• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కండర అస్థిపంజర వ్యవస్థ

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

 

రెండు మార్కుల ప్రశ్నలు
1. త్రయావ్యవస్థ అంటే ఏమిటి?
జ: అస్థికండరంలోని సార్కోప్లాజమిక్‌ రెటిక్యులం T ఆకారపు నాళికను, దానికి సన్నిహితంగా ఉన్న రెండు సిస్టర్నేలను కలిగి ఉంటుంది. దీన్ని త్రయావ్యవస్థ అంటారు.

 

2. ఏక్టిన్, మయోసిన్‌ మధ్య భేధం ఏమిటి? 
జ:  

ఏక్టిన్ 
మ‌యోసిన్‌
 


* కండ‌ర సూక్ష్మ తంతువులోని స‌న్న‌టి  తంతువుల‌ను ఏక్టిన్ అంటారు.


* కండ‌ర సూక్ష్మ తంతువులోని
ద‌ళ‌స‌రి  తంతువుల‌ను మ‌యోసిన్‌ అంటారు.

* దీనిలో ఏక్టిన్‌, ట్రోపోనిన్, ట్రోపోమ‌యోసిన్‌ అనే ప్రోటీన్లు ఉంటాయి.

* దీనిలో ఏక్టిన్‌, ‌మయోసిన్‌ అనే ప్రోటీన్ మాత్ర‌మే ఉంటుంది.


 

3. ఎర్రని కండర తంతువులు, తెల్లని కండర తంతువుల మధ్య భేదాలను తెలపండి. 

జ:
 

 

నాలుగు మార్కుల ప్రశ్నలు
1. కోరి వలయం అంటే ఏమిటి? ప్రక్రియ గురించి వివరించండి.
జ: గ్లూకోజ్‌ ఆక్సీకరణం చెందడం వల్ల శక్తి విడుదలవుతుంది. ఆ శక్తిని ఉపయోగించుకుని కండరం సంకోచిస్తుంది. కండరం త్వరితగతిన పదేపదే సంకోచం చెందడం వల్ల గ్లూకోజ్‌ ఆక్సీకరణకు తగినంత ఆక్సిజన్‌ లభించదు. అప్పుడు గ్లూకోజ్‌ అవాయు శ్వాసక్రియ ద్వారా లాక్టిక్‌ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల కండరం అలసిపోతుంది.
          కండరంలోని లాక్టిక్‌ ఆమ్లం రక్తం ద్వారా కాలేయాన్ని చేరుతుంది. కాలేయంలో లాక్టిక్‌ ఆమ్లం పైరువిక్‌ ఆమ్లంగా మారుతుంది. దీన్నుంచి ‘గ్లూకోనియోజెనిసిస్‌’ పద్ధతి ద్వారా గ్లూకోజ్‌ ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన గ్లూకోజ్‌ రక్తం ద్వారా తిరిగి కండరాలకు చేరి కండర సంకోచంలో వినియోగమవుతుంది. కండర సంకోచం ఆగిపోయినప్పుడు ఈ గ్లూకోజ్‌ గ్లైకోజెనిసిస్‌ పద్ధతి ద్వారా గ్లైకోజెన్‌గా మార్పు చెంది, కాలేయంలో నిల్వ ఉంటుంది. ఈ విధంగా రేఖిత కండరానికి, కాలేయానికి మధ్య జరిగే గ్లూకోజ్‌ ద్వంద్వ రవాణాను కోరి వలయం అంటారు.

 

2. శ్రోణిమేఖల చక్కని పటాన్ని గీయండి.

 

3. సైనోవియల్‌ కీలు నిర్మాణాన్ని చక్కని పటం ద్వారా వివరించండి.

 కీలును కప్పి ఉంచుతూ రెండు పొరలతో ఏర్పడిన సైనోవియల్‌ గుళిక ఉంటుంది. కీలు వెలుపలి పొర క్రమరహిత తంతుయుత సాంద్రసంయోజక కణజాలాన్ని కలిగి ఉంటుంది. దీనిలో కొల్లాజిన్‌ తంతువులు అధికంగా ఉంటాయి. ఈ పొర రెండు పర్యస్థికలను కలుపుతూ కీలు సాగే గుణాన్ని నిరోధిస్తుంది. కీలులోని ఎముకలు స్థానభ్రంశం చెందకుండా నిరోధిస్తుంది. స్థితిస్థాపక తంతువులతో కూడిన ఈ పొరలోని కొన్ని తంతువులు కట్టలుగా కలిసి, బంధకాలుగా ఏర్పడతాయి.
      సైనోవియల్‌ గుళిక లోపలి పొర ఏరియోలార్‌ కణజాలంతో ఏర్పడుతుంది. ఈ పొర చిక్కని సైనోవియల్‌ ద్రవాన్ని స్రవిస్తుంది. ఈ ద్రవంలో హయలురోనిక్‌ ఆమ్లం, భక్షక కణాలు మొదలైనవి ఉంటాయి. సైనోవియల్‌ ద్రవం కీళ్ల మధ్య కందెనలా పనిచేసి ఎముకల మధ్య రాపిడిని తగ్గిస్తుంది.

Posted Date : 13-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌