• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పునశ్చరణే కీలకం

భౌతికశాస్త్రం నిత్యజీవితంలో ఒక భాగమే. విద్యార్థులు దీనిలోని ప్రతి అంశాన్ని ప్రయోగాత్మకంగా ఊహించుకొని చదివితే మిగిలిన సబ్జెక్టుల కంటే సులభమే. ముఖ్యంగా మొదటి సంవత్సరంలో చదివిన ప్రాథమిక అంశాలను మరిచిపోవద్దు. ఇవి ప్రస్తుత పాఠ్యాంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి. సిలబస్‌ పూర్తయిన తర్వాత పునశ్చరణ చేయాలి. సరైన ప్రణాళికను రూపొందించుకొని చదివితే భౌతికశాస్త్రంలో మంచి మార్కులు సాధించవచ్చు. 

   యూనిట్ల వారీగా ప్రశ్నల సరళి

తరంగాలు, ప్రవాహ విద్యుత్, కేంద్రకాల యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. 

కిరణ దృశా శాస్త్రం - దృక్‌ సాధనాలు, తరంగ దృశా శాస్త్రం, విద్యుత్‌ ఆవేశాలు - క్షేత్రాలు, స్థిర విద్యుత్‌ పొటెన్షియల్‌ - కెపాసిటెన్స్, చలించే ఆవేశాలు - అయస్కాంతత్వం, విద్యుదయస్కాంత ప్రేరణ, పరమాణువులు, అర్ధవాహక పరికరాల నుంచి నాలుగు మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశముంది. 

కిరణ దృశా శాస్త్రం, దృక్‌ సాధనాలు, చలించే ఆవేశాలు - అయస్కాంతత్వం, అయస్కాంతత్వం - ద్రవ్యం, ఏకాంతర ప్రవాహాలు, విద్యుదయస్కాంత తరంగాలు, వికిరణం - ద్రవ్యాల ద్వంద్వ స్వభావం, అర్ధవాహక పరికరాలు, సంసర్గ వ్యవస్థల నుంచి రెండు మార్కులు ప్రశ్నలు అడుగుతారు.

కాబట్టి విద్యార్థులు ఈ అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. ప్రతి అంశాన్ని విషయావగాహన పెంచుకోవడానికి చదవాలి. అర్థం కాని అంశాలను స్నేహితులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి. సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. గత ప్రశ్నపత్రాల సరళిని పరిశీలించాలి. ఏయే అంశాలు ఎక్కువగా అడుగుతున్నారో తెలుసుకొని వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. సొంతగా నోట్‌్్స రాసుకోవాలి. పునశ్చరణ సులువుగా చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. క్లిష్టంగా ఉన్న పదాలను, పదబంధాలను, సమీకరణాలను రాస్తూ చదివితే ఎక్కువకాలం గుర్తుంటాయి. నిపుణుల సూచనలు, సలహాలు పాటిస్తూ పరీక్షలు రాసినట్లయితే మంచి మార్కులు సాధించవచ్చు. 

సిలబస్‌లో తొలగించిన అంశాలు

తరంగాలు - డాప్లర్‌ ప్రభావం

కిరణ దృశాశాస్త్రం - దర్పణ సమీకరణం, కాంతి పరిక్షేపణం

 తరంగ దృశాశాస్త్రం - దృశా పరికరాల పృథక్కరణ సామర్థ్యం, ధృవణం, బ్రూస్టర్‌ నియమం, పోలరాయిడ్‌లు 

 విద్యుత్‌ ఆవేశాలు, క్షేత్రాలు - గాస్‌ నియమం, దాని అనువర్తనాలు

 ప్రవాహ విద్యుత్‌ - కార్బన్‌ నిరోధాల కలర్‌ కోడ్‌లు; నిరోధాల సమాంతర, శ్రేణి సంధానాలు

 చలించే ఆవేశాలు, అయస్కాంతత్వం - సైక్లోట్రాన్‌ 

 అయస్కాంతత్వం - ద్రవ్యం - అయస్కాంత ద్విధ్రువ అక్షీయ, మధ్య లంబరేఖలపై అయస్కాంత క్షేత్ర తీవ్రత, పారా-డయా-ఫెర్రో అయస్కాంత పదార్థాలు, శాశ్వత అయస్కాంతాలు, విద్యుదయస్కాంతాలు

 ఏకాంతర విద్యుత్‌ ప్రవాహం - AC వలయంలో సామర్థ్యం, సామర్థ్య కారకం - వాట్‌లెస్‌ ప్రవాహం

 విద్యుదయస్కాంత తరంగాలు - స్థానభ్రంశ ప్రవాహం

 వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం - డేవిసన్‌ - జెర్మర్‌ ప్రయోగం

 కేంద్రకాలు - రేడియో ధార్మికత, అర్ధ జీవితకాలం, ఒక్కో న్యూక్లియాన్‌కి గల బంధన శక్తి

 అర్ధవాహక పరికరాలు - జీనార్‌ డయోడ్‌ - అభిలక్షణాలు - అనువర్తనాలు 

 పై అంశాలను సిలబస్‌ నుంచి పూర్తిగా తొలగించారు. వీటి నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం లేదు. ఏ ఒక్క యూనిట్‌ను పూర్తిగా తొలగించలేదు. కాబట్టి విద్యార్థులు గమనించి దానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలి. వెయిటేజి మారే అవకాశం లేనందున విద్యార్థులు గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ఏయే అంశాలు చదవాలో తెలుసుకోవాలి. బట్టీ పట్టకుండా విషయావగాహనతో చదివినట్లయితే ప్రశ్న ఏవిధంగా అడిగినా సమాధానం రాయడానికి వీలవుతుంది. 

మ‌రింత స‌మాచారం కోసం 

మోడ‌ల్ పేప‌ర్ స‌మాధానాల‌తో

Posted Date : 28-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌