• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రస్తారాలు - సంయోగాలు

1. (n+1)P5 .  nP6  =  2  :  7 అయితే n విలువ కనుక్కోండి.

2. ఆరుగురు బాలురు, అయిదుగురు బాలికలను ఒక వరుసలో

(i) బాలికలందరు ఒకే చోట ఉండేలా

(ii) ఏ ఇద్దరు బాలికలు పక్కపక్కన లేకుండా

(iii) బాలురు, బాలికలు ఒకరి తర్వాత ఒకరు వచ్చేలా (ఏకాంతరంగా)

(iv) ఏ ఇద్దరు బాలురు పక్కపక్కన రాకుండా ఎన్ని విధాలుగా అమర్చవచ్చు?

జవాబు: (i)  

        బాలికలందరూ ఒకేచోట ఉండాలి. కాబట్టి అయిదుగురు బాలికలను ఒక యూనిట్ అనుకుందాం. మిగిలిన ఆరుగురు బాలురు. ఈ యూనిట్లు మొత్తం 7 అవుతాయి. ఈ ఏడింటిని ఒక వరుసలో 7! విధాలుగా అమర్చవచ్చు. ఇప్పుడు ఒక యూనిట్‌లో ఉన్న అయిదుగురు బాలికలను వారిలో వారిని 5! విధాలుగా అమర్చవచ్చు.

  బాలికలందరూ ఒకేచోట ఉండేలా ఒక వరుసలో అమర్చే విధాల సంఖ్య  =  (7!)  (5!)

(ii) ఏ ఇద్దరు బాలికలూ పక్కపక్కన లేకుండా ముందుగా ఆరుగురు బాలురను ఒక వరసలో 6! విధాలుగా అమర్చవచ్చు.

                    

       ఇప్పుడు బాలురి మధ్యలో 5, మొదటిది, చివరిది మొత్తం 7 ఖాళీ స్థానాలు ఉంటాయి. ఈ 7 ఖాళీల్లో అయిదుగురు బాలికలను 7P5 విధాలుగా అమర్చవచ్చు. కాబట్టి ఏ ఇద్దరు బాలికలు పక్కపక్కన లేకుండా

అమర్చే విధానాల సంఖ్య 6!  ×  7P5

(iii) 

          ఆరుగురు బాలురు, అయిదుగురు బాలికలు ఒకరి తర్వాత ఒకరు వచ్చేలా ఒక వరుస క్రమంలో అమర్చే విధానాల సంఖ్య = 6!.5!

(iv) 

     అయిదుగురు బాలికలను అమర్చగల విధానాలు = 5! 

     ఆరుగురు బాలురను అమర్చగల విధానాల సంఖ్య = 6! 

     మొత్తం విధానాలు = 5!.6!

3. 1, 2, 4, 5, 6 అంకెలతో ఏర్పరచగలిగే 4 అంకెల సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి. (పునరావృతం కాకుండా).

సాధన: 4P3 (1 + 2 + 4 + 5 + 6) (1 + 10 + 100 + 1000)

              =   4P3 (18) (1111)

              =   4,79,952

4. 'VICTORY' అనే పదంలోని అన్ని అక్షరాలను ఉపయోగించి ప్రస్తారించడం వల్ల వచ్చే పదాలను నిఘంటువు క్రమంలో రాస్తే ఆ వరుసలో 'VICTORY' పదం  కోడ్‌ని కనుక్కోండి

సాధన: దత్తపదంలోని అక్షరాల నిఘంటువు క్రమం C, I, O, R, T, V, Y

ఇప్పుడు అమరికలు

C  - - - - - -  =  6!  =  7 20

I  - - - - - -   =  6!  =  720

O  - - - - - -  =  6!  =  720

R  - - - - - -   = 6!  = 720

T  - - - - - -  =  6!  =  720

VC  - - - - -  =  5!  =  120

VIOC  - - -   =  3!  =  006

VICR  - - -   =  3!  =  006

VICTORY   =   1!   = 001

VICTORY  పదం కోడ్‌ 3733

5. INDEPENDENCE పదంలోని అక్షరాలను ఎన్ని రకాలుగా అమర్చవచ్చు?

సాధన: INDEPENDENCE లో 12 అక్షరాలు ఉన్నాయి. వీటిలో I ఒకసారి N మూడుసార్లు, D రెండుసార్లు E నాలుగుసార్లు, P ఒకసారి, C ఒకసారి వచ్చాయి.

6. nPr  =  5040, nCr  =  210 అయితే n, r లను కనుక్కోండి.

సాధన:     nPr = r! nCr    5040 = r!. 210

                 ⇒ 24 = r!   ... r = 4

                 nP4   =   5040   =   10.9.8.7

                 ...  n  =  10

7. 3    r    n  కు (n-3)Cr   +   3. (n-3)C(r-1)   +  3.(n-3)C(r-2)  +  (n-3)C(r-3) = nCrఅని నిరూపించండి

సాధన  :  L.H.S = (n-3)Cr  +  (n-3)C(r − 1) + 2.[(n-3) C(r-1)  +  (n-3)C(r-2)]

                                         + (n-3)C(r-2) +  (n-3)C(r-3)

                                  = (n-2)Cr  +  2 [(n-2)C(r-1)]  +  (n-2)C(r-2)

                                  = [(n-2)Cr + (n-2)C(r-1)]  +  [(n-2)C(r-1)  +  (n-2)C(r-2)]

                                  = (n-1)Cr  +  (n-1)C(r-1)

                                 = nCr = R.H.S.

8. ఆరుగురు భారతీయులు, అయిదుగురు అమెరికా దేశస్థుల నుంచి అయిదుగురు సభ్యులున్న కమిటీని, ఆ కమిటీలో భారతీయుల సంఖ్య పెద్దగా ఉండేలా ఎన్ని రకాలుగా ఎంచుకోవచ్చు?

సాధన :

     

మొత్తం విధానాలు       = 6C3 . 5C2  +  6C4 .5C1 +  6C5 . 5C0

                                  = (20)(10) + (15)(5) + (6)(1)

                                  = 200 + 75 + 6 = 281
 

Posted Date : 11-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌