• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అర్థం చేసుకొని చదివితే.. ఆశించిన మార్కులు!

రసాయన శాస్త్రాన్ని ఇష్టంగా అర్థం చేసుకుని చదివితే సులభంగా మార్కులు సంపాదించవచ్చు. ముఖ్యమైన ఫార్ములాలు.. రసాయన నామాలు, వెయిటేజి ఎక్కువ ఉన్న పాఠ్యాంశాలను నేర్చుకుంటే పరీక్షా సమయంలో హడావుడి ఉండదు. అదేవిధంగా రెండో ఏడాదితో ముడిపడి ఉన్న మొదటి సంవత్సరంలోని అంశాలను క్షుణ్నంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. 

ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం రసాయన శాస్త్రం ప్రశ్నపత్రం 60 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి.

విభాగం - ఎ:     అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు (2 × 10 = 20 మార్కులు)

విభాగం - బి:     స్వల్ప సమాధాన ప్రశ్నలు (4 × 6 = 24 మార్కులు)

విభాగం - సి:     దీర్ఘ సమాధాన ప్రశ్నలు (8 × 2 = 16 మార్కులు)

సిలబస్‌ విశ్లేషణ 

8 మార్కుల ప్రశ్నలు

విద్యుత్‌ రసాయనశాస్త్రం, రసాయన గతికశాస్త్రం

కోల్‌రాష్‌ నియమం, నెర్నెస్ట్‌ సమీకరణం, చర్యావేగం, చర్యా క్రమాంకం, చర్య అణుత, చర్యావేగంపై ఉష్ణోగ్రత, ఉత్ప్రేరకాల ప్రభావం

p -  బ్లాక్‌ మూలకాలు

హేబర్‌ విధానం ద్వారా అమ్మోనియా తయారీ, దాని ధర్మాలు; ఓజోన్‌ తయారీ, ధర్మాలు; క్లోరిన్‌ తయారీ, ధర్మాలు; గ్జినాన్‌ సమ్మేళనాలు 

కర్బన రసాయనశాస్త్రం

ఈ చాప్టర్‌పై ఎక్కువగా దృష్టి సారించడం ద్వారా అధిక మార్కులు పొందవచ్చు. ఇందులోని చర్యలు చాలా ముఖ్యమైనవి.

SN1, SN2 చర్యలు; సాండ్‌ మేయర్‌ చర్య, ఫింకేల్‌ స్టీన్‌ చర్య, స్వార్ట్స్‌ చర్య, ఉర్ట్జ్‌ చర్య, ఉర్ట్జ్‌ ఫిట్టింగ్‌ చర్య, ఫిట్టింగ్‌ చర్య, ఎస్టరీకరణం చర్య, కోల్బె చర్య, రీమర్‌-టీమన్‌ చర్య, విలియంసన్‌ చర్య, రోసన్‌ ముండ్‌ చర్య, స్టీఫెన్‌ చర్య, ఎటార్డ్‌ (Etard) చర్య, గట్టర్‌మన్‌ - కోచ్‌ చర్య, క్లైమన్‌సన్‌ క్షయకరణ చర్య, ఉల్ఫ్‌-కిష్నర్‌ చర్య, ఆల్డాల్‌ సంఘనన చర్య, డీకార్బాక్సిలీకరణం, H.V.Z. చర్య, గాబ్రియల్‌ థాలిమైడ్‌ చర్య, హాఫ్‌మన్‌ బ్రోమమైడ్‌ చర్య, కార్బైల్‌ ఎమీన్‌ చర్య.

4, 2 మార్కుల ప్రశ్నలు

ఘనస్థితి

బ్రాగ్‌ సమీకరణం, షాట్కీ, ఫ్రెంకెల్‌ లోపం (స్ఫటిక లోపాలు)

ద్రావణాలు

మొలారిటీ, మొలాలిటీ, మోల్‌ భాగం, రౌల్ట్‌ నియమం, హెన్రీ నియమం, కణాధార ధర్మాలు (సాపేక్ష బాష్పపీడన నిమ్నత, ద్రవాభిసరణ పీడనం)

ఉపరితల రసాయనశాస్త్రం

భౌతిక, రసాయన అధిశోషణాలు, ఉత్ప్రేరణం, ద్రవప్రియ, ద్రవవిరోధి కొల్లాయిడ్‌లు; బ్రౌనియన్‌ చలనం, టిండాల్‌ ప్రభావం. 

d, f  బ్లాక్‌ మూలకాలు, సమన్వయ సమ్మేళనాలు

పరివర్తన మూలకాల ధర్మాలు (అయస్కాంత, రంగు, ఉత్ప్రేరక ధర్మాలు), వెర్నర్‌ సిద్ధాంతం

జీవ అణువులు

ఆవశ్యక, అనావశ్యక అమైనో ఆమ్లాలు, ప్రొటీన్‌ డీనాచురేషన్, న్యూక్లిక్‌ ఆమ్లాల జీవప్రక్రియలు

యూనిట్ల వారీగా వెయిటేజి

*    ఘనస్థితి: 2 + 2 + 4 మార్కులు

*    ద్రావణాలు: 2 + 2 + 8 మార్కులు

*    విద్యుత్‌ రసాయన శాస్త్రం - రసాయన గతిక శాస్త్రం: 4 + 8 మార్కులు

*    ఉపరితల రసాయన శాస్త్రం: 2 + 4 + 4 మార్కులు

*    p - బ్లాకు మూలకాలు: 2 + 2 + 4 + 4 + 8 మార్కులు

*    d, f - బ్లాకు మూలకాలు, సమన్వయ సమ్మేళనాలు: 2 + 4 + 4 మార్కులు

*    జీవాణువులు: 2 + 4 మార్కులు

*    హాలో ఆల్కేన్‌లు, హాలో ఎరీన్‌లు: 4 మార్కులు

*    C, H, O లు ఉన్న కర్బన సమ్మేళనాలు: 2 + 4 + 8 మార్కులు

*    నైట్రోజన్‌ గల కర్బన సమ్మేళనాలు: 4 మార్కులు

మ‌రింత స‌మాచారం కోసం 

మోడ‌ల్ పేప‌ర్ స‌మాధానాల‌తో

Posted Date : 11-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌