• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రసాయన గతికశాస్త్రం

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

 8 మార్కుల ప్రశ్నలు:      

1. రసాయన చర్యా రేటు అంటే ఏమిటి? చర్యా రేటును ప్రభావితంచేసే అంశాలను వివరించండి.
జ: ఏకాంక కాలంలో క్రియాజనకాల గాఢతలో తగ్గుదల లేదా క్రియాజన్యాల గాఢతలో పెరుగుదలను చర్యారేటు అంటారు. చర్యారేటు యూనిట్లు: మోల్స్ లీటరు-1 సెకన్-1.
         రేటు = 

           x P + y Q mR + nS అనే చర్యలో రేట్ల సంబంధం


          
చర్యారేటును ప్రభావితం చేసే అంశాలు:
1. క్రియాజనకాల రసాయన స్వభావం: చర్యావేగం ప్రధానంగా క్రియాజనకాల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అయానిక చర్యలు వేగంగా జరుగుతాయి.

ఉదాహరణ: ద్రావణస్థితిలో Ag+ అయాన్లు Cl- అయాన్లతో కలసి తెల్లటి అవక్షేపాన్ని వెంటనే ఇస్తాయి.
          NaCl (జ. ద్రా.) + AgNO3 (జ. ద్రా.)    AgCl + NaNO3 (జ.ద్రా.) సమయోజనీయ చర్యలు నెమ్మదిగా జరుగుతాయి. ఎందుకంటే, క్రియాజనకాల అణువుల మధ్య ప్రస్తుతం ఉన్న బంధాలు విచ్ఛిత్తి చెందాలి, క్రియాజన్యాల అణువుల మధ్య కొత్త బంధాలు ఏర్పడాలి. ఇదంతా జరగడానికి సమయం తీసుకుంటుంది. హేబర్ విధానంలో NH3  ఏర్పడటం దీనికి మంచి ఉదాహరణ.
                   N2 (వా) + 3 H2 (వా)    
 2 NH3 (వా)
2. క్రియాజనకాల గాఢత: క్రియాజనకాల గాఢత పెరిగే కొద్దీ చర్యావేగం పెరుగుతుంది. క్రియాజనకాల గాఢత పెరిగితే, అణువుల సంఖ్య, వాటి మధ్య తాడనాల సంఖ్య కూడా పెరిగి చర్యావేగం పెరుగుతుంది. ఇదే విషయాన్ని ద్రవ్యరాశి క్రియానియమం ద్వారా గుల్డ్‌బర్గ్, వాగే తెలియజేశారు. ఈ నియమం ప్రకారం చర్యారేటు, క్రియాజనకాల మోలార్ గాఢతల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
                       
 α  cn    లేదా  

  = k. cn

          k = రేటు స్థిరాంకం.
          c = క్రియాజనకాల గాఢత
          n = చర్యక్రమాంకం

3. ఉష్ణోగ్రత: ఉష్ణోగ్రత పెరిగితే చర్యావేగం కూడా పెరుగుతుంది. అర్హీనియస్ సమీకరణం ప్రకారం ప్రతి 10ºC పెరుగుదలకు చర్యావేగం రెట్టింపు అవుతుంది.
       ఉష్ణోగ్రతా గుణకం =  

       అర్హీనియస్ సమీకరణం  


         
       A = అర్హీనియస్ పౌనఃపున్య కారణాంకం
       R = వాయు స్థిరాంకం
       Ea = ఉత్తేజిత శక్తి
       k1, k2 = T1, T2 ల వద్ద రేటు స్థిరాంకాలు.
       అణుతాడన సిద్ధాంతం ప్రకారం ఉష్ణోగ్రతను పెంచితే అణువుల మధ్య తాడనాల సంఖ్య పెరుగుతుంది. ఎక్కువ అణువులు ఉత్తేజితశక్తిని పొంది చర్యారేటును వృద్ధి చేస్తాయి.

4. ఉత్ప్రేరకం ప్రభావం: చర్యలో పాల్గొనకుండా చర్యావేగాన్ని మార్చే పదార్థాన్ని ఉత్ప్రేరకం అంటారు. ధన ఉత్ప్రేరకం చర్యామార్గాన్ని మార్చి, ఉత్తేజిత శక్తి తక్కువగా ఉండే మార్గంలో చర్యావేగాన్ని పెంచుతుంది.


ఉదా: 2 KClO3

  2 KCl + 3 O2
        ఇంకా కాంతి వికిరణం, క్రియాజనకాల ఉపరితల వైశాల్యాలు కూడా చర్యారేటును ప్రభావితం చేసే అంశాలే.

4 మార్కుల ప్రశ్నలు
1. చర్య 'క్రమాంకం', 'అణుత'ల మధ్య భేదాలను తెలపండి.
జ:

2. ప్రథమ చర్యారేటు స్థిరాంకం (k), అర్ధజీవితకాలం (t1/2 ) కి మధ్య సంబంధాన్ని తెలపండి. ప్రథమ క్రమాంక చర్యారేటు స్థిరాంకం 0.693 సె-1. అయితే దీని t1/2 విలువ ఎంత?
జ: 


                
       = 1 సెకన్


3. ప్రథమ క్రమాంక చర్యకు సమాకలన సమీకరణాన్ని ఉత్పాదించండి.
జ: ప్రథమ క్రమాంక చర్యలు
చర్యారేటు సమీకరణంలో ''చర్యారేటు, ఘాతాంకం విలువ ఒకటి ఉండే క్రియాజనకాల గాఢతకు అనులోమానుపాతంలో ఉంటే ఆ చర్యను ప్రథమ క్రమాంక చర్య" అంటారు.
చర్యారేటు = k [క్రియాజనకాలు]1
R = క్రియాజనకాలు, P = క్రియాజన్యాలు.
R  
 P

రెండువైపులా సమాకలనం చేస్తే
ln R = -kt + I  
 (1)
I = సమాకలన స్థిరాంకం.
t = 0 వద్ద R = [R]0
R0 = క్రియాజనకం ప్రారంభ గాఢత
ln [R]0 = -k(0) + I

I = ln [R]0   (2)
(2)ను (1)లో ప్రతిక్షేపిస్తే

ఇక్కడ a = ప్రారంభ గాఢత
x = ఖర్చయిన క్రియాజనకం గాఢత

2 మార్కుల ప్రశ్నలు

1. కింది చర్యకు చర్యా రేటును వ్యక్తం చేయండి.
     5 Br- (జల) + BrO3- (జల) + 6 H+ (జల)  
 3 Br2 (జల) + 3 H2O (ద్రవ)

2. సున్నా క్రమాంక చర్యలకు 2 ఉదాహరణలు ఇవ్వండి.


3.  ప్రథమ క్రమాంక చర్య 99.9% పూర్తవడానికి పట్టే కాలం 50% పూర్తవడానికి పట్టే కాలానికి 10 రెట్లుంటుందని రుజువు చేయండి.

4. అర్ధాయువు 3 గంటలు ఉండే సుక్రోజ్ వియోగ చర్య (ఆమ్ల సమక్షంలో)లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఏర్పడతాయి. అయితే 8 గంటల తర్వాత వియోగం చెందకుండా మిగిలి ఉండే సుక్రోజ్ భాగమెంత?

5. ప్రథమ క్రమాంకచర్య అర్ధాయువు రేటు స్థిరాంకం 5.5 × 10-14 సె-1. అయితే చర్య అర్ధాయువు ఎంత?

6. ప్రథమ క్రమాంక చర్యలో క్రియాజనకం గాఢత 5 నిమిషాల్లో 0.6 మోల్/ లీటర్ నుంచి 0.2 మోల్/ లీటర్‌కు తగ్గింది. చర్యా రేటు స్థిరాంకాన్ని లెక్కించండి.

7. చర్య ఉష్ణోగ్రతను 298 K నుంచి 308 K కు పెంచినప్పుడు రేటు స్థిరాంకం రెండు రెట్లయింది. చర్య ఉత్తేజిత శక్తిని లెక్కించండి.

Posted Date : 20-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌