• facebook
  • twitter
  • whatsapp
  • telegram

 వికిర‌ణం, ద్ర‌వ్యం - ద్వంద్వ స్వ‌భావం

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

స్వల్ప సమాధాన ప్రశ్నలు (4 మార్కులు)


1. మోస్లే నియమం అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యతను తెలపండి.
జ: X - కిరణాల అభిలక్షణ వర్ణపట రేఖ పౌనఃపున్య వర్గమూలం టార్గెట్ మూలక పరమాణు సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. 


                             
ప్రాముఖ్యం
1) మోస్లే నియమం మూలకాలను పరమాణు భారాలను బట్టి కాకుండా పరమాణు సంఖ్యను బట్టి పునఃవ్యవస్థీకరించడానికి దోహదపడుతుంది. దీన్నిబట్టి ఆవర్తన పట్టికలో ఆర్గాన్ మూలకం పొటాషియం ముందు, కోబాల్ట్ నికెల్ ముందు స్థానాల్లో వస్తాయని సూచించారు.
2) ఈ నియమం మసూరియం, ఇల్లీనియం లాంటి కొత్త మూలకాలను కనిపెట్టడానికి తోడ్పడింది.
3) ఈ నియమం క్షార మృత్తిక మూలకాల పరమాణు సంఖ్యలను కనుక్కుని మూలకాల వర్గీకరణ క్రమబద్ధం చేయడానికి ఉపయోగపడింది.

2. పని ప్రమేయం, ఆరంభ పౌనఃపున్యాలను నిర్వచించి, వాటి మధ్య ఉన్న సంబంధానికి ఫార్ములాను తెలపండి.
జ: పని ప్రమేయం (Wo):
              లోహ ఉపరితలాన ఉన్న ఎలక్ట్రాన్ వెలుపలికి ఉద్గారం కావడానికి కావల్సిన కనీస శక్తిని ఆ లోహతల పని ప్రమేయం అంటారు.
                    దీన్ని ' Wo' తో సూచిస్తాం.
ఆరంభ పౌనఃపున్యం (
):
లోహ ఉపరితలం నుంచి ఎలక్ట్రాన్ బయటికి రావడానికి పతన వికిరణానికి ఉండాల్సిన కనీస పౌనఃపున్యాన్ని ఆ లోహ ఆరంభ పౌనఃపున్యం అంటారు. 
పని ప్రమేయం (Wo), ఆరంభ పౌనఃపున్యం (
)ల మధ్య సంబంధం W= h 


 

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు (2 మార్కులు)
 

1. ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఒకే డీ బ్రోగ్లీ తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటిలో దేనికి ఎక్కువ ద్రవ్యవేగం, గతిశక్తి ఉంటాయి?
జ:  డీ బ్రోగ్లీ తరంగదైర్ఘ్యం  

* ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఒకే డీ బ్రోగ్లీ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటే, వాటి ద్రవ్యవేగాలు కూడా సమానం.

* ద్రవ్యవేగాలు సమానం అయినప్పుడు, తక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువు ఎక్కువ గతిశక్తితో ఉంటుంది.   కాబట్టి, ఎలక్ట్రాన్ ఎక్కువ గతిశక్తి కలిగి ఉంటుంది.
 

2. డీ బ్రోగ్లీ తరంగాలు అంటే ఏమిటి?
జ: ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్‌లు లాంటి కణాలు ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. అంటే కణ స్వభావాన్ని, తరంగ స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. కణాలతో సహచర్యం ఉన్న తరంగాలను ద్రవ్యతరంగాలు లేదా డీ బ్రోగ్లీ తరంగాలు అంటారు.
డీ బ్రోగ్లీ తరంగాలు తరంగ ధైర్ఘ్యం 

Posted Date : 27-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌