• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

2 మార్కుల ప్రశ్నలు
1. ''అనాల్జిసిక్‌లు'' అంటే ఏమిటి?
జ: నాడీవ్యవస్థకు ఎలాంటి హానీ చేయకుండా నొప్పిని తగ్గించి బాధ నుంచి విముక్తి కలిగించే మందులు.
ఉదా: ఆస్ప్రిన్, ఐబుప్రోఫెన్.

2. ''ట్రాంక్విలైజర్‌లు'' అంటే ఏమిటి?
జ: ఒత్తిడి, మానసిక రుగ్మతలను తగ్గించే మందులు.
ఉదా: సైకోనాల్, ల్యుమినాల్.

3. ''యాంటీసెప్టిక్‌లు'' అంటే ఏమిటి?
జ: రోగ కారకాల సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపగల లేదా చంపగల మందులు.
ఉదా: డెటాల్, బిథియోనాల్.

4. ''ఆమ్ల విరోధులు'' అంటే ఏమిటి?
జ: ఉదరంలో ఎక్కువ ఉత్పత్తి అయిన ఆమ్లాలను తటస్థీకరించి, ఆమ్ల స్థాయిని (pHని) తగ్గించే మందులు.
ఉదా: ఒమెప్రజోల్, లాన్‌సొప్రజోల్.

5. ''యాంటీ హిస్టమైన్లు'' అంటే ఏమిటి?
జ: ఉదరపు గోడల్లో ఉన్న గ్రాహకాలతో హిస్టమిన్‌ను చర్య జరపకుండా చేసి, ఆమ్ల ఉత్పత్తిని తగ్గించగల మందులు.
ఉదా: సిమిటిడైన్, రాంటిడైన్.

6. ''ఆహార పరిరక్షకాలు'' (Food Preservatives) అంటే ఏమిటి?
జ: ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేసినా పాడవనివ్వని రసాయన పదార్థాలు.
ఉదా: సోడియం బెంజోయేట్; పొటాషియం మెటాబైసల్ఫేట్.

7. ''కృత్రిమ తీపి కారిణులు'' అంటే ఏమిటి?
జ: కేలరీలను పెంచకుండానే ఎక్కువ తియ్యదనాన్ని కలిగించే కృత్రిమ రసాయన పదార్థాలు.
ఉదా: సూక్రలోజ్, అలిటేమ్

8. 'నార్కోటిక్ మందులు' అంటే ఏమిటి? 2 ఉదాహరణలు ఇవ్వండి.
జ: తీవ్ర గుండె నొప్పి, శస్త్రచికిత్సానంతర బాధల్ని నివారించే ఆల్కలాయిడ్లను 'నార్కోటిక్ మందులు' అంటారు. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను కుంగదీసి, వశపరచుకునే ధర్మాన్ని కలిగి ఉంటాయి.
ఉదా: మార్ఫిన్, హెరాయిన్

9. 'నాన్ నార్కోటిక్ మందులు' అంటే ఏమిటి? 2 ఉదాహరణలు ఇవ్వండి.
జ: చిన్నపాటి తలనొప్పి, నడుంనొప్పి లాంటి బాధల్ని నివారించగల రసాయన పదార్థాలను 'నాన్ నార్కోటిక్ మందులు' అంటారు. వీటికి వశపరచుకునే ధర్మం ఉండదు.
ఉదా: ఆస్పిరిన్, ఐబుప్రోఫెన్.

10. 'గర్భనిరోధక మందులు' అంటే ఏమిటి? 2 ఉదాహరణలు ఇవ్వండి.
జ: గర్భం రాకుండా నిరోధించే రసాయన పదార్థాలను 'గర్భ నిరోధక మందులు' అంటారు.
ఉదా: మైఫ్‌ప్రిస్టోన్, నార్తిన్‌డ్రోన్.

11. ఆహార పదార్థాల్లో 'యాంటీ ఆక్సీకరణులు' అంటే ఏమిటి? 2 ఉదాహరణలు ఇవ్వండి.
జ: ఆహార పదార్థాలు ఆక్సిజన్‌తో చర్య జరపకుండా నివారిస్తూ, వాటి సంరక్షణకు వాడే సంకలితాలను 'యాంటీ ఆక్సీకరణులు' అంటారు.
ఉదా: BHA, BHT.

12. ఆస్పిరిన్ ఉపయోగాలు రెండింటిని తెలపండి.
జ: * గుండెపోటు నివారణలో (రక్తం గడ్డకట్టకుండా చేసే గుణం ఉండటం వల్ల).
     *  కీళ్లవాతం ద్వారా వచ్చే ఎముకల సంబంధిత బాధలను నివారించడంలో.

13. 'సబ్బు తయారీ' అంటే ఏమిటి?
జ: కొవ్వులను (ఫాటీ ఆమ్లం యొక్క గ్లిజరాల్ ఎస్టర్) సోడియం హైడ్రాక్సైడ్‌తో కలిపి వేడిచేసినప్పుడు సబ్బు ఏర్పడటాన్నే 'సబ్బు తయారీ' అంటారు.

14. 'కృత్రిమ (సంశ్లిష్ట) డిటర్జెంట్' అంటే ఏమిటి?
జ: మృదుజలం లేదా కఠినజలం లేదా మంచులా చల్లగా ఉండే నీటిలో నురగను ఇవ్వగల సబ్బు ధర్మాలున్న (సబ్బు లేని) శుభ్రపరిచే కారకాన్ని 'కృత్రిమ డిటర్జెంట్' అంటారు.
ఉదా: సోడియం లారైల్ సల్ఫేట్.

15. 'కీమోథెరపీ' పదాన్ని నిర్వచించండి.
జ: రోగచికిత్సలో రసాయన పదార్థాలను ఉపయోగించే ప్రక్రియను 'కీమోథెరపీ' అంటారు.

16. 'అంతర్ విరుద్ధకాలు', ' అంతర్ సహాయకులు' అంటే ఏమిటి?
జ: అంతర్ విరుద్ధకాలు (Antagonists): గ్రాహకం బంధన స్థానానికి బంధితమై ఉండి గ్రాహకం జరిపే సహజక్రియలను నిరోధించే మందులు.
    అంతర్ సహాయకులు (Agonists): సహజ సమాచార వాహకాలను అనుకరణం చేసి గ్రాహకాన్ని తెరిపించే మందులు.

17. 'అధిక విస్తృతి యాంటీబయోటిక్‌లు', 'స్వల్ప విస్తృతి యాంటీబయోటిక్‌లు' అంటే ఏమిటి? ప్రతిదానికి ఒక్కో ఉదాహరణ ఇవ్వండి.
జ: అధిక విస్తృతి యాంటీబయోటిక్‌లు: గ్రామ్-పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాను నిరోధించే/ నాశనం చేసే యాంటీబయోటిక్‌లు.
ఉదా: క్లోరామ్‌ఫెనికోల్.
స్వల్ప విస్తృతి యాంటీబయోటిక్‌లు: గ్రామ్-పాజిటివ్ లేదా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాల్లో ఏదో ఒకదాన్ని మాత్రమే నిరోధించే/ నాశనం చేసే యాంటీబయోటిక్‌లు.
ఉదా: పెన్సిలిన్ - జి.

4 మార్కుల ప్రశ్నలు
1. కిందివాటి నిర్మాణాలను రాయండి.
    ఎ) సెరోటోనిన్   బి) బితియోనోల్   సి) శాకరీన్   డి) క్లోరామ్‌ఫెనికోల్
జ:

           సెరోటోనిన్  

              బితియోనోల్

                       శాకరీన్     

                          క్లోరామ్‌ఫెనికోల్

2. సబ్బు యొక్క శుభ్రపరిచే ప్రక్రియను వివరించండి.
జ: * సబ్బుని సోడియం స్టియరేట్‌గా భావించవచ్చు. దీనిలో Na+ అయాన్లు C17H35 COO- (స్టియరేట్) అయాన్లు ఉంటాయి. 

* ఈ స్టియరేట్ అయాన్‌లో C17H35 అధ్రువభాగం (తోక) ఉంటుంది. ఇది దుస్తులపై ఉన్న మురికిని, జిడ్డుని తనలో కరిగించుకుంటుంది. కాగా ధ్రువభాగమైన COO- (తల) నీటిని ఆకర్షిస్తుంది.

* ఈ రెండూ కలసి ''నీరు-మురికి'' ఎమల్షన్‌గా ఏర్పడేందుకు సబ్బు తోడ్పడుతుంది. దుస్తులను జాడించి, ఉతికినప్పుడు ఈ ఎమల్షన్ నీటితోపాటు బయటికి వెళ్లిపోయి దుస్తులు శుభ్రపడతాయి.

Posted Date : 05-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌