• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సమీకరణవాదం

          బీజగణితంపై అవగాహన లేకుండా, నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను సాధించడం కష్టం. బీజగణితంలోని సమస్యలను సాధించడానికి ప్రధాన ఉపకరణం సమీకరణం. విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో ఉత్పన్నమయ్యే సమస్యల్లో ఈ సమీకరణాలను మనం ఎదుర్కొంటాం. ఏకఘాతీయ, వర్గసమీకరణాల గురించి మనం ఇదివరకే నేర్చుకున్నాం. ఇప్పుడు సాధారణ సమీకరణ వాదంలోని కొన్ని ప్రాథమిక లక్షణాలను తెలుసుకుందాం.


* f(x) అనేది  n (> 0) వ తరగతి బహుపది అయితే, సమీకరణం f(x) = 0 ను n వ తరగతి బహుపది సమీకరణం అంటారు. దీన్ని n వ తరగతి బీజీయ సమీకరణం అని కూడా అంటారు.
* ఏదైనా సంకీర్ణ సంఖ్య α కు f(α) = 0 అయితే, సంకీర్ణ సంఖ్య α ను బహుపది f(x) కు సున్నా అనీ లేదా సమీకరణం f(x) = 0 కు మూలం అనీ అంటారు.
* f(x) = a0xn + a1xn-1 + a2 xn-2 + . . . + an = 0

ఒక బీజియ సమీకరణం అనుకోండి. 'x' ఘాతాల గుణకాలు వాస్తవ సంఖ్యలైతే f(x) = 0 ను వాస్తవ గుణకాలున్న బీజీయ సమీకరణం అంటారు.
* స్థిరాంకం కాని ప్రతి బహుపది సమీకరణానికి మూలం ఉంటుంది.
* ప్రతి 'n'వ తరగతి బహుపది సమీకరణానికి అత్యధికంగా 'n' మూలాలు ఉంటాయి.
* f(x) = a0xn + a1xn -1 + ... + an = 0 సమీకరణానికి   α1, α2 . . . αn మూలాలయితే
      
 * f(x) = 0  nవ తరగతి బీజీయ సమీకరణానికి 'm' బాహుళ్యత ఉన్న మూలం α అవ్వాలంటే 'α', m సార్లు మూలంగా సంభవిస్తుంది.   'α', f(x) = 0 కు m బాహుళ్యత ఉన్న మూలం అయితే  f'(x) = 0 సమీకరణానికి 'α' (m - 1) బాహుళ్యత ఉన్న మూలం అవుతుంది. f'(x), f(x) యొక్క అవకలజం.
f(x) = 0 'n' వ తరగతి బీజీయ సమీకరణానికి α1, α2 . . .  αn లు మూలాలైతే
                    f(x) = (x - α1) (x - α2) . . . (x - αn) = 0 
   


 f(x) = a0xn + a1xn-1 + a2xn-2 + . . . + an = 0  


* f(x) = 0 సమీకరణంలో x బదులు  ను ప్రతిక్షేపిస్తే, సమీకరణం f(x) = 0 మారకుండా ఉంటే అప్పుడు f(x) = 0 ను వ్యుత్ర్కమ సమీకరణం అంటారు.

* f(x) = 0 వ్యుత్ర్కమ సమీకరణం అయితే f(x) = 0 చెందే కోవ, మూలాలు.

Posted Date : 06-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌