రతి అంశంపై విషయావగాహన పెంచుకోవాలి. అర్థం కాని అంశాలను స్నేహితులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి. సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎలాగైనా గుర్తుపెట్టుకుంటామని అనుకోకూడదు. గత ప్రశ్నపత్రాల సరళిని పరిశీలించాలి. ఏయే అంశాలు ఎక్కువగా అడుగుతున్నారో తెలుసుకొని వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. సొంతగా నోట్‌్్స రాసుకోవాలి. పునశ్చరణ సులువుగా చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. క్లిష్టంగా ఉన్న పదాలు, పదబందాలు, సమీకరణాలను రాస్తూ చదివితే ఎక్కువ కాలం గుర్తుంటాయి. నిపుణుల సూచనలు, సలహాలు పాటిస్తూ పరీక్షలు రాసినట్లయితే మంచి మార్కులు సాధించవచ్చు.

తొలగించిన సిలబస్‌

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో మొత్తం 14 యూనిట్లు ఉన్నాయి. ఇందులో నుంచి కొన్ని అంశాలను తొలగించారు. 

    సరళరేఖాత్మక చలనంలో నిర్దేశిక చట్రాలు

    గమన నియమాల్లో జడత్వ నియమం, న్యూటన్‌ మూడు గమన నియమాలు, ద్రవ్యవేగం, ప్రచోదనం

    కణాల వ్యవస్థలు - భ్రమణ చలనంలో లంబాక్ష - సమాంతరాక్ష సిద్ధాంతాలు    

    గురుత్వాకర్షణలో కెప్లర్‌ గ్రహ గమన సూత్రాలు    

    ఘనపదార్థాల యాంత్రిక ధర్మాల్లో పాయిజన్‌ నిష్పత్తి, ఘనపదార్థాల స్థితిస్థాపక ధర్మం, వికృతి శక్తి

పదార్థ ఉష్ణ ధర్మాల్లో వహనం - సంవహనం - వికిరణాల ద్వారా ఉష్ణప్రసారం

ఉష్ణగతిక శాస్త్రంలో ఉష్ణ యంత్రాలు, రిఫ్రిజిరేటర్లు, ఉష్ణ పంపులు 

    పై అంశాలను సిలబస్‌ నుంచి పూర్తిగా తొలగించారు. వీటి నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం లేదు. యూనిట్‌ మొత్తాన్ని తొలగించలేదు. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి దానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేసుకోవాలి. వెయిటేజి మారే అవకాశం లేనందున విద్యార్థులు గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ఏయే అంశాలు చదవాలో తెలుసుకోవాలి. ప్రతి అంశంపై పట్టు సాధించడానికి ప్రయత్నించాలి. బట్టీ పట్టకుండా విషయావగాహనతో చదివినట్లయితే ప్రశ్న ఏవిధంగా అడిగినా సమాధానం రాయడానికి వీలవుతుంది. 

మ‌రింత స‌మాచారం కోసం 

మోడ‌ల్ పేప‌ర్ స‌మాధానాల‌తో

Posted Date : 20-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌