• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నైట్రోజన్ ఉన్న కర్బన సమ్మేళనాలు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

 

2 మార్కుల ప్రశ్నలు

1. 'శాండ్ మేయర్ చర్య' అంటే ఏమిటి?
జ:  అయాన్ సమక్షంలో డయజోనియం లవణంలోని డయాజోనియం సమూహాన్ని
 లాంటి న్యూక్లియోఫైల్‌తో సంబంధిత ఆమ్లం సమక్షంలో ప్రతిక్షేపించే చర్య.

2. 'కార్బైల్ ఎమీన్ చర్య' అంటే ఏమిటి?
జ: ఎలిఫాటిక్ లేదా ఎరోమాటిక్ ప్రైమరీ ఎమీన్‌ను క్లోరోఫాం, ఇథనోలిక్ KOH తో వేడిచేస్తే భరించలేనంత దుర్వాసన ఉండే కార్బైల్ ఎమీన్ (ఐసో సైనైడ్) వస్తుంది.

3. 'గాటర్‌మన్ చర్య' అంటే ఏమిటి?
జ: డయజోనియం లవణ ద్రావణాన్ని సంబంధిత హాలోజన్ ఆమ్లంతో, కాపర్ పొడి సమక్షంలో డయజోనియం సమూహాన్ని
 లాంటి న్యూక్లియోఫైల్‌తో ప్రతిక్షేపించే చర్య.

4. 'హాఫ్‌మన్ బ్రోమమైడ్ నిమ్నీకరణ చర్య' అంటే ఏమిటి?
జ: ఈ చర్యలో ఆల్కైల్ లేదా ఎరైల్ ఎమైడ్‌ను Br2, NaOH జలద్రావణం లేదా ఇథనోలిక్ NaOH ద్రావణంతో చర్య జరిపితే ప్రైమరీ ఎమైన్ ఏర్పడుతుంది.

5. కింది చర్యలో A, B, C నిర్మాణాలను రాయండి.


    

6. గాబ్రియల్ థాలిమైడ్ చర్యలో కేవలం ప్రైమరీ ఎమీన్‌లు మాత్రమే ఏర్పడతాయి. ఎందువల్ల? వివరించండి.
జ: థాలిమైడ్‌లో ఉండే Nతో ఒక H మాత్రమే బంధించబడి ఉండటం వల్ల N పై ఒక ఆల్కైల్ సమూహాన్ని మాత్రమే ఉంచగలం. అందుకే ఈ చర్యలో కేవలం ప్రైమరీ ఎమీన్‌లు మాత్రమే ఏర్పడతాయి.

7. గాబ్రియెల్ థాలిమైడ్ చర్యలో ఎరోమాటిక్ ప్రైమరీ ఎమీన్‌లను తయారు చెయ్యలేం. ఎందువల్ల?
జ: థాలిమైడ్ ఇచ్చే ఆనయాన్‌తో ఎరైల్ హాలైడ్‌లు న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య జరపనందున ఇవి ఎరోమాటిక్ ప్రైమరీ ఎమీన్‌లను ఇవ్వలేవు. కేవలం ఎలిఫాటిక్ ప్రైమరీ ఎమీన్‌లను మాత్రమే తయారు చేయగలం.

 

8. ఎనిలీన్   విలువ మిథైల్ ఎమీన్ కంటే ఎక్కువ. ఎందువల్ల? వివరించండి?

మిథైల్ ఎమీన్‌లో N పరమాణువు C తో బంధించబడి ఉంటే, ఎనిలీన్‌లో N పరమాణువు బెంజీన్ వలయంలో ఉండే C తో బంధించబడి ఉంటుంది. ఇందులో N పై ఉండే ఒంటరి జంట ఎలక్ట్రాన్లు బెంజీన్ వలయంతో సంయుగ్మత లేదా రెజొనెన్స్ పొంది ప్రోటీనీకరణం చేసే అవకాశం తగ్గిపోతుంది. దీనితో ఎనిలీన్‌కు క్షారత్వం తక్కువ. అంటే Kb తక్కువ లేదా   ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎనిలీన్   విలువ మిథైల్ ఎమీన్ కంటే ఎక్కువ.

9. కింది మార్పులను ఎలా చేస్తారు?
      ఎ) అమోనియా నుంచి N, N - డైమిథైల్ ప్రొపనమీన్‌ను 
      బి) క్లోరో ఈథేన్ నుంచి ప్రొపనమీన్‌ను

10. సమాన అణుభారం ఉండే ఆల్కహాల్ కంటే ఎమీన్ల ఆమ్లత్వం తక్కువ. ఎందువల్ల?
జ:  
 అయాన్‌ను తేలిగ్గా ఇవ్వగల సమ్మేళనానికి ఆమ్లత్వం ఎక్కువ. ఎమీన్‌లలో N - H బంధానికి తక్కువ ధ్రువత్వం ఉండటం వల్ల   అయాన్‌ను తేలిగ్గా ఇవ్వలేదు. కానీ ఆల్కహాల్‌లలో O - H బంధానికి ధ్రువత్వం ఎక్కువ (N కంటే 'O' రుణవిద్యుదాత్మకత ఎక్కువ),  ను తేలిగ్గా ఇవ్వగలదు. కాబట్టి ఆల్కహాల్‌ల కంటే ఎమీన్ల ఆమ్లత్వం తక్కువ.

11. ఒకే ఆల్కైల్ హాలైడ్ నుంచి ఇథైల్ సయనైడ్, ఇథైల్ ఐసో సయనైడ్ లను ఎలా తయారుచేస్తారు?
జ: C2H5Cl, ఇథనోలిక్ (ఆల్కహాలిక్) KCN తో చర్య జరిపి ఇథైల్ సయనైడ్‌ను అధిక ఉత్పన్నంగా ఇస్తుంది.
     C2H5Cl + ఆల్కహాలిక్ KCN  
 C2H5CN + C2H5NC
                                                                (అధిక)         (అల్ప)
     C2H5Cl, ఆల్కహాలిక్ AgCN తో చర్య జరిపి ఇథైల్ ఐసోసయనైడ్‌ను అధిక ఉత్పన్నంగా ఇస్తుంది.
     C2H5Cl + ఆల్కహాలిక్ AgCN  
 C2H5CN + C2H5NC
                                                                  (అల్ప)          (అధిక)

12. కింది సమ్మేళనాల క్షార బలాన్ని వాయుస్థితి, జలద్రావణంలో పోల్చి వాటి క్షారబలం పెరిగే క్రమంలో రాయండి.
     CH3NH2 , (CH3)2NH, (CH3)3N, NH3
జ: + I ప్రభావం కారణంగా ఆల్కైల్ సమూహానికి ఎలక్ట్రాన్లను ఇచ్చే స్వభావం ఉంటుంది. కాబట్టి వాయుస్థితిలో ఎమీన్ల క్షారబలం:
      NH3< CH3NH2< (CH3)2NH, (CH3)3N
కానీ జలద్రావణంలో ఎమీన్ల క్షార బలం + I ప్రభావంతో పాటు, సంయోగ ద్రావణీకరణ (Solvation), ప్రాదేశిక అవరోధాల (Steric hindrance) పై ఆధారపడి ఉంటుంది.
జలద్రావణంలో ఎమీన్ల క్షార బలం: NH3< (CH3)3N < CH3NH2< (CH3)2NH.

4 మార్కుల ప్రశ్నలు

1. ఎనిలీన్‌ను (ఎ) ఫ్లోరోజెంజీన్ (బి) సయనోబెంజీన్ (సి) బెంజీన్ (డి) ఫీనాల్‌గా మార్చే చర్యలను రాయండి.

2. బెంజీన్ డయజోనియం క్లోరైడ్ ఎనిలీన్, ఫీనాల్‌తో జరిపే యుగళీకరణ చర్యలను రాయండి.
జ: -N2Cl సమూహం పారా నిర్దేశికత ఉండేది. ఈ చర్యలో డయజోనియం లవణం ఎరోమాటిక్ ఎమీన్ లేదా ఫీనాల్‌తో చర్య జరిపి Ar - N = N - Ar అనే సాధారణ ఫార్ములా ఉండే ఎజో సమ్మేళనాన్ని ఇస్తుంది. దీన్నే 'యుగళీకరణ చర్య' (ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ) అంటారు.

3. క్రింది చర్యలను పూరించండి.
   (a) CH3NC + HgO  
 ?
   (b) x + 2 H2O  
 CH3NH2 + HCOOH 


   

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌