• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వృత్త సరణులు

నిర్వచనం: వృత్త సరణి అంటే వృత్తాల సమూహం.
మూలాక్షం: రెండు వృత్తాల మధ్య ఉండే రేఖ.


మూలకేంద్రం: మూలాక్షాల ఖండన బిందువు
                              


 


సహాక్ష వృత్తసరణి : వృత్తం, సరళరేఖ (లేదా వృత్తం) ఖండించుకుంటే వాటి ఖండన బిందువుల ద్వారా వెళ్లే వృత్తాలను సహాక్ష వృత్తసరణులు అంటారు.


అవధి బిందువులు: వ్యాసార్ధం సున్నా అయ్యేలా సహాక్ష వృత్తసరణి యొక్క కేంద్రాన్ని అవధి బిందువులు అంటారు.


భావనాత్మక సిద్ధాంతాలు
1) S = 0 మరియు S' = 0 పరస్పరం ఖండించుకునే రెండు వృత్తాలు, r1, r2 లు వరుసగా వాటి వ్యాసార్ధాలు మరియు 'd' వాటి కేంద్రాల మధ్యదూరం, మరియు ఆ వృత్తాల మధ్యకోణం θ అయితే 
               

నిరూపణ:

C1 మరియు C2 లు కేంద్రాలు అనుకుందాం.
దత్తాంశం: C1C2 = d
ఇచ్చిన వ్యాసార్ధాలు: r1 మరియు r2
పటము నుంచి: C1P = r1; C2P = r2

కొసైన్ నియమం నుంచి: 

2) S = 0 మరియు S' = 0 అనే రెండు వృత్తాలు పరస్పరం లంబచ్ఛేదకం చేసుకోవడానికి నియమం
 2gg' + 2ff ' = c + c' అని చూపండి.
నిరూపణ:




3) సహాక్ష వృత్తసరణి సమీకరణం లఘురూపంలో x2 + y2 + 2λx + c = 0 అని చూపండి.

నిరూపణ: g, f మరియు c యొక్క విభిన్న విలువలకు సహాక్ష వృత్తసరణిలో x2 + y2 + 2gx + 2fy + c = 0 అనేది వృత్తాలను సూచిస్తుంది అనుకుందాం. సహాక్ష వృత్తసరణికి, కేంద్రాలను కలిపే రేఖను  x- అక్షం అని, మూలాక్షాన్ని
y-అక్షం అని అనుకుందాం.
సహాక్ష వృత్తసరణిలోని వృత్తాల అన్ని కేంద్రాలు x- అక్షం మీద ఉంటున్నాయి. కాబట్టి వాటి  y- నిరూపకాలు సున్నాలు అవుతాయి.
​​​​​​​
సహాక్ష వృత్తసరణిలోని రెండు వృత్తాలను
x2 + y2 + 2g1x + c1 = 0 ............. (1)    x2 + y2 + 2g2x + c2 = 0 ............... (2)
(1) మరియు (2) వృత్తాల మూలాక్షం
2 (g1 - g2) x + (c1 - c2) = 0
మూలాక్షం y- అక్షం అవుతుంది. కాబట్టి x = 0

అప్పుడు (1) మరియు (2) వృత్తాలు
x2 + y2 + 2g1x + c = 0 ................ (3)
x2 + y2 + 2g2x + c = 0 ................ (4)
గా మారతాయి.
        ఇదే విధంగా, x2 + y2 + 2g3x + c = 0 అనేది (3) మరియు (4) వృత్తాలతో సహాక్ష వృత్తసరణి అవుతుంది. అందువల్ల, x2 + y2 + 2λx + c = 0 అనేది లఘురూపంలో సహాక్ష వృత్తసరణి అవుతుంది. ఇక్కడ ' λ' అనేది పరామితి మరియు 'c' ఒక స్థిరరాశి.

Posted Date : 10-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌