• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పరివర్తన మూలకాలు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

4 మార్కుల ప్రశ్నలు

1.  వెర్నర్ సిద్ధాంతంలోని ముఖ్య ప్రతిపాదనలను తెలపండి.
జ. వెర్నర్ సిద్ధాంతం: సంశ్లిష్ట సమ్మేళనాలు ఏర్పడే చర్యా విధానాన్ని సంతృప్తికరమైన రీతిలో వివరించటానికి వెర్నర్ ఈ సిద్ధాంతంలో కొన్ని ప్రతిపాదనలు చేశారు.
ముఖ్యమైన ప్రతిపాదనలు    
* ప్రతి సంశ్లిష్ట సమ్మేళనంలో కేంద్రక పరమాణువు లేదా అయాను ఉంటుంది.
* ఇది రెండు రకాల సంయోజకతలను ప్రదర్శిస్తుంది.
ప్రైమరీ వేలన్సీ (సంయోజకత): ఇది కేంద్రక పరమాణువు ఆక్సీకరణ స్థితికి సమానం. ఇది అయనీకరణం చెందే వేలన్సీ. దీనికి దిశ ఉండదు. దీన్ని .................. గీతతో సూచిస్తారు.
సెకండరీ వేలన్సీ:
* ఇది సంశ్లిష్ట సమ్మేళనంలోని కేంద్రక పరమాణువు కోఆర్డినేషన్ సంఖ్యకు సమానం. ఇది అయనీకరణం చెందని వేలన్సీ. దిశా లక్షణం ఉంటుంది. 

* కొన్ని సంశ్లిష్టాల్లో రుణ లైగాండ్లు ప్రైమరీ, సెకండరీ వేలన్సీలను సంతృప్తి పరుస్తాయి.

2. లాంథనైడ్ సంకోచం అంటే ఏమిటి? దాని ఫలితాలను తెలపండి.
జ: లాంథనైడ్ సంకోచం: వ్యాపించి ఉన్న f ఆర్బిటాళ్ల ఆకృతి, అతి తక్కువగా ఉండే పరిరక్షక ప్రభావం మూలంగా 14 లాంథనాయిడ్ మూలకాల్లో పరమాణు, అయానిక వ్యాసార్ధాలు క్రమేపీ తగ్గడాన్ని ''లాంథనైడ్ సంకోచం'' అంటారు.   
లాంథనైడ్ సంకోచ ఫలితాలు: 4d, 5d మూలకాలకు సన్నిహిత రసాయన ధర్మాలు ఉంటాయి.
* ఒకే స్ఫటిక నిర్మాణం, రసాయన ధర్మాలు ఉన్నందు వల్ల లాంథనైడ్ మూలకాలను వాటి మిశ్రమం నుంచి వేరుచేయడం కష్టం.      

 

3.  ప్రభావిత పరమాణు సంఖ్య (EAN) అంటే ఏమిటి? కింద ఇచ్చిన సంశ్లిష్టాల్లో కేంద్రక పరమాణు EANను లెక్కించండి.
          a) K4[Fe(CN)6]                       (b) [Co(H2O)6] (NO3]3
జ:  ''కోఆర్డినేషన్ తర్వాత కేంద్రలోహ పరమాణువు (సంశ్లిష్ట సమ్మేళనంలో)పై ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యను EAN అంటారు'' EAN (ప్రభావిత పరమాణు సంఖ్య) =  Z- లోహ పరమాణవు కోల్పోయిన ఎలక్టాన్ల సంఖ్య + లైగాండ్ల నుంచి గ్రహించిన ఎలక్టాన్ల సంఖ్య.
ఉదా:  (i)  K4 [Fe(CN)6] లో  Fe కి EAN 
             EAN  =  26 - 2 + (6 × 2)  =  24 + 12 = 36
         (ii)  [Co(H2O)6] (NO3)3   లో Co కు EAN
            EAN = 27 - 3 + (6 × 2)  =  24 + 12 = 36

2 మార్కుల ప్రశ్నలు     
1.  ఫెర్రస్ (Fe+2) లవణాలు, ఫెర్రిక్ (Fe+3) లవణాల కంటే అధిక స్థిరత్వం కలవి. వివరించండి.
జ:  Fe+2 (ఫెర్రస్) ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 4s03d6, Fe+3  (ఫెర్రిక్) ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 4s03d5 . Fe+3లో d ఉపస్థాయి ఎలక్ట్రాన్ సగం నిండటం వల్ల అధిక స్థిరత్వం వస్తుంది.

 

2. CuCl  కి రంగులేదు. CuSO4 నీలం రంగులో ఉంటుంది. ఎందువల్ల?
జ: CuCl  కి రంగు ఉండదు. CuSO4 నీలి రంగులో ఉంటుంది. CuCl లో Cu+ ఎలక్ట్రాన్ విన్యాసం 3d10
d ఉపస్థాయిలో అన్ని ఎలక్ట్రాన్లు జతకూడి ఉంటాయి. ఒంటరి 'd' ఎలక్ట్రాన్లు లేనందున CuCl కి రంగు ఉండదు. అదే CuSO4 లో అయితే Cu+2 ఎలక్ట్రాన్ విన్యాసం 3d9. అంటే ఒక జతకూడని d ఎలక్ట్రాను d-d పరివర్తనకు దారితీయడంతో CuSO4 నీలిరంగులో ఉంటుంది (ఇది పసుపు రంగును శోషించడం వల్ల).

 

3.  CuSO4.5H2O కి లేత నీలం రంగు ఉంటే ZnSO4. 7H2O కి రంగులేదు. వివరించండి.
జ:  Cu+2   =   [Ar] 4s0 3d9         
      Zn+2   =   [Ar] 4s0 3d10
Cu+2లో 3d ఉపస్థాయిలో జతకూడని ఎలక్ట్రాను ఉన్నందు వల్ల, d-d పరివర్తన చెందుతుంది. ఇది పసుపు రంగుని శోషించుకుని, నీలం రంగును వెలువరిస్తుంది. కాబట్టి CuSO4.5H2O నీలం రంగులో ఉంటుంది. అదే Zn+2 లో 3d ఉపస్థాయిలో ఎలక్ట్రాన్లన్నీ జతగా ఉంటాయి. అందువల ZnSO4. 7H2O కు రంగు ఉండదు.

4.  (a) CoCl3. 5 NH3   (b) CoCl3. 6NH3 ద్రావణాలకు AgNO3 ని కలిపితే ఎన్ని మోల్‌ల AgCl వస్తుంది? 
జ:     (a)  [Co(NH3)5 Cl] Cl2 లో 2 Cl-  లు ఉండటం వల్ల 2 మోల్ ల AgCl వస్తుంది.
         (b)  [Co(NH3)6] Cl3 లో 3Cl- లు ఉండటం వల్ల  3 మోల్ ల AgCl వస్తుంది.

 

5.  CuSO4 పారా అయస్కాంత పదార్థం. ZnSO4  డయా అయస్కాంత పదార్థం. ఎందువల్ల?
జ:   Cu+2 = [Ar] 4 s0 3d9                      Zn+2 = [Ar] 4s0 3d10
   Cu+2 లోని 3d ఉపస్థాయిలో ఒక జతకూడని ఎలక్ట్రాను, CuSO4 ను అయస్కాంత క్షేత్రం వైపు ఆకర్షించేలా చేస్తుంది. కాబట్టి CuSO4 పారా అయస్కాంత పదార్థం. అదే Zn+2 లో అన్ని ఎలక్ట్రాన్లు జత కూడినవి. ZnSO4 ను అయస్కాంత క్షేత్రం వికర్షిస్తుంది. కాబట్టి ఇది డయా అయాస్కాంత పదార్థం.

 

6.   (a) నైక్రోమ్   (b)  ఇత్తడి మిశ్రమ లోహాల సంఘటనాన్ని తెలపండి.
జ:   (a)   నైక్రోమ్:  Ni (60%),    Fe (25%),    Cr (15%).
       (b)   ఇత్తడి:   Cu (60-80%),    Zn (20-40%).

Posted Date : 04-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌