• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉపరితల రసాయనశాస్త్రం 

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

4 మార్కుల ప్రశ్నలు

1. సజాతీయ, విజాతీయ ఉత్ప్రేరణాల గురించి వివరించండి.

జ: ఉత్ప్రేరణంలో రకాలు:  క్రియాజనకాలు, ఉత్ప్రేరకం ఒకే ప్రావస్థలో (వాయు లేదా ద్రవ) ఉండే ఉత్ప్రేరణ. 
ఉదా: 2 SO2 (వా) + O2 (వా)  2 SO3

విజాతీయ ఉత్ప్రేరణ: క్రియాజనకాలు, ఉత్ప్రేరకం వేర్వేరు ప్రావస్థల్లో ఉండే ఉత్ప్రేరణ. 
ఉదా: N2 (వా) + 3 H2 (వా)  2 NH3

 

2. ఉత్ప్రేరకం అభిలాక్షణిక ధర్మాలను తెలపండి.

జ: ఉత్ప్రేరకం చర్యను ప్రారంభించదు. ఇది చర్యాసమతాస్థితి స్థానాన్ని ప్రభావితం చెయ్యదు. చర్య జరిగేటప్పుడు వినియోగం కాదు. ఇది చర్యావేగాన్ని పెంచడం లేదా తగ్గించడం చెయ్యగలదు. దీనిని కొద్ది మొత్తంలో తీసుకున్నా చర్యావేగాన్ని ప్రభావితం చెయ్యగలదు. ఉష్ణోగ్రత మార్పుతో ఉత్ప్రేరణ చర్యరేటులో మార్పు వస్తుంది. చూర్ణస్థితిలో ఉంటే దీని చర్యాశీలత అధికం. ఉత్ప్రేరకం చర్యను నిర్దేశిస్తుంది.

3. 'టిండాల్ ఫలితం', 'బ్రౌనియన్ చలనం' అంటే ఏమిటి?

జ: ''కొల్లాయిడ్ ద్రావణం ద్వారా కాంతిని పంపితే, కొల్లాయిడ్ కణాలు కాంతిని విక్షేపణం చేసి కాంతిమంతమైన శంఖాకార పుంజాన్ని ఏర్పరచడాన్ని టిండాల్ ఫలితం'' అంటారు. ''కొల్లాయిడ్ ద్రావణంలోని కొల్లాయిడ్ కణాలు నిరంతరం క్రమరాహిత్యంగా అన్ని దిశల్లోనూ చలించడాన్ని బ్రౌనియన్ చలనం'' అంటారు.
 

4. భౌతిక అధిశోషణం, రసాయనిక అధిశోషణాల మధ్య నాలుగు భేదాలను తెలపండి.

5. నిజద్రావణాలు, కొల్లాయిడ్ ద్రావణాల మధ్య నాలుగు భేదాలను తెలపండి.

జ:

6. ద్రవప్రియ, ద్రవవిరోధ కొల్లాయిడ్ ద్రావణాల మధ్య నాలుగు భేదాలను తెలపండి.

జ:


 

7. మిసెల్ అంటే ఏమిటి? సబ్బుతో పరిశుభ్రంచేసే ప్రక్రియను వివరించండి. 

జ: ''సూక్ష్మస్థితిలో ఉన్న అణువులు లేదా అయాన్లు సముచ్ఛయంగా ఏర్పడి ద్రవప్రియ అంత్యం (తల), ద్రవ్యవిరోధ అంత్యం (తోక) ఉండే కొల్లాయిడ్ సైజులో ఏర్పడే కణాన్ని ''సముచ్ఛయ కాంజికాభం (మిసెల్)'' అంటారు.

సబ్బుతో పరిశుభ్రం చేసే ప్రక్రియ:   సబ్బుని సోడియం స్టియరేట్‌గా భావించవచ్చు. దీనిలో Na+ అయాన్లు C17H35 COO- (స్టియరేట్) అయాన్లు ఉంటాయి.

ఈ స్టియరేట్ అయాన్‌లో C17H35 అధ్రువభాగం (తోక) ఉంటుంది. ఇది దుస్తులపై ఉన్న మురికిని, జిడ్డుని తనలో కరిగించుకుంటుంది. కాగా ధ్రువభాగమైన COO-  (తల) నీటిని ఆకర్షిస్తుంది.

ఈ రెండూ కలసి ''నీరు-మురికి'' ఎమల్షన్‌గా ఏర్పడేందుకు సబ్బు తోడ్పడుతుంది. దుస్తులను జాడించి, ఉతికినప్పుడు ఈ ఎమల్షన్ నీటితోపాటు బయటికి వెళ్లిపోయి దుస్తులు శుభ్రపడతాయి.
 

8. స్కందనం అంటే ఏమిటి? హార్డే షుల్జ్ నియమాన్ని తెలపండి.

జ: ''ఒక కొల్లాయిడ్ ద్రావణానికి విద్యుద్విశ్లేష్యకాన్ని కలిపితే కొల్లాయిడ్ కణాలు ఆవేశాన్ని కోల్పోయి అవక్షేపంగా కిందికి రావటాన్ని స్కందనం అంటారు.'' హార్డే షుల్జ్ నియమం ప్రకారం ''కొల్లాయిడ్ విద్యుదావేశానికి, విరుద్ధ ఆవేశం ఉండే అయాన్‌ని కలిపితే స్కందనం జరుగుతుంది. అయాన్ ఆవేశం పెరిగే కొద్దీ స్కందనం చెయ్యగల సామర్థ్యం కూడా పెరుగుతుంది.

ధనాత్మక కొల్లాయిడ్ స్కందన సామర్థ్యం: Cl-< SO4-2< PO4-3

రుణాత్మక కొల్లాయిడ్ స్కందన సామర్థ్యం: K+< Ba+2< Al+3

9. ఎ) పొగ బి) మేఘం సి) రక్తం డి) పాలు వీటిలో విక్షిప్తప్రావస్థ, విక్షేపణ యానకాలను గుర్తించండి.

జ:

Posted Date : 09-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌