• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ద్రావణాలు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

1. కిందివాటిని నిర్వచించండి.

    ఎ) ఐసోటోనిక్ ద్రావణాలు            

    బి) ఆదర్శ ద్రావణం 

    సి) మోలాల్ ఉన్నతి స్థిరాంకం (ఎబులియోస్కోపిక్ స్థిరాంకం)

    డి) మోలాల్ నిమ్నతి స్థిరాంకం (క్రయోస్కోపిక్ స్థిరాంకం) 

జ: 

     ఎ) ఒకే విధమైన పరిస్థితుల వద్ద ఒకే ద్రవాభిసరణం ఉన్న ద్రావణాలు 

     బి) అన్ని గాఢతలు, ఉష్ణోగ్రతల వద్ద రౌల్ట్ నియమాన్ని పాటించే ద్రావణం. 

     సి) ఒక మోలాల్ ద్రావణం ప్రదర్శించే బాష్పీభవన స్థాన ఉన్నతి.

     డి) ఒక మోలాల్ ద్రావణం ప్రదర్శించే ఘనీభవన స్థాన నిమ్నతి.

2. కిందివాటిని నిర్వచించండి.

      ఎ) ద్రవాభిసరణం 

      బి) ద్రవాభిసరణ పీడనం 

      సి) ఘనీభవన స్థాన నిష్పత్తి 

      డి) బాష్పీభవన స్థాన ఉన్నతి.

జ: 

      ఎ) విలీన ద్రావణం నుంచి గాఢ ద్రావణంలోకి ద్రావణి చొచ్చుకువెళ్లే ప్రక్రియ. 

      బి) ద్రావణంలోకి ద్రావణి వెళ్లకుండా నిరోధించడానికి, ద్రావణంపై ప్రయోగించాల్సిన పీడనం. 

      సి) ద్రావణి ఘనీభవన స్థానానికి, ద్రావణం ఘనీభవన స్థానానికి మధ్య ఉండే భేదం. 
                                          Δ Tf = Tfo - Tf.

      డి) ద్రావణం బాష్పీభవన స్థానానికి, ద్రావణి బాష్పీభవన స్థానానికి మధ్య ఉండే భేదం. 
                                          ΔTb = Tb - Tbo.

3. ఎ) H2SO

    బి) Na2CO3 

    సి) ఆమ్ల యానకంలో KMnO4

    డి) ఆమ్ల యానకంలో K2Cr2O7 ల తుల్యభారాలను లెక్కించండి.

జ: 


            
 

4. కణాధార ధర్మాలంటే ఏమిటి? రెండు ఉదాహరణలు ఇవ్వండి.

జ:  విలీన ద్రావణం ధర్మాలు, ద్రావితం కణాల సంఖ్య మీదే ఆధారపడితే ఆ ధర్మాలను కణాధార ధర్మాలు అంటారు.              

ఉదా: ద్రవాభిసరణ పీడనం, బాష్పీభవన స్థాన నిమ్నతి.

5. రౌల్ట్ నియమాన్ని తెలపండి. 10 గ్రాముల అబాష్పశీలి ద్రావితాన్ని 80 గ్రాముల ఇథనోల్‌లో 298 K వద్ద కరిగిస్తే, ఏర్పడే ద్రావణం బాష్పపీడనం ఎంత? ద్రావితం అణుభారం 120; 298 K వద్ద ఆల్కహాల్ బాష్పపీడనం 22.45 మి.మీ.

జ:  విలీన ద్రావణం సాపేక్ష బాష్పపీడనం నిమ్నత, ద్రావణంలో ఉన్న అబాష్పశీలి ద్రావితం మోల్ భాగానికి సమానం.


                          

విలీన ద్రావణానికి 


                                      

6. ఎ) ఒక ద్రావణంలో 90 గ్రాముల H2O, 6.4 గ్రాముల మిథనోల్ ఉన్నాయి. అయితే మిథనోల్ మోల్ భాగం ఎంత?

    బి) 250 మి.లీ. 0.05 N Na2CO3 ద్రావణాన్ని 0.01 N ద్రావణంగా మార్చడానికి కలపాల్సిన నీటి ఘనపరిమాణాన్ని కనుక్కోండి.

జ:

 
    

2 మార్కుల ప్రశ్నలు:

1. ద్రావణం ppm అంటే ఏమిటి?

జ: ఒక మిలియన్ భాగాల ద్రావణంలో ఉండే ఒక అనుఘటక భాగాలు.


    
 

2. హెన్రీ నియమాన్ని తెలపండి.

జ: నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువు పాక్షిక పీడనం (p) (వాయు ప్రావస్థలో), దాని మోల్ భాగానికి (x) అనులోమానుపాతంలో ఉంటుంది.

KH = హెన్రీ నియమ స్థిరాంకం.

3. నీటిలో H2S వాయువు ద్రావణీయత STP వద్ద 0.195 m. హెన్రీ నియమ స్థిరాంకాన్ని లెక్కించండి.

    H2S మోల్‌ల సంఖ్య = nH2S = 0.195

    STP వద్ద పీడనం = p = 0.987 బార్

4. మిథనోల్‌లో 250 మి.లీ. 0.15 మోలార్ బెంజోయిక్ ఆమ్ల ద్రావణాన్ని తయారుచేయడానికి అవసరమైన బెంజోయిక్ ఆమ్ల పరిమాణాన్ని లెక్కించండి.

5.  75 గ్రా. బెంజీన్‌లో 2.5 గ్రాముల ఇథనోయిక్ ఆమ్లం ఉంటే ఆ ద్రావణం మొలాలిటీ ఎంత?


 

6.  భారాత్మకంగా 20% ఇథలీన్ గ్లైకాల్ (C2H6O2) ఉండే జలద్రావణంలో ఇథలీన్ గ్త్లెకాల్ మోల్ భాగాన్ని లెక్కించండి.

7.  293 K వద్ద నీటి బాష్పపీడనం 17.535 mm Hg. 293 K వద్ద 25 గ్రాముల గ్లూకోజ్‌ను 450 గ్రా. నీటిలో కరిగిస్తే వచ్చిన ద్రావణం యొక్క బాష్పపీడనాన్ని గణించండి.

8. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద శుద్ధ బెంజీన్ బాష్పపీడనం 0.850 బార్. 0.5 గ్రా. భారం ఉన్న అబాష్పశీల అవిద్యుద్విశ్లేష్య పదార్థం 39 గ్రా. బెంజీన్ (మోలార్ ద్రవ్యరాశి 78)కు కలిపారు. అప్పుడు ఆ ద్రావణం బాష్పపీడనం 0.845 బార్. అయితే ఘనపదార్థం మోలార్ ద్రవ్యరాశి ఎంత?

  

9.  300 K వద్ద గ్లూకోజ్ ద్రావణం ద్రవాభిసరణ పీడనం 1.52 బార్. అయితే, ఆ ద్రావణం గాఢత ఎంత?

జ:  గ్లూకోజ్ ద్రవాభిసరణ పీడనం = 1.52 బార్. C = ద్రావణం గాఢత = ?

     R = 0.083 లీ.బార్ మోల్-1K-1      T = 300 K    


          
 

10. 1 గ్రా. అబాష్పశీల ద్రావితాన్ని 50 గ్రా. బెంజీన్‌లో కరిగిస్తే బెంజీన్ ఘనీభవన స్థానం 0.40 K తగ్గింది. బెంజీన్ ఘనీభవన స్థాన నిమ్నత స్థిరాంకం 5.12 K kg mol-1. ద్రావితం మోలార్ ద్రవ్యరాశిని కనుక్కోండి

జ:    Tf = Kf .m

4 మార్కుల ప్రశ్న

1. ఆదర్శ ద్రావణం అంటే ఏమిటి?

జ: అన్ని గాఢతలు, ఉష్ణోగ్రతల వద్ద రౌల్ట్ నియమాన్ని పాటించే ద్రావణాన్ని ఆదర్శ ద్రావణం అంటారు.

 మిశ్రమం చేసేటప్పుడు, ఎంథాల్పీలో మార్పు (Hmix) సున్నా.

 మిశ్రమం చేసేటప్పుడు ఘనపరిమాణంలో మార్పు (Vmix) సున్నా.

 p = pA + pB = pA0 x A + pB0 x B

 ద్రావితం - ద్రావితం, ద్రావణి - ద్రావణి మధ్య అన్యోన్య బలాలు, ద్రావణి - ద్రావితం అన్యోన్య బలాలకు సమానం

Posted Date : 29-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌