• facebook
  • twitter
  • whatsapp
  • telegram

8(b) VI A గ్రూపు మూలకాలు  

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

1. సీమెన్ పద్ధతిలో ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు?
జ. సీమెన్ ఓజోనైజర్: సీమెన్ ఓజోనైజర్‌లో రెండు సహాక్ష గాజుగొట్టాలు ఒక వైపుమూసి ఉంటాయి.


          గాజుగొట్టాలకు లోపల, బయట తగరపు రేకులతో పూత పూస్తారు.

 
          శుద్ధమైన పొడి O2 ను వలయా కార ప్రదేశం ద్వారా పంపి, నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గం జరిపితే ఓజోన్‌యుత ఆక్సిజన్ ఏర్పడుతుంది. ఈ మిశ్రమాన్ని చల్లబరిస్తే ముందుగా "O3" ద్రవీభవనం చెందుతుంది. 
              3O2  
  2O3 ∆H = 284.5 కి. జౌ.
 

2. బ్రాడీ పద్ధతిలో ఓజోన్‌ను ఎలా తయారుచేస్తారు?
జ. బ్రాడీ ఓజోనైజర్: బ్రాడీ ఓజోనైజర్ గాజుతో తయారైంది.
                              దీన్ని సజల H2SO4 ఉండే       సిలిండర్‌లో ఉంచుతారు. 

           ఈ ఆమ్లంలో Cu ఎలక్ట్రోడ్‌లను ఉంచి శక్తిమంతమైన ప్రేరణచుట్టకు కలుపుతారు.శుద్ధమైన ఆక్సిజన్‌ను వలయాకార ప్రదేశం ద్వారా పంపి, నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గాన్ని జరిపితే ఓజోన్‌యుత ఆక్సిజన్ ఏర్పడుతుంది. ఈ మిశ్రమాన్ని చల్లబరిస్తే ముందుగా O3 ద్రవీభవనం చెందుతుంది. 


 3O2  2O3, ∆H = 284.5 కి. జౌ.

 
 

3. ఓజోన్ ఆక్సీకరణ ధర్మాలను ఏవైనా నాలుగు తెలపండి
జ: ఆక్సీకరణ ధర్మాలు:
* నల్లటి pbSను O3 తెల్లటి pbSO4 గా ఆక్సీకరణం చేస్తుంది.

    PbS + 4O3 PbSO4 + 4O2
* ఓజోన్ తడి KI ను I2 గా ఆక్సీకరణం చేస్తుంది.
     2KI + H2O + O3 2KOH + I+ O2
* ఓజోన్ SnCl2 ను SnCl4 గా ఆక్సీకరణం చేస్తుంది. 
    3 SnCl2 + 6HCl + O3 3SnCl4 + 3H2O
* టెయిలింగ్ ఆఫ్ మెర్క్యురీ:
            ఓజోన్ పాదరసంతో చర్య జరిపి తళతళ మెరిసే లోహ కాంతిని, ద్రవ మట్టాన్ని కోల్పోయి గాజుత లంపై అంటుకునే విధానాన్ని టెయిలింగ్ ఆఫ్ మెర్క్యురీ అంటారు.
     2Hg + O3 Hg2O + O2

 

4. ఓజోన్ క్షయకరణ ధర్మాలను ఏవైనా మూడు పేర్కొనండి
జ: ఓజోన్ క్షయకరణ ధర్మాలు:
* ఓజోన్ Ag2O ను Ag గా క్షయకరణం (పరస్పర క్షయకరణం) చేస్తుంది.
    Ag2O + O3 2Ag + 2O2

* ఓజోన్ BaO2 ను BaO గా క్షయకరణం చేస్తుంది.
    BaO2 + O3 BaO + 2O2
* ఓజోన్ H2O2 ను H2O గా క్షయకరణం చేస్తుంది.
    H2O2 + O3 H2O + 2O2 

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌