• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉష్ణగతికశాస్త్రం

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

4 మార్కులు ప్రశ్నలు
 

1. హెస్ స్థిర ఉష్ణరాశి సంకలన నియమాన్ని తెలిపి, వివరించండి.
జ: హెస్ స్థిర ఉష్ణరాశి సంకలన నియమం: ఒక రసాయన చర్య ఒక దశలో జరిగినా, అనేక దశల్లో జరిగినా ఉష్ణరాశిలో మార్పు స్థిరంగా ఉంటుంది.
   ఉదా: C (గ్రాఫైట్)  +
 O2 (వా.)       CO (వా.)        H =  -110.5  కి.జౌ.
   ఉదా: CO (వా.)  +  
 O2 (వా.)    CO2 (వా.)         H =  -283  కి.జౌ.
   ఉదా: C (గ్రాఫైట్)  +  O2  (వా.)    

CO2 (వా.)            H =   -393  కి.జౌ.
హెస్ నియమం అనువర్తనాలు:
* రసాయన చర్యలో ఏర్పడే మధ్యస్థ అస్థిర పదార్థాల సంశ్లేషణోష్ణాలను పరోక్షంగా లెక్కించవచ్చు. 
* Nacl స్ఫటికాల స్ఫటిక జాలక శక్తిని లెక్కించవచ్చు.
* అతి నెమ్మదిగా జరిగే చర్యల చర్యోష్ణాన్ని లెక్కించవచ్చు.

2. సంఘటనోష్ణం, దహనోష్ణం, తటస్థీకరణోష్ణం, పరమాణీకరోణోష్ణాలను తెలిపి ప్రతి దానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జ: సంఘటనోష్ణం (సంశ్లేషణోష్ణం): ఒక మోల్ పదార్థం దాని మూలకాల నుంచి ఏర్పడినప్పుడు వెలువడే లేదా గ్రహించే ఉష్ణరాశి.
           ఉదా: H2 (వా.)  +  
 O2 (వా.)     H2 O (ద్ర.)   H = -286 కి.జౌ.
దహనోష్ణం:  ఒక మోల్ పదార్థాన్ని పూర్తిగా ఆక్సిజన్‌లో మండించినప్పుడు వెలువడే ఉష్ణరాశి.
          ఉదా: C (గ్రాఫైట్) + O2 (వా.)  
  CO2 (వా.)  H  =  -393.5 కి.జౌ.
తటస్థీకరణోష్ణం:  ఒక గ్రాము తుల్యాంక భారమున్న ఆమ్లం, ఒక గ్రాము తుల్యాంక భారం ఉన్న క్షారంతో పూర్తిగా తటస్థీకరణం చెందినప్పుడు వెలువడే ఉష్ణరాశి. 
                      HCl (జల) + KOH (జల)  
   KCl (జల) + H2 O (ద్ర)  H = -57.3 కి.జౌ.
పరమాణీకరణోష్ణం: ఒక మోల్ వాయుస్థితిలో ఉన్న అణువుల్ని అనుఘటక పరమాణువుగా విడగొట్టడానికి అవసరమయ్యే ఉష్ణరాశి
                  ఉదా: H2 (వా.)    

  2H (వా.)   H =  43.5 కి.జౌ.

2 మార్కుల ప్రశ్నలు
 

1. విస్తార ధర్మాలంటే ఏమిటి?
జ: వ్యవస్థలోని ద్రవ్యం మొత్తం పరిమాణంపై ఆధారపడే ధర్మాలు.  ఉదా: ఎంట్రోపీ, ఎంథాల్పీ

 

2. గ్రహణ ధర్మాలంటే ఏమిటి?
జ:  గ్రహణ ధర్మాలు: వ్యవస్థలోని ద్రవ్య పరిమాణంపై ఆధారపడని ధర్మాలు.   ఉదా: బాష్పపీడనం, సాంద్రత.

 

3. అంతరిక శక్తి అంటే ఏమిటి?
జ:  అంతరిక శక్తి (E): ఒక పదార్థంలో అంతర్గతంగా కొంత పరిమాణంలో ఇమిడి ఉన్న శక్తి 
                           
E  = Ep - ER  
                       
E  =  అంతరిక శక్తిలో మార్పు 
                        Ep  =  క్రియాజన్యాల అంతరిక శక్తి 
                        ER  =  క్రియాజనకాల అంతరిక శక్తి

4. ఎంథాల్పీ అంటే ఏమిటి?
జ: ఎంథాల్పీ లేదా ఉష్ణపరిమాణం (H):  స్థిరపీడనం వద్ద వ్యవస్థ ఉష్ణ పరిమాణం 
               
H = Hp - HR
             

H = క్రియాజనకాల, క్రియాజన్యాల ఎంథాల్పీలో మార్పు 
      Hp = క్రియాజన్యాల ఎంథాల్పీ;       HR = క్రియాజనకాల ఎంథాల్పీ 

5. ఎంట్రోపీ అంటే ఏమిటి?

ఎంట్రోఫీ:  వ్యవస్థలోని అణువుల క్రమరాహిత్యం. 
               ఎంట్రోఫీ
 క్రమరాహిత్యం. 
          S వాయువు > S ద్రవం > S ఘనం     

  


6. పరమ ఎంట్రోపీ అంటే ఏమిటి?
జ:  పరమ ఎంట్రోపీ: నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ప్రమాణ స్థితిలో ఉన్న ఒక మోల్ పదార్థ ఎంట్రోపీ.

7. గిబ్స్ శక్తి అంటే ఏమిటి?
జ: గిబ్స్ శక్తి: ఎంథాల్పీ ఎంట్రోపి, పరమ ఉష్ణోగ్రతల లబ్ధాలకు మధ్య భేదం.
                                                G = H - TS

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌