• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సమీకరణాల సాధనే ముఖ్యం!

విషయాన్ని అర్థం చేసుకుంటూ చదివితే రసాయన శాస్త్రంలో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. దీనిలో ప్రధానంగా మూలకాల పరమాణు భారాలు నేర్చుకుంటే సమస్యలను సులువుగా సాధించవచ్చు. బట్టీ పట్టకుండా సమీకరణాలను సాధన చేస్తూ సమాధానాలను చదివితే బాగా గుర్తుంటాయి.

 ద్వితీయ సంవత్సరం రసాయన శాస్త్రం ప్రశ్నపత్రం 60 మార్కులకు ఉంటుంది. ఈ ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి. విభాగం - ఎ లో అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు పది ఉంటాయి. దీనిలో అన్నింటికీ సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. విభాగం - బి లో ఎనిమిది స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. దీనిలో ఏవైనా ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. విభాగం - సి లో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఉంటాయి. దీనిలో ఏవైనా రెండింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.

బీ     ఈ ఏడాది పూర్తి సిలబస్‌ నుంచి 30% తగ్గించారు. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సన్నద్ధం కావాలి. 

సిలబస్‌ విశ్లేషణ

ఘనస్థితి 

ఈ యూనిట్‌ నుంచి ప్రధానంగా బ్రాగ్‌ సమీకరణాన్ని ఉత్పాదించడం, షాట్కీ - ఫ్రెంకెల్‌ లోపాలు చదవాలి. 

ద్రావణాలు 

దీని నుంచి మొలాలిటీ, మోల్‌ భాగం లెక్కించడంతో పాటు సాపేక్ష బాష్పపీడన నిమ్నతపై సమస్యలు అడగవచ్చు. 

రసాయన గతిశాస్త్రం

దీనిలో ముఖ్యంగా చదవాల్సిన అంశాలు క్రమాంకం, అణుతల మధ్య గల భేదాలు, సున్నా - ప్రథమ క్రమాంక చర్యల రేటు స్థిరాంకం, అర్ధాయువులకు సమీకరణాలను రాబట్టడం; ఉత్ప్రేరక, ఉష్ణోగ్రతల ప్రభావం.

విద్యుత్‌ రసాయన శాస్త్రం

ఈ యూనిట్‌ నుంచి ఘట పొటెన్షియల్, ఫారడే నియమాలపై లెక్కలు అడిగే అవకాశం ఉంది. దీంతో పాటు కోల్‌రాష్‌ నియమం, గాల్వానిక్‌ ఘటం, నెర్నెస్ట్‌ సమీకరణం గురించి ప్రశ్నలు అడుగుతారు.

ఉపరితల రసాయన శాస్త్రం

 దీనిలో భౌతిక, రసాయన అధిశోషణాల మధ్య భేదాలు; 

బ్రౌనియన్‌ చలనం, టిండాల్‌ ఫలితం, స్కందనం అంశాలను చదవాలి.

p -  బ్లాక్‌ మూలకాలు 

p -  బ్లాక్‌ మూలకాల్లో నాలుగు భాగాలు ఉంటాయి. అవి గ్రూపు 15, 16, 17, 18 మూలకాలు. వీటిలో ప్రధానంగా చదవాల్సిన అంశాలు NH3, HNO3, Cl2, O3, జీనాన్‌ సమ్మేళనాల తయారీ, ధర్మాలు.

d, f -  బ్లాక్‌ మూలకాలు, సమన్వయ సమ్మేళనాలు 

దీని నుంచి వెర్నర్‌ సిద్ధాంతం, IUPAC నామీకరణ విధానం, పరివర్తన మూలకాలు ముఖ్యమైనవి. 

జీవాణువులు 

దీనిలో విటమిన్‌లు, కార్బోహైడ్రైట్‌ల గురించి చదవాలి.

కర్బన రసాయన శాస్త్రం 

ఈ యూనిట్‌ నుంచి ప్రధానంగా పేరుతో గల చర్యలను చదవాలి. వీటితో పాటు IUPAC నామీకరణ విధానం; SN1, SN2 చర్యలు, ఫీనోల్‌ ఆమ్ల స్వభావం గురించి నేర్చుకోవాలి.

మ‌రింత స‌మాచారం కోసం 

మోడ‌ల్ పేప‌ర్ స‌మాధానాల‌తో

Posted Date : 26-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌