• facebook
  • twitter
  • whatsapp
  • telegram

శ్రద్ధతో చదువు మార్కులు గెలువు

ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రథమ సంవత్సరం తెలుగులో 30%సిలబస్‌ను తొలగించింది. మిగిలిన 70% సిలబస్‌పై విద్యార్థి దృష్టి సారించాల్సి ఉంటుంది. సిలబస్‌లోని ముఖ్యమైన పాఠాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాఠ్యపుస్తకంలోని వ్యాకరణ అంశాలను మాత్రమే చూసుకోవాలి. ప్రశ్నపత్రంలో ఎలాంటి మార్పు లేదని విద్యార్థులు గమనించాలి. విద్యార్థులకు తక్కువ సమయం ఉన్నందున ఎక్కువ మార్కులు సాధించడానికి బాగా కృషి చేయాలి.

    విద్యార్థి కంఠస్థ పద్యాలను పద దోషాలు లేకుండా రాయాలి. వ్యాసరూప ప్రశ్నలను మూడు పేరాలుగా విభజించి రాయాలి. సందర్భాలు, కవి పరిచయం, సందర్భ భావం అని వేర్వేరుగా విభజించాలి. ఏ పాఠ్యాంశం నుంచి అడిగిన సందర్భమో ఆ సందర్భానికి మాత్రమే రాయాలి. కవి పరిచయం ఒక పేరా రాయడం మంచిది. సంక్షిప్త సమాధానాలు          రెండు పేరాలుగా విభజించి రాయాలి. ఉపవాచక వ్యాసరూప ప్రశ్నలను 4 లేదా 5 పేరాలుగా రాయాలి. వ్యాకరణ అంశాల్లో కొట్టివేతలు లేకుండా జాగ్రత్త వహించాలి. 

    లేఖ రచనను రెండు సమభాగాలుగా విభజించాలి. ఆంగ్ల అనువాదాలను స్పష్టంగా రాయాలి. ఇవన్నీ పాటిస్తూ పరీక్ష రాసినట్లయితే మంచి మార్కులు సాధించవచ్చు.

పాఠ్యాంశాలు - మార్కుల కేటాయింపు

 సమాసాలు (8 మార్కులు)

1.     విశేషణపూర్వపద కర్మధారయ సమాసం

2.     ద్విగు సమాసం

3.     సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

4.     బహువ్రీహి సమాసం

5.     ద్వంద్వ సమాసం 

లేఖలు (5 మార్కులు)

1.     కళాశాల ప్రధానాచార్యులకు లేఖ

2.     తల్లిదండ్రులకు లేఖ 

3.     స్నేహితులకు లేఖ 

4.     అధికారికి లేఖ 

5.     ఉద్యోగానికి లేఖ 

స్థూల అవగాహన (5 మార్కులు)

1.     మన తెలుగు      

2.     సావిత్రిబాయి పూలే  

3.     శంకరంబాడి సుందరాచారి  

4.     తోలుబొమ్మలాట 

5.     అవయవదానం 

అనువాదాలు (5 మార్కులు)

పాఠ్యపుస్తకంలో 

1 నుంచి 20 వరకు ఉన్న ప్రశ్నలను చదువుకోవాలి. 

పద దోషాలు (5 మార్కులు)

1.     అచ్చుకి బదులు హల్లులు రాయడం             2. హల్లుకు బదులు అచ్చులు రాయడం  

3.  మహాప్రాణాలకు బదులు అల్ప ప్రాణాలు రాయడం   4. అల్ప ప్రాణాలకు బదులు మహాప్రాణాలు రాయడం

5.     శ, ష, స, ల తారుమారు.

పద్యభాగం 

1.    ధర్మపరీక్ష పాఠంలోని 18, 24 పద్యాలు; తిన్నని ముగ్ధభక్తిలోని 11, 16, 28 పద్యాలు కంఠస్థం చేసి, భావం నేర్చుకోవాలి.              (6 మార్కులు)

2.    ధర్మపరీక్ష, తిన్నని ముగ్ధభక్తిలోని 2 చొప్పున పెద్ద ప్రశ్నలు. (6 మార్కులు)

3.    శ్మశాన వాటికలోని పెద్ద ప్రశ్న ఒకటి. (6 మార్కులు)

4.    ధర్మపరీక్ష, తిన్నని ముగ్ధభక్తి, శ్మశాన వాటికలోని సంక్షిప్త సమాధానాలు నేర్చుకోవాలి. (6 మార్కులు)

5.     ధర్మపరీక్ష, తిన్నని ముగ్ధభక్తి, శ్మశాన వాటికలోని సందర్భాలు బాగా చదవాలి. (6 మార్కులు)

6.     ధర్మపరీక్ష, తిన్నని ముగ్ధభక్తి, శ్మశాన వాటికలోని ఏకవాక్య సమాధానాలు చదవాలి. (5 మార్కులు)

గద్యభాగం 

   హసము - హాస్యము, మహిళోద్యమ జనకుడు మాట తీరులోని వ్యాసరూప సమాధానాలు (6 మార్కులు), సంక్షిప్త సమాధానాలు (6 మార్కులు), ఏకవాక్య సమాధానాలు (5 మార్కులు) నేర్చుకోవాలి. 

ఉపవాచకం (8 మార్కులు)

1.    ఊతకర్ర, సౌందర్యం, దహేజ్‌లోని పెద్ద ప్రశ్నలన్నీ చూసుకోవాలి.

వ్యాకరణం (12 మార్కులు)

I. సంధులు: 1) సవర్ణదీర్ఘసంధి   

          2) గుణసంధి

          3) యణాదేశసంధి

          4) వృద్ధి సంధి

II.    సరళాదేశ సంధి, గసడదవ దేశ సంధి సూత్రాలు, ఉదాహరణలు బాగా నేర్చుకోవాలి. 

మ‌రింత స‌మాచారం కోసం 

మోడ‌ల్ పేప‌ర్ స‌మాధానాల‌తో

Posted Date : 20-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌