• facebook
  • twitter
  • whatsapp
  • telegram

4(సి). ఆమ్లాలు, క్షారాలు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

4 మార్కుల ప్రశ్నలు

1. బ్రాన్‌స్టెడ్ - లౌరి ఆమ్ల, క్షార సిద్ధాంతాన్ని వివరించండి. 
జ:  బ్రాన్‌స్టెడ్ ఆమ్లం: వేరొక పదార్థానికి ప్రోటాన్‌ని దానం చేసే పదార్థం. ఉదా: HCl, HNO3.
బ్రాన్‌స్టెడ్ క్షారం: వేరొక పదార్థం నుంచి ప్రోటాన్‌ని స్వీకరించే పదార్థం. ఉదా: NH3, Cl-, HSO4-.
కాంజుగేట్ ఆమ్ల - క్షార జంట: ఒక ప్రోటాన్ తేడా ఉన్న ఆమ్ల క్షార జంట.
NH3 + H2O   NH4++ OH-

H2O  &  OH-  ; NH4+&  NH3 లు ఆమ్ల క్షార (కాంజుగేట్) జంటలు.

2. లూయీస్ ఆమ్ల, క్షార సిద్ధాంతాన్ని వివరించండి.
జ: లూయీ ఆమ్లం: ఎలక్ట్రాన్ జంటను స్వీకరించి సమన్వయ సమయోజనీయ బంధాన్ని ఏర్పరచగల పదార్థం. 
     ఉదా: BF3, BCl3

లూయిస్ ఆమ్లాల్లో రకాలు:
* అన్ని కేటయాన్లు: CO
, Fe
* ఎలక్ట్రాన్ షష్టి మూలకాలు: O, S
* బహుబంధాలుండే అణువులు: CO2, SO2.
* ఖాళీ d - ఆర్బిటాళ్లుండే అణువులు: SF4, SiF4.
* అసంపూర్తి అష్టకం ఉండే అణువులు: AlF3, BF3.
లూయీస్ క్షారం: ఎలక్ట్రాన్ జంటను దానం చేసి సమన్వయ సమయోజనీయ బంధాన్ని ఏర్పరచగల పదార్థం.
                     ఉదా: H2O, NH3.
లూయీస్ క్షారాల్లో రకాలు:
* అన్ని ఆనయాన్లు: F- , Cl-
* ఒంటరి జంటలున్న అణువులు: ROH, NH3
* బహుబంధాలుండే అణువులు: C2H2, C2H4
         బ్రాన్‌స్టెడ్ క్షారాలన్నీ లూయీస్ క్షారాలే. ఉదాహరణకు NH3 ప్రోటాన్‌ను స్వీకరించి NH
+ అవుతుంది. కాబట్టి అది బ్రాన్‌స్టెడ్ క్షారం, NH3 ఒక ఎలక్ట్రాన్ జంటను దానం చెయ్యగలదు కాబట్టి అది లూయీస్ క్షారం. కానీ లూయీస్ ఆమ్లాలన్నీ బ్రాన్‌స్టెడ్ ఆమ్లాలు కానక్కరల్లేదు (ప్రోటాన్లు ఉండవు కాబట్టి). ఉదా: Fe+3, Cu+2, SO2.

3. pH అంటే ఏమిటి? 0.05 M Ba(OH)2 జలద్రావణ pH ని కనుక్కోండి.
జ: H+ అయాన్ గాఢత (మోల్స్/లీటర్) సంవర్గమానం రుణాత్మక విలువనే pH అంటారు.
                             pH = -log10 [H+]
              నార్మాలిటీ = N = [OH-] = 2 × 0.05 = 0.1 = 10-1
               
pOH = -log10 [OH-) = -log[10-1] = - (-1) = 1
                 
pH = 14 - pOH = 14 - 1 = 13.

4. బఫర్ ద్రావణాలంటే ఏమిటి? సోదాహరణంగా వర్గీకరించండి.
జ: బఫర్ ద్రావణం: కొన్ని మి.లీ.ల బలమైన ఆమ్లాన్ని లేదా బలమైన క్షారాన్ని కలిపినా pH లో మార్పును నిరోధించే ద్రావణాలను బఫర్ ద్రావణాలు అంటారు.
ఆమ్ల బఫర్ ద్రావణాలు: బలహీనమైన ఆమ్లానికి, దాని బలమైన క్షారంతో తయారైన లవణ ద్రావణం కలిపితే ఏర్పడే ద్రావణం.
ఉదా: CH3COOH + CH3COONa
క్షార బఫర్ ద్రావణాలు: బలహీనమైన క్షారానికి, దాని బలమైన ఆమ్లంతో తయారైన లవణ ద్రావణాన్ని కలిపితే ఏర్పడే ద్రావణం.
ఉదా: NH4OH + NH4Cl

5. ఆమ్ల బఫర్, క్షార బఫర్ ద్రావణాలు పని చేసే విధానాన్ని తెలపండి.
జ: ఆమ్ల బఫర్ ద్రావణం పనిచేసే విధానం: ఆమ్ల బఫర్ ద్రావణానికి
     (ఉదా: CH3COOH + CH3COONa) కొద్ది చుక్కల బలమైన ఆమ్లాన్ని కలిపితే, ఆమ్లం నుంచి వచ్చిన H+
 అయాన్లు, CH3COO- తో కలిసి బలహీనమైన ఆమ్లం ఏర్పడుతుంది.
            CH3COO-
 + H+  CH3COOH
    H
 అయాన్ గాఢతలో మార్పు లేనందువల్ల బఫర్ pH మారదు. బఫర్‌కి కొద్ది చుక్కల బలమైన క్షారాన్ని కలిపితే, క్షారం నుంచి వచ్చే OH- అయాన్లు ఆమ్లంలోని H+ అయాన్లతో కలసి H2O ని ఇస్తాయి.
      CH3 COOH + OH-
    CH3COO- + H2O
      OH-
 అయాన్ గాఢతలో మార్పు లేనందువల్ల బఫర్ pH మారదు.
క్షార బఫర్ ద్రావణం పనిచేసే విధానం: క్షార బఫర్ ద్రావణానికి (ఉదా: NH4OH + NH4Cl) కొద్ది చుక్కల బలమైన ఆమ్లాన్ని కలిపితే, ఆమ్లం నుంచి వచ్చిన H+
 అయాన్లు, క్షారంలోని OH- అయాన్లతో కలసి, స్పల్పంగా విఘటనం చెందే నీటిని ఇస్తుంది. H+ అయాన్ గాఢతలో మార్పులేనందు వల్ల, బఫర్ pH మారదు.
           NH4OH + H+
    NH4+ + H2O

         క్షార బఫర్‌కి కొద్ది చుక్కల బలమైన ఆమ్లాన్ని కలిపితే, క్షారం నుంచి వచ్చే OH- అయాన్లు, NH4+ అయాన్లతో కలసి NH4OH ను ఇస్తాయి. 
          NH4+
 + OH-    NH4OH
          OH
 అయాన్ గాఢతలో మార్పు లేనందువల్ల, బఫర్ pH మారదు.
 

6. లవణ జలవిశ్లేషణ అంటే ఏమిటి? అమ్మోనియం క్లోరైడ్ జలద్రావణానికి pH విలువ 7 కంటే తక్కువగా ఉండటానికి కారణం ఏమిటి?
జ: లవణానికి చెందిన కేటయాన్ లేదా ఆనయాన్ లేదా రెండూ నీటితో చర్య జరిపి H+
 అయాన్లు లేదా OH-అయాన్లు లేదా రెండూ ఏర్పడే దృగ్విషయాన్ని ''లవణ జలవిశ్లేషణ'' అంటారు.
NH4Cl జల విశ్లేషణ: NH4Cl లవణం బలహీన క్షారమైన NH4OH, బలమైన ఆమ్లమైన HCl వల్ల ఏర్పడింది. అంటే NH4+
 కాంజుగేట్ అయాన్ బలమైన ఆమ్లం. ఇది కేటయాన్ జల విశ్లేషణ చెంది H+  అయాన్‌లను ఇస్తుంది. కాబట్టి NH4Cl  జల ద్రావణానికి ఆమ్ల స్వభావం ఉంటుంది. pH < 7.


               

7. (a) సోడియం ఎసిటేట్ (b) అమ్మోనియం ఎసిటేట్ జలద్రావణాల స్వభావాన్ని వివరించండి.
జ: CH3COONa జల విశ్లేషణ:
CH3COONa లవణం CH3COOH అనే బలహీన ఆమ్లం, NaOH అనే బలమైన క్షారం వల్ల ఏర్పడింది. కాబట్టి CH3COO-
 కాంజుగేట్ అయాన్ బలమైన క్షారం, ఇది ఆనయాన్ జల విశ్లేషణం చెంది OH- అయాన్‌లను ఇస్తుంది. CH3COONa జలద్రావణానికి క్షార స్వభావం ఉంటుంది. pH > 7.


                 
CH3COONH4 జలవిశ్లేషణ:
          CH3COONH4 లవణం CH3COOH అనే బలహీన ఆమ్లం, NH4OH అనే బలహీన క్షారం వల్ల ఏర్పడింది. CH3COO-
, NH4+ కాంజుగేట్ అయాన్లు వరుసగా బలమైన క్షారం, బలమైన ఆమ్లం. ఇవి ఆనయాన్, కేటయాన్ జలవిశ్లేషణ చెంది OH-, H+ అయాన్‌లను ఇస్తాయి. బలహీన ఆమ్లం లేదా బలహీన క్షారం విఘటనా తీవ్రతలను బట్టి ద్రావణ స్వభావం తటస్థంగా లేదా ఆమ్ల లేదా క్షార స్వభావంతో ఉంటుంది.  


                               

8. ఉమ్మడి అయాన్ ప్రభావం అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యతను తెలపండి.
జ: ఉమ్మడి అయాన్ ప్రభావం లేదా ఉభయ సామాన్య అయాన్ ప్రభావం:
        ఒక బలహీన విద్యుద్విశ్లేష్యకానికి, ఉమ్మడి కేటయాన్ ఉన్న బలమైన విద్యుద్విశ్లేష్యకాన్ని కలిపితే, బలహీన విద్యుద్విశ్లేష్యకం ద్రావణీయత తగ్గిపోయే ప్రక్రియను ''ఉమ్మడి అయాన్ ప్రభావం'' అంటారు.
ఉమ్మడి అయాన్ ప్రభావం అనువర్తనాలు:
* NaCl ద్రావణంలోకి, HCl వాయువును పంపితే శుద్ధమైన NaCl అవక్షేపితమవుతుంది.
* బఫర్ ద్రావణాల H+
 అయాన్ గాఢతను నియంత్రించడానికి
* విశ్లేషణాత్మక రసాయనశాస్త్రంలో
* గుణాత్మక విశ్లేషణలో లవణంలోని కేటయాన్‌ను గుర్తించడానికి ఉపయోగిస్తారు.

 

9. ద్రావణీయతా లబ్ధం అంటే ఏమిటి? దాని అనువర్తనాలను తెలపండి.
జ: ద్రావణీయతా లబ్ధం (Ksp): ఒక సంతృప్త లవణ ద్రావణంలో ఉన్న కేటయాన్, ఆనయాన్ గాఢతల లబ్ధాన్ని ద్రావణీయతా లబ్ధం అంటారు. Ax By అనే లవణానికి ద్రావణీయతా లబ్ధాన్ని కింది విధంగా వివరించవచ్చు.

            Ax By      xA+ + yB-

ద్రావణీయతా లబ్ధం అనువర్తనాలు:
* III గ్రూపు హైడ్రాక్సైడ్‌లు, II, IV వ గ్రూపు సల్ఫైడ్లను అవక్షేపించడం.
* సోడియం బై కార్పొనేట్‌ను పారిశ్రామికంగా తయారుచేయడంలో.

 

10. (a) AB లవణం ద్రావణీయత 10-10 మోల్స్/లీటర్2. అయితే ఆ లవణం ద్రావణీయత ఎంత?
       (b) A2B లవణం ద్రావణీయత 2 × 10-3 మోల్స్/లీటర్. అయితే ఆ లవణం ద్రావణీయతా లబ్ధం ఎంత?
జ: (a) KSP = [A+][B-] = S × S = S2
         
 ద్రావణీయత (S) =  = 10-5 మోల్స్/లీటర్
               (b) S = ద్రావణీయత = 2 × 10-3 మోల్స్/లీటర్
                  KSP = [A+]2 [B-]2 = (2S)2 × S = 4S3
     
  KSP = 4(2 × 10-3)3 = 32 × 10-9 మోల్స్3/లీటర్3

Posted Date : 06-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌