• facebook
  • twitter
  • whatsapp
  • telegram

17వ గ్రూపు మూలకాలు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

2 మార్కులు
1. Cl2 కంటే F2కు ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ తక్కువ. వివరించండి.
జ: Cl కంటే F పరమాణు సైజు తక్కువ. F బాహ్యస్థాయిలోని ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణలు, కొత్తగా కలిపిన ఎలక్ట్రాన్ వల్ల కలిగే వికర్షణల మూలంగా F కు సులభంగా ఎలక్ట్రాన్‌ను కలపలేం. దీనివల్ల Cl2 ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ (-349 కి.జౌ./మోల్) కంటే F2 ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ (-333 కి.జౌ./మోల్) తక్కువ.

 

2. HF ద్రవం కాగా HCl వాయువు. వివరించండి.
జ: F కు రుణవిద్యుదాత్మకత ఎక్కువగా ఉండటం వల్ల, H - F బంధాలకు H - Cl బంధాల కంటే ధ్రువణత ఎక్కువ ఉంటుంది. దీనివల్ల HF అణువుల మధ్య అంతరణుక హైడ్రోజన్ బంధాలేర్పడి అవి సహచరితంగా ఉంటాయి. కాబట్టి HF ద్రవం. HCl హైడ్రోజన్ బంధాలను ఏర్పరచలేకపోవడం వల్ల అది వాయువు.
          ..... H - F ..... H - F ..... H - F ..... H - F .....

 

3. కిందివాటికి తుల్య సమీకరణాలను రాయండి.
     ఎ) MnO2 సమక్షంలో NaCl ను గాఢ H2SO4 తో వేడిచేయడం
    బి) NaI జలద్రావణంలోకి Cl2 ను పంపడం.
జ: ఎ) MnO2 సమక్షంలో NaCl ను గాఢ H2SO4 తో వేడిచేస్తే Cl2 వెలువడుతుంది.

           4 NaCl + MnO2 + 4 H2SO4 MnCl2 + 4 NaHSO4 + 2 H2O + Cl2
బి) క్లోరిన్ NaI ను I2గా ఆక్సీకరణం చేస్తుంది.


             
 

4. ClF3 నిర్మాణాన్ని వివరించండి.


జ: Cl = [Ne] 3s2 3px2 3py1 3pz1 3d1 (1వ ఉద్రిక్త స్థాయి)
క్లోరిన్ sp3d సంకరీకరణంలో పాల్గొంటుంది.
ClF3కి T ఆకృతి ఉంటుంది.


 

5. ఎ) BrF5 బి) IF7 ఆకృతులను వివరించండి.
జ:           BrF5


    
బ్రోమిన్ sp3d2 సంకరీకరణంలో పాల్గొంటుంది. దీనికి చతురస్ర పిరమిడల్ ఆకృతి ఉంటుంది.

                           IF7


    
అయోడిన్ sp3d సంకరీకరణంలో పాల్గొంటుంది. దీనికి పెంటాగోనల్ బై పిరమిడల్ ఆకృతి ఉంటుంది.

6.  I3-  నిర్మాణాన్ని వివరించండి.
జ:

I3- లో 'I', sp3d సంకరీకరణంలో పాల్గొంటుంది. 3 ఒంటరి జంట ఎలక్ట్రాన్లు అక్షరేఖీయ స్థానాలను ఆక్రమించడం వల్ల దీనికి రేఖీయ ఆకృతి ఉంటుంది.


 

7.  Cl2 కంటే F2కి బంధ విఘటన ఎంథాల్పీ తక్కువ. ఎందువల్ల? వివరించండి.
జ: F పరమాణు సైజు చిన్నది కావడంతో F - F బంధదైర్ఘ్యం తక్కువ (1.48 A°). బాహ్యస్థాయిలో ఒంటరి జంట, ఒంటరి జంట వికర్షణల మూలంగా బంధం బలహీనమవుతుంది.


                                                     
     కాబట్టి Cl2 కంటే F2 బంధ విఘటన ఎంథాల్పీ తక్కువ.

 

8.  అనార్ద్ర తడిసున్నంతో Cl2 చర్య జరిపితే ఏమవుతుంది?
జ: అనార్ద్ర తడిసున్నంతో Cl2 చర్య జరిపితే బ్లీచింగ్‌పౌడర్ (కాల్షియంక్లోరోహైపో క్లోరైట్) ఏర్పడుతుంది.
     Ca(OH)2 + Cl2 CaOCl2 + H2O

9.  నీటితో చర్య జరిపి O2, O3లను ఇవ్వగల హాలోజన్‌ను పేర్కొనండి.
జ: F2 నీటితో చర్య జరిపి O2, O3లను ఇస్తుంది.


       
 

10.  ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ విలువ క్లోరిన్ కంటే తక్కువే అయినప్పటికీ క్లోరిన్ కంటే ఫ్లోరిన్ బలమైన ఆక్సీకరణి. ఎందువల్ల?
జ: ప్లోరైడ్ అయాన్ అధిక హైడ్రేషన్ ఎంథాల్పీ విలువ (515 కి.జౌ./ మోల్) అల్ప F - F బంధ విఘటన ఎంథాల్పీ విలువ (158.8 కి.జౌ./మోల్) కంటే ఎక్కువ.

 

11.  Cl2 నుంచి తయారు చేయదగిన 2 విషవాయువులను పేర్కొనండి.
జ: బాష్పవాయువు (CCl3NO2), ఫాస్‌జీన్ (COCl2).

 

4 మార్కులు
 

1.  Cl2 ను ప్రయోగశాలలో ఎలా తయారుచేస్తారు? క్లోరిన్ ఎ) ఐరన్ బి) ఆమ్లీకృత FeSO4 సి) H2S డి) Na2S2O3 లతో జరిపే చర్యలను రాయండి.
జ: MnO2 ను గాఢ HClతో చర్య జరిపి Cl2ను తయారు చెయ్యవచ్చు.


     

చర్యలు:
     ఎ) Feతో Cl2 చర్య జరిపి FeCl3ను ఇస్తుంది.
           2 Fe + 3 Cl2 2 FeCl3
     బి) క్లోరిన్ ఆమ్లీకృత ఫెర్రస్ సల్ఫేట్‌ను ఫెర్రిక్ సల్ఫేట్‌గా ఆక్సీకరణం చేస్తుంది.


          
     సి) Cl2, H2Sతో చర్య జరిపి HCl & S లను ఇస్తుంది.


          
     డి) Cl2, Na2S2O3 తో చర్యజరిపి Na2SO4ను ఇస్తుంది.


          
 

2.  విద్యుద్విశ్లేషణ పద్ధతిలో క్లోరిన్‌ను ఎలా తయారు చేస్తారు?
a) NaOH b) NH3 లతో విభిన్న పరిస్థితుల్లో Cl2 జరిపే చర్యలను వివరించండి.
జ: బ్రైన్ ద్రావణాన్ని విద్యుద్విశేషణం చేస్తే ఆనోడ్ వద్ద Cl2 వెలువడుతుంది.
     2 NaCl 2 Na+ 2 Cl- (అయనీకరణం)
     2 Cl Cl2 + 2 e-(ఆనోడ్ వద్ద)

చర్యలు:
     ఎ)  చల్లటి, విలీన NaOHతో: చల్లటి, విలీన NaOHతో Cl2 చర్య జరిపి NaCl, NaOCl లను ఇస్తుంది.
          2 NaOH + Cl2 NaCl + NaOCl + H2O
          వేడి, గాఢ NaOHతో: వేడి, గాఢ NaOHతో Cl2 చర్య జరిపి NaCl, NaClO3 లను ఇస్తుంది.
          6 NaOH + 3 Cl2 5 NaCl + NaClO3 + 3 H2O
     బి) ఎక్కువ Cl2తో: NH3 అధిక Cl2తో చర్య జరిపి NCl3 ను ఇస్తుంది.


          
       అధిక NH3తో: Cl2, అధిక NH3తో చర్య జరిపి NH4Cl ను ఇస్తుంది.
          8 NH3 + 3 Cl2 N2 + 6 NH4Cl

 

3.  అంతర హాలోజన్ సమ్మేళనాలంటే ఏమిటి? వాటిని ఎలా వర్గీకరిస్తారు? కొన్ని ఉదాహరణలతో వివరించండి.
జ: రెండు వేర్వేరు హాలోజన్ల మధ్య చర్య జరిగి ఏర్పడే సమ్మేళనాలనే అంతర హాలోజన్ సమ్మేళనాలు అంటారు.
      * వీటి సాధారణ ఫార్ములా AXn (n = 1, 3, 5 లేదా 7)
      * A పెద్ద హాలోజన్, X చిన్న హాలోజన్.

      * ఎల్లప్పుడూ X ఆక్సీకరణ స్థితి -1 కాగా A ఆక్సీకరణ స్థితులు +1, +3, +5 లేదా +7 ఉంటాయి.
      AX1 రకం అంతర హాలోజన్‌లు: ClF, BrF, BrCl, ICl
      AX3 రకం అంతర్ హాలోజన్‌లు: ClF3, BrF3, ICl3
      AX5 రకం అంతర్ హాలోజన్‌లు: BrF5, IF5
      AX7 రకం అంతర్ హాలోజన్‌లు: IF7

 

4.  క్లోరిన్ ఆక్సీ ఆమ్లాల పేర్లు, ఫార్ములాలు, ఆకృతులు, వాటి సాపేక్ష ఆమ్ల స్వభావాలను తెలపండి.

జ:


ఆమ్లత్వ క్రమం: HClO4 > HClO3 > HClO2 > HClO1

Posted Date : 13-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌