• facebook
  • twitter
  • whatsapp
  • telegram

17వ గ్రూపు మూలకాలు

 గాజుపై అందమైన చిత్రాలను చెక్కడం, బట్టలను బ్లీచింగ్ (విరంజనం) చెయ్యడం, నీటిని క్లోరినేషన్ చెయ్యడం, టెఫ్లాన్ పూతవేసిన అంటుకోని (non sticky) వంటపాత్రలు, ఫొటోగ్రాఫిక్ ఫిల్ములు, టింక్చర్ ఆఫ్ అయోడిన్ ..... ఇవన్నీ 17వ గ్రూపు మూలకాల కొన్ని అనువర్తనాలు మాత్రమే! 17వ గ్రూపులో F, Cl, Br, I, At ఉన్నాయి. గ్రీకు భాషలో 'హాలో' అంటే లవణం అని, 'జన్' అంటే పుట్టించేది అని అర్థం. ఈ గ్రూపు మూలకాలు లవణాలను ఏర్పరుస్తుండటం వల్ల వీటిని 'హాలోజన్‌లు' అంటారు. F2, Cl2 వాయువులు; Br2 ద్రవం; I2 ఘనపదార్థం. ఈ మూలకాలు వేర్వేరు క్వాంటమ్‌ల వికిరణాలను అధిశోషించుకోవడం వల్ల వివిధ రంగులను ప్రదర్శిస్తాయి. ఫ్లోరిన్‌కు పసుపు, క్లోరిన్‌కు పసుపు ఆకుపచ్చ, బ్రోమిన్‌కు ఎరుపు, అయోడిన్‌కు ఊదారంగు ఉంటాయి.
     ఫ్లోరిన్ ఫ్లోర్‌స్పార్ (CaF2), క్రయొలైట్ (Na3AlF6) , ఫ్లోరాపటైట్ [CaF2 . 3 Ca3(PO4)2]  రూపాల్లో లభిస్తుంది. క్లోరిన్ సముద్రంలో NaCl (2.5% భారాత్మకంగా), రాతి ఉప్పు (NaCl ), కార్నలైట్ (KCl . MgCl 2 . 6 H2O) రూపాల్లో లభిస్తుంది.

ఈ గ్రూపు మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ns2 np5. పరమాణు, అయానిక వ్యాసార్ధాలు గ్రూపులో పైనుంచి కిందకు పెరుగుతాయి. అయొనైజేషన్ ఎంథాల్పీ, రుణవిద్యుదాత్మకత, ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ గ్రూపులో పైనుంచి కిందకు తగ్గుతాయి. Fకి అత్యధిక రుణవిద్యుదాత్మకత, Cl కి అత్యధిక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఉంటాయి. F2 కి Cl2 కంటే ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ తక్కువ. Cl కంటే F పరమాణు సైజు తక్కువ. F బాహ్యస్థాయిలోని ఎలక్ట్రాన్ల మధ్య ఉండే వికర్షణలు, కొత్తగా కలపబడే ఎలక్ట్రాన్ వల్ల కలిగే వికర్షణల మూలంగా Fకి ఎలక్ట్రాన్‌ని సులభంగా కలపలేం. అందువల్ల Cl2 ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ (-349 కి.జౌ./ మోల్) కంటే F2 ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ (-333 కి.జౌ./ మోల్) తక్కువ.
ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ క్రమం: Cl2 > F2 > Br2 > I2.
X − X బంధవిఘటన ఎంథాల్పీ క్రమం: Cl2 > Br2 > F2 > I2.
          F పరమాణు సైజు, F - F బంధదైర్ఘ్యం తక్కువగా ఉండటం (1.48 A°) వల్ల ఒంటరి జంట - ఒంటరి జంట వికర్షణ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బంధవిఘటన ఎంథాల్పీలు F2 కి 158.8 కి.జౌ./ మోల్, Cl2కి 242.6 కి.జౌ./ మోల్, Br2కి 192.8 కి.జౌ./ మోల్ ఉంటాయి. F2 బలమైన ఆక్సీకరణి. ఒక హాలోజన్, అధిక పరమాణు సంఖ్య ఉండే హాలైడ్ అయాన్‌ను ఆక్సీకరణం చేస్తుంది.
          F2+ 2 X 2 F + X2 (X = Cl , Br, I)

 ఫ్లోరిన్‌కు తక్కువ పరమాణు పరిమాణం, అత్యధిక రుణవిద్యుదాత్మకత, తక్కువ F - F బంధ విచ్ఛేదక ఎంథాల్పీ, d - ఆర్బిటాళ్లు లేకపోవడం వల్ల F అసంగత ప్రవర్తనను ప్రదర్శిస్తుంది. ఫ్లోరైడ్ అయాన్ యొక్క అధిక హైడ్రేషన్ ఎంథాల్పీ (515 కి.జౌ./ మోల్), అల్ప F - F బంధవిఘటన ఎంథాల్పీ (158.8 కి. జౌ./ మోల్) కారణంగా Cl కంటే F బలమైన ఆక్సీకరణి (F ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ విలువ, Cl కంటే తక్కువే అయినప్పటికీ).
          అన్ని హాలోజన్‌లు H2తో చర్య జరుపుతాయి. ఆమ్లత్వ బల క్రమం: HF < HCl < HBr < HI. ఫ్లోరిన్, ఆక్సిజన్‌తో OF2, O2F2 లను ఏర్పరుస్తాయి. OF2, O2F2 లు ఫ్లోరినేటింగ్ కారకాలు. గది ఉష్ణోగ్రత వద్ద OF2 కి ఉష్ణ స్థిరత్వం ఉంటుంది. Cl యొక్క ఆక్సైడ్‌లు అధికంగా చర్య జరిపే ఆక్సీకరణులు కావడం వల్ల వీటికి పేలుడు స్వభావం ఉంటుంది. ClO2 పేపర్ గుజ్జు, వస్త్రాలను విరంజనం చేస్తుంది. Br, I ఆక్సైడ్‌లు కూడా బలమైన ఆక్సీకరణులు. ఫ్లోరిన్ ఆక్సీకరణ స్థితి -1. ఇతర హాలోజన్‌లు -1తో పాటు +1, +3, +5, +7 ఆక్సీకరణ స్థితులను కూడా ప్రదర్శిస్తాయి. F యొక్క అత్యధిక రుణవిద్యుదాత్మకత వల్ల ఇది కేవలం -1 ఆక్సీకరణ స్థితిని మాత్రమే ప్రదర్శిస్తుంది.






 

HCl



HCl ఉపయోగాలు:
* ప్రయోగశాల కారకంగా
* బంగారం, ప్లాటినం శుద్ధి చెయ్యడంలో HCl ను ఉపయోగిస్తారు.


హాలోజన్‌ల ఆక్సీఆమ్లాలు

         తక్కువ పరమాణు పరిమాణం, అధిక రుణవిద్యుదాత్మకత మూలంగా F కేవలం HOF ని మాత్రమే ఏర్పరుస్తుంది. Br, I లు HBrO3, HIO3, HBrO4, HIO4 లను ఏర్పరుస్తాయి. Cl మాత్రం HClO, HClO2, HClO3, HClO4 లను ఏర్పరుస్తుంది.
క్లోరిన్ ఆక్సీ ఆమ్లాలు
HClO (హైపోక్లోరస్ ఆమ్లం): దీనిలో Cl sp3 సంకరీకరణం చెందుతుంది. HClO అణువు రేఖీయంగా ఉంటుంది. Cl-O బంధదైర్ఘ్యం 170 pm. బంధకోణం 180o. Cl-O బంధశక్తి 209 కి.జౌ./మోల్.


HClO2 (క్లోరస్ ఆమ్లం): దీనిలో Cl sp3 సంకరీకరణం చెందుతుంది.
Cl-O బంధదైర్ఘ్యం 164 pm. బంధకోణం 1110. l-O బంధశక్తి 245 కి.జౌ./మోల్. దీని ఆకృతి = V


HClO3 (క్లోరిక్ ఆమ్లం): దీనిలో Cl, sp3 సంకరీకరణం చెందుతుంది. ఇది పిరమిడల్ ఆకృతిలో ఉంటుంది. Cl − O బంధదైర్ఘ్యం 157 pm. OClO బంధకోణం 106º.
Cl − O బంధశక్తి 244 కి.జౌ./మోల్.


HClO4 (పర్‌క్లోరిక్ ఆమ్లం): దీనిలో Cl, sp3 సంకరీకరణం చెందుతుంది. ఇది టెట్రాహెడ్రల్ ఆకృతిలో ఉంటుంది. Cl − O బంధదైర్ఘ్యం 145 pm. OClO బంధకోణం 109.5º. Cl − O బంధశక్తి 364 కి.జౌ./మోల్.


అంతర హాలోజన్ సమ్మేళనాలు

2 వేర్వేరు హాలోజన్ల మధ్య చర్య జరిగి ఏర్పడే సమ్మేళనాలనే అంతర హాలోజన్ సమ్మేళనాలు అంటారు.

Posted Date : 04-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌