• facebook
  • twitter
  • whatsapp
  • telegram

VA గ్రూపు మూలకాలు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు


2 మార్కుల ప్రశ్నలు


 

1.  'NO' పారా అయస్కాంత ధర్మాన్ని చూపడానికి కారణం ఏమిటి?
జ:    
 NOలో బేసి సంఖ్యలో అంటే ఒక ఎలక్ట్రాన్ ఉండటంతో అది పారా అయస్కాంత ధర్మాన్ని చూపుతుంది.

2.  నైట్రోజన్ పెంటాహాలైడ్‌లను ఇవ్వలేకపోవడానికి కారణం ఏమిటి?
జ:  N = 1s22s22p3.  Nలో d − ఆర్బిటాళ్లులేవు. దాని అష్టకాన్ని దాటి సమ్మేళనాలను ఏర్పరచలేదు. అందువల్ల N ట్రైహాలైడ్‌లను ఇవ్వగలదు. పెంటాహాలైడ్‌లను ఇవ్వలేదు.

3.   నైట్రోలిమ్ అంటే ఏమిటి? ఉపయోగాలు రాయండి.
జ:  కాల్షియం సైనమైడ్ (CaCN2), గ్రాఫైట్‌ల మిశ్రమాన్ని నైట్రోలిమ్ అంటారు. కాల్షియం కార్బైడ్ (CaC2), N2 లను 1273 K వరకు వేడి చేస్తే నైట్రోలిమ్ వస్తుంది. దీన్ని ఎరువుగా ఉపయోగిస్తారు.

4 మార్కుల ప్రశ్నలు
 

1.  ఆస్వాల్డ్ పద్ధతిలో HNO3ని పారిశ్రామికంగా ఎలా తయారు చేస్తారు?
జ: ఆస్వాల్డ్ పద్ధతి: అమ్మోనియా, గాలిని 1 : 7 నిష్పత్తిలో 1155 K వరకు వేడిచేస్తే NO ఏర్పడుతుంది.

                           
   NOను చల్లబరచి ఆక్సిజన్‌తో చర్య జరిపితే NO2 వస్తుంది. 
   2NO  +  O2  
 2ΝΟ2
   NO2 ను నీటిలోకి పంపితే 61% HNO3 వస్తుంది. 
   4 NO2 + 2 H2O + O2  
 4 HNO3
61% HNO3ని స్వేదనం చేస్తే 68% HNO3 వస్తుంది. దీన్ని గాఢ H2SO4 తో స్వేదనం చేస్తే 98% HNO3 ఏర్పడుతుంది. దీన్ని శీతలీకరణ మిశ్రమంతో చల్లబరిస్తే శుద్ధమైన 100% HNO3 స్ఫటికాలు ఏర్పడతాయి. 

2.  హేబర్ విధానంలో అమ్మోనియా తయారీని వివరించండి.
జ:  హేబర్ విధానం:  శుద్ధమైన, పొడిగా ఉన్న N2, H2 లను 1 : 3 నిష్పత్తిలో తీసుకుని సంపీడన పంపుతో సంపీడ్యం చేస్తారు.  దీన్ని శుద్ధిచేసే, ఆరబెట్టే గదిలోకి పంపి, తర్వాత ఉత్ప్రేరక గదిలోకి పంపిస్తారు. దీన్ని వేడిచేసి కండెన్సర్‌లోకి పంపి అమ్మోనియా ద్రవంగా మారుస్తారు. చర్యజరపని N2,H2లను మళ్లీ పరిభ్రమణ పంపు ద్వారా వెనక్కి పంపుతారు. అమ్మోనియా తయారీలో లీషాట్లియర్ నియమాన్ని ఉపయోగిస్తారు.
  దీని ప్రకారం కనీస ఉష్ణోగ్రత (725-775 K), అధిక పీడనం (200 - 300 అట్మాస్ఫియర్లు) ఉపయోగిస్తారు.

      
మెత్తగా నూరిన చూర్ణాన్ని ఉత్ప్రేరకంగా,  Moను ప్రవర్ధకంగా వాడతారు. ఇనుము బదులు K2O&Al2O3 మిశ్రమాన్ని కూడా వాడవచ్చు. ఈ పద్ధతిలో 10% NH3 ఏర్పడుతుంది.

 

3.  సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్‌ని పారిశ్రామికంగా తయారుచేసే పద్ధతిని వివరించండి.
జ: కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్, జిప్సం మిశ్రమాన్ని సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అంటారు. మెత్తగా చూర్ణం చేసిన ఎముకల పొడిని లేదా ఫాస్ఫేట్‌రాతిని, ఛాంబర్ ఆమ్లం (70% H2SO4)తో చర్యనొందిస్తే సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ వస్తుంది.

         Ca3 (PO4)2  +  2H2SO4  +  4 H2O     Ca (H2PO4)2  +  2(CaSO4.2H2O)
 ఈ విధానంలో మెత్తగా చూర్ణం చేసిన ఫాస్ఫేట్ రాతికి, తగినంత ఛాంబర్ ఆమ్లాన్ని పోత ఇనుముతో చేసిన మిక్సర్‌లో వేయాలి. దీన్ని స్టిర్రర్‌తో బాగా కలియబెట్టాలి. ఈ చర్యా మిశ్రమం V1, V2 అనే కవాటాల ద్వారా D1, D2 గదుల్లోకి కొద్దికొద్దిగా వెళ్తుంది. ఈ మిశ్రమాన్ని 24 నుంచి 36 గంటల వరకు అలాగే ఉంచితే చర్య జరుగుతుంది.


            

CaCO3, CaF2 మలినాలు CO2, HF లుగా తొలగిపోతాయి. ఉష్ణోగ్రత 373 K కి పెరుగుతుంది. అంతిమంగా వచ్చే పదార్థాన్ని సూపర్‌ఫాస్ఫేట్ అంటారు. దీనిలో నీటిలో కరగని గట్టి పదార్థం జిప్సం ఉంటుంది. ఇది వ్యర్థ పదార్థం. దీన్ని ఫాస్ఫారికామ్లంతో చర్యనొందించి, నీటిలో పూర్తిగా కరిగే ట్రిపుల్ ఫాస్ఫేట్‌ని తయారు చేస్తారు. ఇది నీటిలో కరగడం వల్ల మొక్కలు తేలిగ్గా తీసుకోగలుగుతాయి.
                    Ca3(PO4)2  +  4 H3PO4  
   3Ca(H2PO4)2

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌