• facebook
  • twitter
  • whatsapp
  • telegram

16వ గ్రూపు మూలకాలు 

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

2 మార్కులు
1. SF4, SF6 నిర్మాణాలను వివరించండి.
జ:

SF4



 
S సంకరీకరణం: sp3d
ఆకృతి: తూగుడు బల్ల

SF6 

S సంకరీకరణం: sp3d2
 ఆకృతి: అష్టముఖీయ

2. గది ఉష్ణోగ్రత వద్ద H2O ద్రవం కాగా H2S వాయువు. ఎందువల్ల?
జ:


           
ఆక్సిజన్ అల్ప పరమాణు సైజు , అధిక రుణవిద్యుదాత్మకత వల్ల అంతరణుక హైడ్రోజన్ బంధాలు ఏర్పడి H2O అణువులు దగ్గరగా రావడం వల్ల H2O ద్రవస్థితిని పొందుతుంది. H - S బంధాలు హైడ్రోజన్ బంధాలను ఏర్పరచలేకపోవడం వల్ల H2S వాయువుగానే ఉంటుంది.

 

3. ఎ) తటస్థ ఆక్సైడ్ బి) పెరాక్సైడ్ సి) సూపర్ ఆక్సైడ్ డి) ద్విస్వభావ ఆక్సైడ్‌లకు ఒక్కో ఉదాహరణ ఇవ్వండి.
జ:  ఎ) NO బి)H2O2 సి)KO2 డి) H2O

 

4. ఎ)SO2 బి)SO3 సి)SF4 డి) SF6 ల్లో S సంకరీకరణాన్ని తెలపండి.
జ:  ఎ)sp2 బి) sp2 సి)sp3d డి) sp3d2

 

5. 'టెయిలింగ్ ఆఫ్ మెర్క్యురీ' అంటే ఏమిటి? దీన్ని ఎలా తొలగిస్తారు?
జ:  మెర్క్యురీ O3 తో చర్య జరిపి Hg2O ను ఇస్తుంది. ఈ చర్యలో Hg లోహద్యుతిని, ద్రవ వక్రతలాన్ని కోల్పోయి గాజుపాత్ర గోడలపై అంటుకోవడాన్ని (Hg2O ఏర్పడటం వల్ల) 'టెయిలింగ్ ఆఫ్ మెర్క్యురీ' అంటారు.

Hg2O ను నీటిలో బాగా కుదిపితే తిరిగి పాదరస వక్రతలాన్ని పొందవచ్చు.
2 Hg + O3  
 Hg2O + O2

6. ఓజోన్ ఎ)C2H2 బి)C2H4ల తో ఎలా చర్య జరుపుతుంది?
జ:  ఎ) ఓజోన్ C2H2 తో ఎసిటలీన్ ఓజోనైడ్‌ను ఇస్తుంది.
C2H2 + O3   
 C2H2 . O3
బి) ఓజోన్ C2H4 తో ఇథలీన్ ఓజోనైడ్‌ను ఇస్తుంది.
C2H4 + O3  
  C2H4 . O3

7. ఓజోన్ ఉపయోగాలను ఏవైనా రెండింటిని తెలపండి.
జ:  * క్రిమిసంహారిణిగా.
     * నీటిని సూక్ష్మజీవిరహితంగా చేయడానికి.

 

8. ఏవైనా రెండు సల్ఫర్ ఆక్సీ ఆమ్లాల పేర్లు, ఫార్ములాలు, నిర్మాణాలను రాయండి.
జ:


             

9. SO2 ను యాంటీక్లోర్‌గా ఉపయోగించవచ్చు. వివరించండి.
జ: SO2 క్లోరిన్‌తో చర్య జరిపి సల్ఫ్యూరైల్ క్లోరైడ్‌ను ఏర్పరచడం ద్వారా Cl2 తొలగిపోతుంది. అందుకే SO2 ను యాంటీక్లోర్‌గా ఉపయోగించవచ్చు.
SO2 + Cl2   
 SO2Cl2

10. O2, O3 ల్లో పారా అయస్కాంత పదార్థమేది?
జ: MOT సిద్ధాంతం ప్రకారం O2 లో 2 జతకూడని బంధ ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల O2 పారా అయస్కాంత పదార్థం, O3 డయా అయస్కాంత పదార్థం.

 

11. SO4-2, SO3 నిర్మాణాలను వివరించండి.

జ:

 SO4-2

 
ఆకృతి: టెట్రాహెడ్రల్
S సంకరీకరణం:sp3
బంధకోణం: 10928' 

 SO3


 
ఆకృతి: సమతల త్రిభుజం
S సంకరీకరణం: sp2
 బంధకోణం: 120

12. అమ్మోనియాను అనార్ద్ర పరచడానికి (తేమను తొలగించడానికి) గాఢ H2SO4 ను ఉపయోగించరు.
ఎందువల్ల? దీన్ని అనార్ద్ర పరచడానికి దేన్ని ఉపయోగిస్తారు?
జ: గాఢ H2SO4 అమ్మోనియాతో చర్య జరిపి (NH4)2SO4 ను ఇస్తుంది. కాబట్టి NH3 ని అనార్ద్ర పరచడానికి క్విక్ లైమ్ (CaO) ను ఉపయోగిస్తారు.

 

13. ఓజోన్ పొరకు ఎదురయ్యే 2 సవాళ్లను తెలపండి.
జ: * రిఫ్రిజిరేటర్‌లో వాడే ఫ్రియాన్లు.
     * అతివేగంగా ప్రయాణించే జెట్ విమానాల నుంచి వెలువడే NO.
NO + O3  
 NO2 + O2.

4 మార్కులు

1. ఆక్సిజన్ నుంచి ఓజోన్‌ను ఎలా తయారు చేస్తారు?
ఎ) PbS      బి) తేమగా ఉండే KI     సి) Hg       డి) Ag లతో ఓజోన్ చర్యలను వివరించండి.
జ: శుద్ధ, పొడిగా ఉండే చల్లని ఆక్సిజన్ ద్వారా నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గాన్ని పంపిస్తే 10% ఓజోన్ తయారవుతుంది. ద్రవరూప O2 పరివేష్టితమై ఉన్న పాత్రలో పరిశుద్ధ ఓజోన్‌ను సంగ్రహిస్తారు.
3 O2  
 2 O3; H = +142 కి.జౌ./ మోల్
ఎ) ఓజోన్ నల్లని PbS ను తెల్లని PbSO4 గా ఆక్సీకరణం చేస్తుంది.
PbS + 4 O3
  PbSO4 + 4 O2
బి) ఓజోన్ తేమగా ఉండే KI ను I2 గా ఆక్సీకరణం చేస్తుంది.
2 KI + H2O + O3  
 I2 + O2 + 2 KOH
సి) ఓజోన్ Hg తో చర్య జరిపితే లోహద్యుతిని, ద్రవ వక్రతలాన్ని కోల్పోయి గాజు పాత్రల గోడలపై అంటుకుంటుంది. దీన్నే 'టెయిలింగ్ ఆఫ్ మెర్క్యురీ' అంటారు.

2 Hg + O3   Hg2O + O2
డి) ఓజోన్ Ag ను Ag2O గా ఆక్సీకరణం చేస్తుంది.
2 Ag + O3
  Ag2O + O2.

Posted Date : 13-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌