• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హాలో ఆల్కేన్‌లు & హాలో ఎరీన్‌లు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు
 

2 మార్కులు


1. ఈథేన్‌ను బ్రోమో ఈథేన్‌గా ఏవిధంగా మార్చుతారు?
జ: ఫ్రీ రాడికల్ బ్రోమినేషన్ వల్ల ఈథేన్, బ్రోమిన్‌తో చర్య జరిపి బ్రోమో ఈథేన్‌ను ఇస్తుంది.


            
 

2. 'ఉర్జ్‌జ్ చర్య' అంటే ఏమిటి?
జ: పొడి ఈథర్ సమక్షంలో ఆల్కైల్ హాలైడ్‌లు సోడియంతో చర్య జరిపి ఆల్కైల్ హాలైడ్ కంటే రెండు రెట్లు ఎక్కువ కార్బన్లు ఉండే హైడ్రో కార్బన్‌ను ఏర్పరిచే చర్య.


           
3. 'ఉర్ట్‌జ్ - ఫిట్టిగ్' చర్య అంటే ఏమిటి?
జ: ఒక ఆల్కైల్ హాలైడ్ ఒక ఎరైల్ హాలైడ్ కలిసి సోడియంతో పొడి ఈథర్ సమక్షంలో చర్య జరిపి ఆల్కైల్ ఎరీన్‌ను ఏర్పరిచే చర్య.

         
 

4. 'ఫిట్టిగ్ చర్య' అంటే ఏమిటి?
జ: రెండు ఎరైల్ హాలైడ్‌లు సోడియంతో కలిసి పొడి ఈథర్ సమక్షంలో చర్య జరిపి రెండు ఎరైల్ గ్రూపులు కలిసిన హైడ్రో కార్బన్‌ను ఇచ్చే చర్య.


         
 

5. 'సేట్‌జెఫ్' (జైట్‌సేవ్) నియమం అంటే ఏమిటి?
జ: ఈ నియమం ప్రకారం డీహైడ్రో హాలోజనీకరణ చర్యలో ద్విబంధ కార్బన్లపై ఎక్కువ ఆల్కైల్ సమూహాలుండే ఆల్కీన్ అధిక మొత్తంలో ఏర్పడుతుంది.

6. 'ఫింకెల్‌స్టీన్ చర్య' అంటే ఏమిటి?
జ: ఆల్కైల్ క్లోరైడ్/ బ్రోమైడ్ సోడియం అయొడైడ్‌తో నిర్జల ఎసిటోన్ సమక్షంలో చర్య జరిపి ఆల్కైల్ అయొడైడ్‌ను ఇచ్చే చర్య.


      
 

7. 'స్వాట్స్ చర్య' అంటే ఏమిటి?
జ: ఆల్కైల్ క్లోరైడ్/ బ్రోమైడ్‌ను AgF లేదా Hg2F2తో వేడిచేస్తే ఆల్కైల్ ఫ్లోరైడ్‌ను ఇచ్చే చర్య.


      
 

8. 'శాండ్‌మేయర్ చర్య' అంటే ఏమిటి?

9. 'ఉభయదంత (ambident) న్యూక్లియోఫైల్' అంటే ఏమిటి?
జ: రెండు న్యూక్లియోఫిలిక్ కేంద్రాలున్న న్యూక్లియోఫైల్.


         
 

10. o, m, p డైక్లోరో బెంజీన్‌లు ప్రదర్శించే సాదృశ్యం ఏమిటి?
జ: ఈ సాదృశ్యకాలన్నింటిలో రెండో క్లోరిన్ స్థానం మారుతున్నందున ఇవి స్థాన సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి.


     
 

11. క్లోరో బెంజీన్ ద్విధ్రువ భ్రామకం సైక్లో హెక్సైల్ క్లోరైడ్ కంటే ఎందుకు తక్కువో వివరించండి.

 
 

12. ధ్రువణ భ్రమణత లక్షణాలు ఏమిటి? రెండు కైరల్ అణువులను తెలపండి.
జ: కైరల్ కేంద్రాన్ని (కార్బన్ చుట్టూ 4 భిన్న సమూహాలు బంధితమై ఉండటం) కలిగిన కర్బన సమ్మేళనం ధ్రువణ భ్రమణతను ప్రదర్శించగలదు.


        

13. హాలో ఆల్కేన్లు KCNతో చర్య జరిపి ఆల్కైల్ సైనైడ్‌లను, AgCNతో చర్య జరిపి ఆల్కైల్ ఐసో సైనైడ్‌లను ప్రధాన ఉత్పన్నాలుగా ఏర్పరుస్తాయి. వివరించండి.
జ: KCNకు అయాన్ స్వభావం ఉండటం వల్ల అది ద్రావణంలో  
 అయాన్లను ఇస్తుంది. C - C బంధానికి ఎక్కువ స్థిరత్వం ఉండటం వల్ల ఆల్కైల్ సైనైడ్ ప్రధాన ఉత్పన్నంగా ఏర్పడుతుంది.


        
  AgCNకు సమయోజనీయ స్వభావం ఉండటం, N మాత్రమే ఎలక్ట్రాన్లను దానం చేస్తుండటం వల్ల ఐసో సైనైడ్‌ను ప్రధాన ఉత్పన్నంగా ఏర్పరుస్తుంది.


        
 

14. 'ఎనాన్షియోమర్‌లు', 'రెసిమిక్ మిశ్రమం' అనే పదాలను వివరించండి.
జ: ఒకదానిపై మరొకటి అధ్యారోపితం కాని బింబ, ప్రతిబింబాలుగా ఉండే త్రిమితీయ సాదృశ్యకాల జతను 'ఎనాన్షియోమర్‌లు' అంటారు. సున్నా భ్రమణాన్ని చూపే మిశ్రమంలో రెండు ఎనాన్షియోమర్‌లు సమాన పరిమాణంలో ఉంటే దాన్ని 'రెసిమిక్ మిశ్రమం' అంటారు.

15. 'గ్రిగ్‌నార్డ్ కారకం' అంటే ఏమిటి? ఒక అనువర్తనాన్ని తెలపండి.
జ: పొడి ఈథర్ సమక్షంలో ఆల్కైల్ హాలైడ్ Mgతో చర్య జరిపి ఏర్పరిచే పదార్థాన్ని (RMgX) 'గ్రిగ్‌నార్డ్ కారకం' అంటారు.


          
 

16. క్లోరో బెంజీన్‌ను CH3Cl, CH3COCl తో AlCl3 సమక్షంలో చర్య జరిపితే ఏర్పడే ప్రధాన (గరిష్ఠ), అల్ప (కనిష్ఠ) ఉత్పన్నాలను రాసి, ఆ చర్యలను తెలపండి.
జ: ఫ్రీడల్‌క్రాఫ్ట్ ఆల్కలీకరణం 


                    

     ఫ్రీడల్‌క్రాఫ్ట్ ఎసిటలీకరణం


                     
 

4 మార్కులు

1. న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ ద్విఅణుక చర్య () యొక్క చర్యా విధానాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.
జ: CH3Clతో  
 జరిపే చర్య దీనికి () మంచి ఉదాహరణ. ఇది ఒకే అంచెలో జరిగే చర్య. ఈ చర్యలో ఒకే సమయంలో ఒకే అంచెలో ఒక న్యూక్లియోఫైల్ మరో న్యూక్లియోఫైల్‌ను స్థానభ్రంశం చెందిస్తుంది. ఇక్కడ మధ్యస్తం ఏర్పడదు కానీ సంధి స్థితి ఏర్పడుతుంది.


               

           రేటు = k[CH3Cl] []
         చర్యరేటు CH3Cl &
 రెండింటి గాఢతలపై ఆధారపడటం వల్ల ఇది ద్వితీయ క్రమాంక చర్య. దీని అణుకత రెండు (రేటును కనుక్కునే అంచెలో 2 అణువులు పాల్గొనడం వల్ల).
చర్యాశీలత క్రమం: 1° ఆల్కైల్ హాలైడ్ > 2° ఆల్కైల్ హాలైడ్ > 3° ఆల్కైల్ హాలైడ్.
విడిచిపోయే సమూహం ప్రభావం: RI > RBr > RCl > RF
ప్రాదేశిక విన్యాసం: విన్యాస విలోమం పూర్తిగా జరుగుతుంది. అంటే ఈ చర్యలో న్యూక్లియోఫైల్ వెనుక నుంచి వచ్చి క్రియాజనకాన్ని ఢీ కొట్టడం వల్ల క్రియాజన్యానికి విలోమ విన్యాసం (పెనుగాలికి తిరగబడిన గొడుగు మాదిరి) వస్తుంది.

2. న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ ఏక అణుక చర్య () యొక్క చర్యా విధానాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.
జ: టెర్షియరీ బ్యుటైల్ బ్రోమైడ్‌తో నీరు జరిపే చర్య దీనికి (
) మంచి ఉదాహరణ. ఇది రెండు అంచెల్లో జరిగే చర్య.
                  (CH3)3CBr + H2O  
(CH3)3COH + HBr
                  రేటు = k[(CH3)3 CBr]
             చర్యరేటు H2O (అంటే
) గాఢతపై ఆధారపడకుండా కేవలం (CH3)3CBr పైనే ఆధారపడటం వల్ల ఇది ప్రథమ క్రమాంక చర్య. మొదటి అంచె నెమ్మదిగా జరిగి CBr విచ్ఛిత్తి చెంది టెర్షియరీ బ్యుటైల్ కార్బోనియం అయాన్‌ను ఇస్తుంది. కాబట్టి దీని అణుకత ఒకటి.

                      
             రెండో అంచె వేగంగా జరిగి ఈ అయాన్‌ను, న్యూక్లియోఫైల్ (

) ఢీకొని టెర్షియరీ బ్యుటైల్ ఆల్కహాల్‌ను ఇస్తుంది.


              
చర్యాశీలత క్రమం: 3°  -
 ఆల్కైల్ హాలైడ్ > 2°  - ఆల్కైల్ హాలైడ్ > 1° - ఆల్కైల్ హాలైడ్.
విడిచిపోయే సమూహం ప్రభావం: RI > RBr > RCl > RF.
ప్రాదేశిక విన్యాసం: ఒక ఎనాన్షియోమర్ రెసిమిక్ మిశ్రమంగా మారుతుంది (రెసిమైజేషన్ జరుగుతుంది).

3. కింది చర్యల్లో ఏ ఉత్పన్నాలు ఏర్పడతాయి?
         i) n - బ్యుటైల్ క్లోరైడ్‌ను ఆల్కహాలిక్ KOHతో చర్య జరిపితే
         ii) n - బ్యుటైల్ క్లోరైడ్‌ను KOH జలద్రావణంతో చర్య జరిపితే
         iii) బ్రోమో బెంజీన్‌ను అనార్ద్ర ఈథర్ సమక్షంలో Na లోహంతో చర్య జరిపితే
         iv) మిథైల్ బ్రోమైడ్‌ను అనార్ద్ర ఈథర్ సమక్షంలో Na లోహంతో చర్య జరిపితే
జ: i) 1 - బ్యుటీన్ ఏర్పడుతుంది.


   
ii) బ్యుటనోల్ ఏర్పడుతుంది. 


          

iii) C6H5MgBr అనే గ్రిగ్‌నార్డ్ కారకం ఏర్పడుతుంది.


           
iv) ఉర్ట్‌జ్ చర్య జరిగి ఈథేన్ ఏర్పడుతుంది.


             
 

4. కింది చర్యల్లో ఏర్పడే ప్రధాన మోనో హాలో ఉత్పన్నాల నిర్మాణాలను రాయండి.


 

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌