• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అణు జీవ‌శాస్త్రం

1. హెటిరోక్రొమాటిన్, యూక్రొమాటిన్‌ మధ్య భేదాన్ని తెలపండి. అనులేఖనం రీత్యా ఏది క్రియాత్మకంగా ఉంటుంది?

జ:

  


2. DNA పాలిమరేజ్‌ విధి ఏమిటి?

జ: ఇది DNA మూస ఫలకాన్ని అనుసరించి డీఆక్సీన్యూక్లియోటైడ్ల పుంజీకరణను ఉత్ప్రేరితం చేస్తుంది.

3. న్యూక్లియోటైడ్‌లోని అనుఘటకాలు ఏవి?

జ: నత్రజని క్షారం, పెంటోజ్‌ చక్కెర, ఫాస్ఫేట్‌ అణువు.


4. అనులేఖనం ప్రమాణంలోని అనుఘటకాలు ఏవి?

జ: 1) ప్రమోటర్‌    2) నిర్మాణాత్మక జన్యువు   3) టెర్మినేటర్‌


5. ఎక్సాన్లకు, ఇన్‌ట్రాన్లకు మధ్య భేదం ఏంటి?

జ:  *  ఎక్సాన్లు - వ్యక్తమయ్యే అనుక్రమాలు, ఇవి పరిపక్వ ళివితిలో ఉంటాయి.

* ఇన్‌ట్రాన్లు - మధ్య అంతరాయాలు, ఇవి పరిపక్వ ళివితిలో ఉండవు.


6. కాపింగ్, పాలిఅడినలైజేషన్‌ అంటే  ఏమిటి?

జ: కాపింగ్‌:  hn - RNA3  కొనకు అసాధారణ న్యూక్లియోటైడ్‌ను చేర్చడాన్ని ‘కాపింగ్‌’ అంటారు.

  పాలిఅడినలైజేషన్‌: 3 కొనలో అడినైలేట్‌ అవశేషాలు కలిగిన పాలి తి తోకను స్వతంత్రంగా తయారు చేయడాన్ని పాలిఅడినలైజేషన్‌ అంటారు.


7. ' AUG " సంకేతం విధి ఏమిటి?

జ: ' AUG "  ప్రారంభ సంకేతం.ఇది మిథియోనైన్‌ అనే అమైనో ఆమ్లానికి త్రికసంకేతంగా పనిచేస్తుంది. అంటే ఇది ద్వంద్వ ప్రక్రియలను నిర్వహిస్తుంది.


8. ఆపుదల సంకేతాలు అంటే ఏమిటి? వాటి సంకేతాలను రాయండి.

జ: ఎలాంటి అమైనో ఆమ్లాలకు త్రిక సంకేతాలుగా వ్యవహరించని త్రికాలను ఆపుదల సంకేతాలు అంటారు. ఇవి UAA, UAG, UGA


9. DNA అణువులో థయామిన్‌ 30%  ఉంటే, మిగిలిన నత్రజని క్షారాల శాతాన్ని రాయండి.

జ:   A = 30%  T = 30%  G = 20%  C = 20%


10. అడినైన్‌ - 18%, గ్వానైన్‌ - 30%,  సైటోసిస్‌ - 42%, యూరాసిల్‌ - 10% ఉంటే, అది ఏ రకమైన కేంద్రక ఆమ్లమో తెలిపి, అందులో పోచల సంఖ్యను తెలపండి.

జ:  RNA, ఏకపోచ.

Posted Date : 28-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌