• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పాలిమర్‌లు  

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

2 మార్కుల ప్రశ్నలు


1. PHBV అంటే ఏమిటి? అది మనిషికి ఎలా ఉపయోగపడుతుంది?
జ: PHBV అంటే పాలీ β- హైడ్రాక్సీ బ్యుటరేట్-కో- β- హైడ్రాక్సీ వేలరేట్. ఇది 3- హైడ్రాక్సీ బ్యుటనోయిక్ ఆమ్లం, 3 - హైడ్రాక్సీ పెంటనోయిక్ ఆమ్లాలు సంఘననం చెందితే ఏర్పడిన కో పాలిపార్. జీవక్షయీకృతమయ్యే ఈ పాలిమర్‌ను మందు గొట్టాలు, ఆర్థోపెడిక్ పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. 

2. కింది పాలిమర్ల తయారీలో ఉపయోగించిన మానోమర్లను తెలపండి?
    (a) బేకలైట్         (b) టెర్లీన్           (c) నైలాన్ 6, 6         (d) నియోప్రీన్
జ: (a) బేకలైట్: ఫీనాల్ & ఫార్మాల్డిహైడ్ 
     (b) టెర్లిన్: టెరీఫ్తాలిక్ ఆమ్లం & ఇథలీన్ గ్లైకాల్
     (c) నైలాన్ 6, 6: ఎడిపిక్ ఆమ్లం & హెక్సా మిథలీన్ డై ఎమైన్
     (d) నియోప్రీన్: 2-క్లోరో, 1, 3-బ్యుటా డైఈన్

 

3. ''వల్కనైజేషన్'' అంటే ఏమిటి?
జ: భౌతిక లక్షణాలను మెరుగుపరచడానికి సహజ రబ్బరుకు సల్ఫర్‌ను కలిపి 373 - 415 K ఉష్ణోగ్రత వరకు వేడిచేసే ప్రక్రియ.

4. ''జీవ క్షయీకృతమయ్యే పాలిమర్'' అంటే ఏమిటి?
జ: జీవ వ్యవస్థల్లో ఎంజైమ్‌లతో ఆక్సీకరణం లేదా జలవిశ్లేషణం చెంది తేలిగ్గా క్షయం చెందే పాలిమర్.
 ఉదా: PHBV, పాలీగ్లైకోలిక్ ఆమ్లం

 

5. ''పాలీ విక్షేపణత సూచిక'' అంటే ఏమిటి?
జ: ఒక పాలిమర్ సగటు భార అణుభారం  
, సగటు సంఖ్య అణుభారాల   నిష్పత్తి.
P.D.I. (పాలీ విక్షేపణత సూచిక) =  


 

6. 'ఎలాస్టోమర్' అంటే ఏమిటి?
జ: బాహ్యబలాన్ని ఉపయోగించినప్పుడు సాగే గుణాన్ని కలిగి, ఆ బలాన్ని తొలగించినప్పుడు పూర్వపు ఆకారం, పరిమాణాన్ని పొందగల పాలిమర్.

ఉదా: బ్యునా - S, బ్యునా - N, నియోప్రీన్.
 

7. కింద తెలిపిన పాలిమర్లు ఏర్పడటంలో ఏ రకం పొలిమరీకరణం జరిగిందో తెలపండి? 
        (a) బేకలైట్               (b) పాలీ వినైల్ క్లోరైడ్                 (c) పాలిథీన్           (d)  టెర్లీన్ 
జ: (a) సంఘనన 
     (b) సంకలన 
     (c) సంకలన 
     (d) సంఘనన 

8. కింద తెలిపిన పాలిమర్లలో ఉండే మోనోమర్లను, వాటి నిర్మాణాలను తెలపండి.
     a) నైలాన్ 6, 6                                              b) బేకలైట్
జ: a) నైలాన్ 6, 6


      
    b) బేకలైట్:

9. ఒక పాలిమర్‌లో 10,000 అణుద్రవ్యరాశి ఉండే అణువులు 10; 1,00,000 అణుద్రవ్యరాశి ఉండే అణువులు 10 ఉన్నాయి. అయితే ఆ పాలిమర్ సగటు సంఖ్య అణుద్రవ్యరాశి (

), సగటు భార అణుద్రవ్యరాశి () లెక్కించండి.
జ:


         
 

10. బ్యూనా - N, బ్యూనా - S మధ్య భేదాన్ని తెలపండి.
జ: బ్యునా - N: 1, 3 బ్యుటా డైఈన్, ఎక్రైలో నైట్రైల్‌తో ఏర్పడిన సహ బృహదణువు (కో పాలిమర్).
     బ్యునా - S: 1, 3 బ్యుటా డైఈన్, స్టైరీన్‌లతో ఏర్పడిన సహ బృహదణువు (కో పాలిమర్).

 

11. జీగ్లర్ - నట్టా ఉత్ప్రేరకం అంటే ఏమిటి? దీని ఉపయోగం ఏమిటి?
జ: TiCl4 (టైటానియం టెట్రాక్లోరైడ్) + Al(C2H5)3 (ట్రై మిథైల్ అల్యూమినియం)ను 'జీగ్లర్ - నట్టా ఉత్ప్రేరకం' అంటారు. ఈ ఉత్ప్రేరకం సమక్షంలో ఈథీన్‌ని పొలిమరీకరణం చేసి 'అధిక సాంద్రత పాలిథీన్‌'ని తయారు చేస్తారు.

12. 'పాలిమర్లు' అంటే ఏమిటి? 'పొలిమరీకరణం' గురించి తెలపండి.
జ: అధిక అణుద్రవ్యరాశి ఉండే పెద్ద అణువులను 'పాలిమర్లు' అంటారు. మానోమర్ల నుంచి పాలిమర్‌ను తయారుచేసే ప్రక్రియనే 'పొలిమరీకరణం' అంటారు.
పొలిమరీకరణం


     
 

13. 'సజాతీయ పాలిమర్లు' (Homopolymers) అంటే ఏమిటి?
జ: ఒకే జాతి మోనోమర్లు పొలిమరీకరణం చెందగా ఏర్పడే పాలిమర్లను 'సజాతీయ పాలిమర్లు' అంటారు.


     
 

14. 'సహ పాలిమర్లు' (Copolymers) అంటే ఏమిటి?
జ: రెండు లేదా అంతకంటే ఎక్కువ జాతుల మోనోమర్లు పొలిమరీకరణం చెందగా ఏర్పడే పాలిమర్లను 'సహ పాలిమర్లు' అంటారు.

    ఉదా: నైలాన్ 6, 6 (మోనోమర్లు: ఎడిపిక్ ఆమ్లం, హెక్సా మిథలీన్ డై ఎమైన్).
 

15. 'థర్మో ప్లాస్టిక్‌లు' అంటే ఏమిటి?
జ: సంకలన లేదా సంఘనన పొలిమరీకరణంలో ఏర్పడే రేఖీయ నిర్మాణం ఉండే పాలిమర్లను 'థర్మో ప్లాస్టిక్‌లు' అంటారు. ఇవి వేడి చేసినప్పుడు మెత్తబడి, చల్లార్చినపుడు యథావిధిగా గట్టిపడతాయి.
    ఉదా: P.V.C., పాలిథీన్, పాలీ స్టైరీన్.

 

16. 'ఉష్ణ దృఢ పాలిమర్లు' అంటే ఏమిటి?
జ: సంఘనన పొలిమరీకరణంలో వ్యత్యస్థ బంధాలు లేదా అత్యధిక శాఖాయుత అణువుల మధ్య బంధాల మూలంగా ఏర్పడే పాలిమర్లను 'ఉష్ణ దృఢ పాలిమర్లు' అంటారు.
    ఉదా: యూరియా - ఫార్మాల్డిహైడ్ రెజీన్‌లు, బేకలైట్.

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌