• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సంస‌ర్గ వ్య‌వ‌స్థ‌లు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు


అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు


1. సంచార వ్యవస్థ ప్రాథమిక అంగాలు ఏమిటి?
జ: ప్రసారిణి, ప్రసార ఛానెల్, గ్రాహకాలు సంచార వ్యవస్థ ప్రాథమిక అంగాలు.

 

2. ప్రపంచ వ్యాప్త వెబ్ (www) అంటే ఏమిటి?
జ: www అనేది విజ్ఞానానికి సంబంధించిన బృహత్ ఎన్‌సైక్లోపీడియా. ఇది ఎప్పుడూ 24 గంటలూ అందరికీ అందుబాటులో ఉండే వ్యవస్థ.

 

3. మాడ్యులేషన్‌ను నిర్వచించండి. ఇది ఎందుకు అవసరం?
జ: తక్కువ పౌనఃపున్యం ఉన్న సందేశ సంకేతాలను ఎక్కువ పౌనఃపున్యం ఉన్న వాహక సంకేతాలతో అధ్యారోపణం చెందించే ప్రక్రియను మాడ్యులేషన్ అంటారు. తక్కువ పౌనఃపున్యం ఉన్న సంకేతాలు ఎక్కువ దూరం ప్రయాణించలేవు. కాబట్టి మాడ్యులేషన్ అవసరం.

 

4. మాడ్యులేషన్ ప్రాథమిక పద్ధతులను తెలపండి?
జ: మాడ్యులేషన్ ప్రాథమిక పద్ధతులు
1) కంపన పరిమితి మాడ్యులేషన్ (AM).

2) పౌనఃపున్య మాడ్యులేషన్ (FM).
3) దశా మాడ్యులేషన్ (PM).

 

5. వాక్ సంకేతాల పౌనఃపున్య వ్యాప్తిని తెలపండి?
జ: 20 Hz నుంచి 20 KHz

 

6. దృశాతంతువు ద్వారా ప్రసారం చేయగలిగే TV సంకేతాల గరిష్ఠ సంఖ్య ఎంత?

జ:

7. రేడియో తరంగాల ప్రసారానికి వివిధ పద్ధతులు ఏవి?
జ: రేడియో తరంగాలు మూడు పద్ధతుల్లో ప్రసారమవుతాయి.
1) భూతరంగ ప్రసారం
2) వ్యోమ తరంగ ప్రసారం
3) అంతరిక్ష తరంగ లేదా ప్రత్యక్ష తరంగ ప్రసారం.

 

8. భూతరంగ ప్రసారం అంటే ఏమిటి?
జ: భూమికి దగ్గరగా 2 MHz కంటే తక్కువ పౌనఃపున్యంతో జరిపే సంచార ప్రసారాన్ని భూతరంగ ప్రసారం అంటారు.

9. వ్యోమ తరంగ ప్రసరణం అంటే ఏమిటి?
జ: సుమారు 30 MHz పౌనఃపున్యం వరకు ఐనో ఆవరణం నుంచి పరావర్తనం చెందే విద్యుదయస్కాంత తరంగాలను ఎక్కువ దూరం ప్రసారం చేయడాన్ని వ్యోమ తరంగ ప్రసరణం అంటారు.

 

10. దృష్టిరేఖా సంచారంలో hT ఎత్తున్న టవర్ ఉద్గారించే వ్యాప్తి ఎంత? 
జ:  


ఇక్కడ R -  భూమి వ్యాసార్ధం.
 

11. మొబైల్ ఫోన్లలో ఏరకమైన సంచారం ఉంటుంది?
జ: మొబైల్ ఫోన్లలో వైర్‌లెస్ సంచారం ఉంటుంది. ఇందులో అంతరిక్ష తరంగాలను ఉపగ్రహ సంచారానికి ఉపయోగిస్తారు.

Posted Date : 27-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌