• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జీవాణువులు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

4 మార్కుల ప్రశ్నలు                    

1. వనరు, విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులను తెలపండి. 
    (a) A      (b) D      (c) E      (d) K విటమిన్లు
జ:

 

2. విటమిన్లు అంటే ఏమిటి? విటమిన్ 'C' వనరు లోపిస్తే వచ్చే వ్యాధులను తెలపండి.
జ: జీవరాశులను ఆరోగ్యంగా ఉంచడానికి అల్ప పరిమాణంలో అవసరమైన, ప్రకృతిలో దొరికే కర్బన రసాయన పదార్థాలు.

వనరులు: నారింజ, ఉసిరి లోపం వల్ల కలిగే
వ్యాధులు: స్కర్వీ, చిగుళ్ల నుంచి రక్తస్రావం.

 

3. అనువంశికత - జన్యుస్మృతి అంటే ఏమిటి?
జ: అనువంశికత: న్యూక్లియిక్ ఆమ్లాలు అనే అనువంశికతను అణుపరిమాణంలోనే నియంత్రిస్తాయి. మానవుడి జన్యు సమాచారమంతా 23 జతల క్రోమోజోమ్‌ల మీదే ఆధారపడి ఉంది. ప్రతి క్రోమోజోమ్‌లో వేలాది DNA యూనిట్లుంటాయి.

జన్యుస్మృతి: సమాచారాన్ని మోసుకెళ్లే m - RNA లో సమాచారమంతా కోడ్ భాషలో ఉంటుంది. 3 వరుస క్షారాలను తెలియజేసే ఎమైనో ఆమ్లాన్ని జన్యుస్మృతి అంటారు. ఉదా: ల్యూసీన్‌కోడ్ CUU
 

4. DNA వేలిముద్రల పద్ధతి (DNA Finger Printing) అంటే ఏమిటి?
జ: ప్రతి మనిషిలో DNA సంబంధిత క్షారాల వరుస క్రమం ప్రత్యేకంగా ఉంటుంది. వారి వేలిముద్రలు ప్రత్యేకం. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి
* నేరస్తులను గుర్తించవచ్చు
* బిడ్డ తల్లితండ్రులెవరో గుర్తించవచ్చు

* సంబంధీకుల శవనిర్ధారణ చెయ్యవచ్చు
* జాతుల వంశాలు, సంతతి క్రమాలను గుర్తించవచ్చు

 

5. గ్లూకోజ్ నిర్మాణం గురించి లఘు వ్యాఖ్య రాయండి.
జ: * గ్లూకోజ్ అణు ఫార్ములా: C6H12O6.
* ఇది HI, ఎర్ర భాస్వరంతో కలిసి n - హెక్సేన్‌ను ఇస్తుంది. దీనిలో 6 కార్బన్‌లు రేఖీయంగా ఉంటాయని ఈ చర్య చెబుతుంది.


            
* గ్లూకోజ్ NH2OH తో ఆగ్జైమ్‌ను, HCN తో సయనో హైడ్రిన్‌ను ఇస్తే దీనిలో  
 గ్రూపు ఉన్నట్లు.


* ఇది బ్రోమిన్ నీటితో గ్లూకోనిక్ ఆమ్లాన్నిస్తే, దీనిలో - CHO గ్రూపు ఉన్నట్లు.

            
* ఇది HNO3 తో శాకరిక్ ఆమ్లాన్ని ఇస్తే, దీనిలో ప్రైమరీ - OH గ్రూపు ఉన్నట్లు.


              
* ఇది ఎసిటిక్ ఎన్‌హైడ్రైడ్‌తో పెంటా ఎసిటేట్‌ను ఇస్తే, దీనిలో అయిదు - OH గ్రూపులు ఉన్నట్లు.


               
* పై చర్యల నుంచి గ్లూకోజ్‌కి వివృత శృంఖల నిర్మాణం ఉంటుంది.


                             

2 మార్కుల ప్రశ్నలు
1. 'ఎనోమర్‌లు' అంటే ఏమిటి?
జ: ప్రాదేశిక సాదృశకాల్లో కేవలం C - 1 వద్ద మాత్రమే విన్యాసంలో మార్పు ఉంటే వాటిని 'ఎనోమర్‌లు' అంటారు.
ఉదా: α - D గ్లూకో పైరనోజ్, β - D - గ్లూకో పైరనోజ్

 

2. 'జ్విట్టర్ అయాన్' అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జ: ఎమైనో ఆమ్ల జలద్రావణంలో కార్బాక్సిలిక్ సమూహం ప్రోటాన్‌ను పోగొట్టుకుని, ఎమైనో సమూహం ప్రోటాన్‌ను గ్రహించడం ద్వారా ఏర్పడే తటస్థ ద్విధ్రువ అయాన్‌ను 'జ్విట్టర్ అయాన్' అంటారు.


                           

3. 'గ్లైకోసైడిక్ బంధం' అంటే ఏమిటి?
జ: ఆక్సిజన్ పరమాణువు ద్వారా రెండు మోనోశాకరైడ్ యూనిట్ల మధ్య ఏర్పడే బంధాన్ని 'గ్లైకోసైడిక్ బంధం' అంటారు.
ఉదా: సుక్రోజ్‌లో α గ్లూకోజ్‌లోని C - 1, β - ఫ్రక్టోజ్‌లోని C - 2 మధ్య గ్లైకోసైడిక్ బంధం ఉంది.

 

4. 'ప్రొటీన్ల స్వభావ వికలత' అంటే ఏమిటి?
జ: ప్రోటీన్ pHని మార్చినా, కుదిపినా, వేడిచేసినా హైడ్రోజన్ బంధాలు కలత చెంది, ప్రైమరీ నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగకుండా కేవలం ప్రొటీన్ల 2°, 3° నిర్మాణాలకు మాత్రమే విఘాతం కలిగి, ఆ ప్రొటీన్ జీవ సంబంధ ప్రక్రియను కోల్పోవడాన్ని 'ప్రొటీన్ల స్వభావ వికలత' అంటారు.

 

5. మన శరీరంలో విటమిన్ C ఎందుకు నిల్వ ఉండదు?
జ: విటమిన్ 'సి' నీటిలో కరుగుతుంది. ఇది మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఇది శరీరంలో నిల్వ ఉండదు కాబట్టి ఆహారం ద్వారా రోజూ సరఫరా చెయ్యాల్సి ఉంటుంది.

 

6. న్యూక్లియిక్ ఆమ్లాలు అంటే ఏమిటి? వీటి ముఖ్య విధులు రెండింటిని తెలపండి.
జ: న్యూక్లియోటైడ్‌ల పాలీఫాస్ఫేట్ ఎస్టర్ దీర్ఘ శృంఖలాల జీవబృహదణువులను 'న్యూక్లియిక్ ఆమ్లాలు' అంటారు.
విధులు: * కణంలో ప్రొటీన్ల సంశ్లేషణలో.
            * అనువంశికతకు మూలం DNA నే.

7. న్యూక్లియోసైడ్, న్యూక్లియోటైడ్ మధ్య భేదాన్ని తెలపండి.
జ: న్యూక్లియోసైడ్: చక్కెరలో 1' స్థానంలో క్షారం బంధితమై ఉండే యూనిట్‌ను న్యూక్లియోసైడ్ అంటారు.
    న్యూక్లియోటైడ్: న్యూక్లియోసైడ్ లోని చక్కెరలో 5' స్థానానికి ఫాస్ఫారికామ్లం బంధితమై ఉండే యూనిట్‌ను న్యూక్లియోటైడ్ అంటారు.

 

8. 'ఆవశ్యక ఎమైనో ఆమ్లాలు', 'అనావశ్యక ఎమైనో ఆమ్లాలు' అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జ: శరీరంలో తయారవకుండా కేవలం ఆహారం ద్వారా మాత్రమే తయారయ్యే ఎమైనో ఆమ్లాలను 'ఆవశ్యక ఎమైనో ఆమ్లాలు' అంటారు.
ఉదా: ల్యూసీన్, ఐసోల్యూసీన్.
         శరీరంలో తయారయ్యే ఎమైనో ఆమ్లాలను 'అనావశ్యక ఎమైనో ఆమ్లాలు' అంటారు.
ఉదా: గ్లైసీన్, ఎలనైన్.

 

9. 'ప్రొటీన్లు' అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జ: 10,000 U కంటే ఎక్కువ అణు ద్రవ్యరాశిని, 100 కంటే ఎక్కువ ఎమైనో ఆమ్లాలను కలిగిన పాలీపెప్టైడ్‌లను 'ప్రొటీన్లు' అంటారు.
ఉదా: జుట్టులో ఉండే 'కెరటిన్'.

Posted Date : 02-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌