• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జీర్ణక్రియ - శోషణం

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

నాలుగు మార్కుల ప్రశ్నలు

1. దంతం నిలువుకోత పటం గీసి, భాగాలను గుర్తించండి. 

జ:

 
 

2. జీర్ణాశయంలో మాంసకృత్తుల జీర్ణక్రియను వివరించండి.
జ: జీర్ణాశయంలో జఠర గ్రంథులు జఠర రసాన్ని స్రవిస్తాయి. జఠర రసంలో HCl, పెప్సినోజన్, ప్రోరెన్నిన్, కాజిల్‌ అంతర్గత కారకం ఉంటాయి.
*  HCl పెప్సినోజెన్, ప్రోరెన్నిన్‌లను చైతన్యవంత పెప్సిన్, రెన్నిన్‌లుగా మారుస్తుంది.

 
* పెప్సిన్‌ మాంసకృత్తులను ప్రోటియోజ్‌లు, పెప్టోన్‌లుగా విడగొడుతుంది.
 ప్రోటీన్‌లు 

 ప్రోటియోజ్‌లు, పెప్టోన్‌లు 
* రెన్నిన్‌ పాలలోని కెసిన్‌ అనే ప్రోటీన్‌ను కాల్షియం అయాన్‌ల సమక్షంలో కాల్షియం పారాకెసినేట్‌గా మారుస్తుంది.

  కెసిన్‌  కాల్షియం పారాకెసినేట్‌

* పెప్సిన్‌ కాల్షియం పారాకెసినేట్‌ను పెప్టోన్‌లుగా మారుస్తుంది.

 కాల్షియం పారాకెసినేట్‌  పెప్టోన్‌లు

3. కాలేయం విధులను పేర్కొనండి.
జ: * కాలేయం పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్న పైత్యరసాన్ని స్రవిస్తుంది. దీనిలోని లవణాలు కొవ్వుల జీర్ణక్రియలో సహాయపడతాయి. 
* కాలేయం కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియలో ముఖ్యపాత్ర వహిస్తుంది.
* కొలిస్టిరాల్, ట్రైగ్లిసరైడ్ల సంశ్లేషణలో పాల్గొంటుంది.
* రక్త స్కందన కారకాలైన ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిన్‌లను, ప్రతిస్కందకం అయిన హెపారిన్‌ను తయారు చేస్తుంది.
* అమైన్‌ ఆమ్లాలను డీ-ఎమినేషన్‌ చేసి, ఏర్పడిన అమ్మోనియాను ఆర్నిథిన్‌ వలయం ద్వారా యూరియాగా మారుస్తుంది.
* కొవ్వులో కరిగే విటమిన్‌ A, D, E, K లను B12 విటమిన్‌ను, ఇనుమును నిల్వ చేస్తుంది.
* ఆహారం ద్వారా పేగులోకి ప్రవేశించిన విషపదార్థాలను విషరహితం చేస్తుంది.
* కాలేయం ఉష్ణక్రమత అవయవంగా పనిచేస్తుంది.
* పిండదశలో రక్తకణాల ఉత్పత్తిలో, ప్రౌఢదశలో రక్తకణ విచ్ఛిత్తిలో పాల్గొంటుంది.
* కాలేయంలో కుప్‌ఫెర్‌ కణాలుగా పిలిచే పెద్ద భక్షక కణాలుంటాయి. ఇవి కాలేయంలోకి ప్రవేశించిన అనవసర పదార్థాలను, సూక్ష్మజీవులను తొలగిస్తాయి.

 

రెండు మార్కుల ప్రశ్నలు
1. మానవ ప్రౌఢ దశలోని దంత ఫార్ములాను తెలపండి.
జ: మానవ ప్రౌఢ దశలో 32 దంతాలుంటాయి. ప్రతి దవడ సగ భాగంలో ఉండే దంతాలు కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు క్రమంలో అమరి ఉంటాయి.  
 మానవ ప్రౌఢ దశలో


2. పైత్యరసంలో జీర్ణ ఎంజైమ్‌లు ఉండవు. అయినా జీర్ణక్రియలో ముఖ్యమైంది ఎలా?
జ: పైత్యరసంలో జీర్ణ ఎంజైమ్‌లు ఉండవు. కానీ పైత్యరస లవణాలైన సోడియం/ పొటాషియం గ్లైకోలేట్లు, టారోకోలేట్లు ఉంటాయి. ఇవి కొవ్వులను ఎమల్సీకరిస్తాయి. లైపేజ్‌ అనే ఎంజైమ్‌ను ఉత్తేజపరుస్తాయి. లైపేజ్‌లు ఎమల్సీకరించబడిన కొవ్వులను జీర్ణం చేస్తాయి.

 

3. జీర్ణాశయంలో HCl స్రవించకపోతే ఏం జరుగుతుందో వివరించండి.
జ: * HCl ఆహారంలోని సూక్ష్మజీవులను చంపుతుంది.
    * ప్రోటీన్‌ల జీర్ణక్రియకు సహాయపడే పెప్సిన్‌కు అవసరమైన ఆమ్ల pH ను కలగజేస్తుంది.
   * చైతన్యరహితమైన పెప్సినోజన్, ప్రోరెన్నిన్‌ ఎంజైములను చైతన్యవంతమైన పెప్సిన్, రెన్నిన్‌గా మారుస్తుంది. 
   * HCl స్రవించకపోతే పై చర్యలు ఆగిపోతాయి.

4. గర్తదంతి, ద్వివారదంతి పదాలను వివరించండి.
: * మానవుడిలో దవడ ఎముక గర్తాల్లో ఇమిడి ఉన్న దంతాలను గర్తదంతి అంటారు.
    * మానవుడితో సహా అనేక క్షీరదాల్లో దంతాలు వాటి జీవితకాలంలో రెండుసార్లు ఏర్పడతాయి.
    * బాల్య దశలో తాత్కాలిక పాలదంతాలు, ప్రౌఢదశలో వాటి స్థానంలో శాశ్వత దంతాలు. ఈ రకమైన దంత విన్యాసాన్ని ద్వివారదంతి అంటారు.

 

5. స్వయం ఉత్ప్రేరణ అంటే ఏమిటి? రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జ: ఒక చర్యలో అంతిమంగా ఏర్పడిన ఒక పదార్థం, అదే చర్యకు ఉత్ప్రేరకంగా పనిచేసినట్లయితే దాన్ని స్వయం ఉత్ప్రేరణ అంటారు.

 

6. కైమ్‌ అంటే ఏమిటి?
జ: జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమై, ఆమ్ల లక్షణాలున్న ఆహారాన్ని కైమ్‌ అంటారు.

 

7. మానవుడిలో వివిధ రకాల లాలాజల గ్రంథులను పేర్కొని, అవి నోటిలో ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలపండి.
జ: మానవుడిలో మూడు జతల లాలాజల గ్రంథులున్నాయి. అవి
1. పెరోటిడ్‌ గ్రంథులు: ఇవి వెలుపలి చెవి పీఠ భాగంలో ఉంటాయి.
2. అధోజంభికా గ్రంథులు: ఇవి కింది దవడ మూలభాగంలో ఉంటాయి.
3. అధోజిహ్వక గ్రంథులు: ఇవి నాలుక కింది భాగంలో ఉంటాయి.

 

8. మానవుడి నాలుకపై ఉన్న వివిధ సూక్ష్మాంకురాలను పేర్కొనండి.
జ: నాలుకపై చిన్నగా ముందుకు పొడుచుకుని వచ్చే నిర్మాణాలను సూక్ష్మాంకురాలు అంటారు. ఇవి 3 రకాలు.
1. ఫంజీఫాం సూక్ష్మాంకురాలు
2. తంతురూప సూక్ష్మాంకురాలు
3. సర్కంవెల్లెట్‌ సూక్ష్మాంకురాలు

 

9. మానవుడి దేహంలో అత్యంత కఠిన పదార్థం ఏది? అది ఏవిధంగా ఏర్పడుతుంది?
జ: * దంతంపై ఆవరించిన పింగాణి పొర మానవ దేహంలో అత్యంత కఠిన పదార్థం.
    * దీన్ని బహిస్త్వచం నుంచి ఏర్పడిన ఎమిలోబ్లాస్టులు స్రవిస్తాయి.
          

Posted Date : 30-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌