• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పరివర్తన మూలకాలు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

4 మార్కుల ప్రశ్నలు
1.  వెర్నర్ సిద్ధాంతంలోని ముఖ్య ప్రతిపాదనలను తెలపండి.
జ. వెర్నర్ సిద్ధాంతం: సంశ్లిష్ట సమ్మేళనాలు ఏర్పడే చర్యా విధానాన్ని సంతృప్తికరమైన రీతిలో వివరించటానికి వెర్నర్ ఈ సిద్ధాంతంలో కొన్ని ప్రతిపాదనలు చేశారు.
ముఖ్యమైన ప్రతిపాదనలు    
* ప్రతి సంశ్లిష్ట సమ్మేళనంలో కేంద్రక పరమాణువు లేదా అయాను ఉంటుంది.
* ఇది రెండు రకాల సంయోజకతలను ప్రదర్శిస్తుంది.
ప్రైమరీ వేలన్సీ (సంయోజకత): ఇది కేంద్రక పరమాణువు ఆక్సీకరణ స్థితికి సమానం. ఇది అయనీకరణం చెందే వేలన్సీ. దీనికి దిశ ఉండదు. దీన్ని .................. గీతతో సూచిస్తారు.
సెకండరీ వేలన్సీ:
* ఇది సంశ్లిష్ట సమ్మేళనంలోని కేంద్రక పరమాణువు కోఆర్డినేషన్ సంఖ్యకు సమానం. ఇది అయనీకరణం చెందని వేలన్సీ. దిశా లక్షణం ఉంటుంది. దీన్ని  
 గీతతో సూచిస్తారు.
* కొన్ని సంశ్లిష్టాల్లో రుణ లైగాండ్లు ప్రైమరీ, సెకండరీ వేలన్సీలను సంతృప్తి పరుస్తాయి.

2.  కింది సమ్మేళనాలకు వెర్నర్ సిద్ధాంతం ప్రకారం వాటి నిర్మాణాలను రాయండి.
     (a) CoCl3.6NH3               (b) CoCl3.5NH3            (c) CoCl3.4NH3        (d) CoCl3.3NH3


         

3. లాంథనైడ్ సంకోచం అంటే ఏమిటి? దాని ఫలితాలను తెలపండి.
జ: లాంథనైడ్ సంకోచం: వ్యాపించి ఉన్న f ఆర్బిటాళ్ల ఆకృతి, అతి తక్కువగా ఉండే పరిరక్షక ప్రభావం మూలంగా 14 లాంథనాయిడ్ మూలకాల్లో పరమాణు, అయానిక వ్యాసార్ధాలు క్రమేపీ తగ్గడాన్ని ''లాంథనైడ్ సంకోచం'' అంటారు.   
లాంథనైడ్ సంకోచ ఫలితాలు: 4d, 5d మూలకాలకు సన్నిహిత రసాయన ధర్మాలు ఉంటాయి.
* ఒకే స్ఫటిక నిర్మాణం, రసాయన ధర్మాలు ఉన్నందు వల్ల లాంథనైడ్ మూలకాలను వాటి మిశ్రమం నుంచి వేరుచేయడం కష్టం.      

 

4.  ప్రభావిత పరమాణు సంఖ్య (EAN) అంటే ఏమిటి? కింద ఇచ్చిన సంశ్లిష్టాల్లో కేంద్రక పరమాణు EANను లెక్కించండి.
          a) K4[Fe(CN)6]                       (b) [Co(H2O)6] (NO3]3
జ:  ''కోఆర్డినేషన్ తర్వాత కేంద్రలోహ పరమాణువు (సంశ్లిష్ట సమ్మేళనంలో)పై ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యను EAN అంటారు'' EAN (ప్రభావిత పరమాణు సంఖ్య) =  Z- లోహ పరమాణవు కోల్పోయిన ఎలక్టాన్ల సంఖ్య + లైగాండ్ల నుంచి గ్రహించిన ఎలక్టాన్ల సంఖ్య.
 ఉదా:   (i)  K4 [Fe(CN)6] లో  Fe కి EAN 
                 EAN  =  26 - 2 + (6 × 2)  =  24 + 12 = 36
          (ii)  [Co(H2O)6] (NO3)3   లో Co కు EAN
               EAN = 27 - 3 + (6 × 2)  =  24 + 12 = 36

2 మార్కుల ప్రశ్నలు     
1.  ఫెర్రస్ (Fe+2) లవణాలు, ఫెర్రిక్ (Fe+3) లవణాల కంటే అధిక స్థిరత్వం కలవి. వివరించండి.
జ:  Fe+2 (ఫెర్రస్) ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 4s03d6, Fe+3  (ఫెర్రిక్) ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 4s03d5 . Fe+3లో d ఉపస్థాయి ఎలక్ట్రాన్ సగం నిండటం వల్ల అధిక స్థిరత్వం వస్తుంది.

 

2. CuCl  కి రంగులేదు. CuSO4 నీలం రంగులో ఉంటుంది. ఎందువల్ల?
జ: CuCl  కి రంగు ఉండదు. CuSO4 నీలి రంగులో ఉంటుంది. CuCl లో Cu+ ఎలక్ట్రాన్ విన్యాసం 3d10
d ఉపస్థాయిలో అన్ని ఎలక్ట్రాన్లు జతకూడి ఉంటాయి. ఒంటరి 'd' ఎలక్ట్రాన్లు లేనందున CuCl కి రంగు ఉండదు. అదే CuSO4 లో అయితే Cu+2 ఎలక్ట్రాన్ విన్యాసం 3d9. అంటే ఒక జతకూడని d ఎలక్ట్రాను d-d పరివర్తనకు దారితీయడంతో CuSO4 నీలిరంగులో ఉంటుంది (ఇది పసుపు రంగును శోషించడం వల్ల).

 

3.  CuSO4.5H2O కి లేత నీలం రంగు ఉంటే ZnSO4. 7H2O కి రంగులేదు. వివరించండి.
జ:   Cu+2    =   [Ar] 4s0 3d9         
       Zn+2   =   [Ar] 4s0 3d10
Cu+2 లో 3d ఉపస్థాయిలో జతకూడని ఎలక్ట్రాను ఉన్నందు వల్ల, d-d పరివర్తన చెందుతుంది. ఇది పసుపు రంగుని శోషించుకుని, నీలం రంగును వెలువరిస్తుంది. కాబట్టి CuSO4.5H2O నీలం రంగులో ఉంటుంది. అదే Zn+2 లో 3d ఉపస్థాయిలో ఎలక్ట్రాన్లన్నీ జతగా ఉంటాయి. అందువల ZnSO4. 7H2O కు రంగు ఉండదు.

4.  (a) CoCl3. 5 NH3   (b) CoCl3. 6NH3 ద్రావణాలకు AgNO3 ని కలిపితే ఎన్ని మోల్‌ల AgCl వస్తుంది? 
జ:  (a)  [Co(NH3)5 Cl] Cl2 లో 2 Cl-  లు ఉండటం వల్ల 2 మోల్ ల AgCl వస్తుంది.
      (b)  [Co(NH3)6] Cl3 లో 3Cl- లు ఉండటం వల్ల  3 మోల్ ల AgCl వస్తుంది.

 

5.  CuSO4 పారా అయస్కాంత పదార్థం. ZnSO4  డయా అయస్కాంత పదార్థం. ఎందువల్ల?
జ:   Cu+2 = [Ar] 4s03d9                      Zn+2 = [Ar] 4s03d10
    Cu+2 లోని 3d ఉపస్థాయిలో ఒక జతకూడని ఎలక్ట్రాను, CuSO4 ను అయస్కాంత క్షేత్రం వైపు ఆకర్షించేలా చేస్తుంది. కాబట్టి CuSO4 పారా అయస్కాంత పదార్థం. అదే Zn+2 లో అన్ని ఎలక్ట్రాన్లు జత కూడినవి. ZnSO4 ను అయస్కాంత క్షేత్రం వికర్షిస్తుంది. కాబట్టి ఇది డయా అయాస్కాంత పదార్థం.

 

6.  (a) నైక్రోమ్   (b)  ఇత్తడి మిశ్రమ లోహాల సంఘటనాన్ని తెలపండి.
జ:  (a)   నైక్రోమ్:  Ni (60%),    Fe (25%),    Cr (15%).
      (b)   ఇత్తడి:   Cu (60-80%),    Zn (20-40%).

Posted Date : 04-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌