• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కర్బన రసాయనశాస్త్రం 

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

1. మొలాసిస్ నుంచి ఇథైల్ ఆల్కహాల్‌ను తయారు చేసే విధానాన్ని రాయండి. ఇథైల్ ఆల్కహాల్ కిందివాటితో చర్య జరిపి ఏర్పరిచే ఉత్పన్నాలను తెలపండి.
             i) CH3MgI                 ii) CH3COOH
             iii) Na                         iv) H2SO4, 140ºC
జ: చెరకు రసం నుంచి చక్కెరను స్ఫటికీకరణం చేశాక మిగిలిన ద్రావణం మొలాసిస్ నుంచి ఇథైల్ ఆల్కహాల్‌ను తయారు చేస్తారు. మొలాసిస్‌లో 30-40 శాతం సుక్రోజ్ ఉంటుంది. దీన్ని 10% సుక్రోజ్ వచ్చేవరకూ నీటితో విలీనం చేస్తారు. pH నాలుగు ఉండేలా ద్రావణానికి H2SO4 ను కలుపుతారు. ఈస్ట్‌కి ఆహారంగా అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం ఫాస్ఫేట్‌లను కలుపుతారు. ఈ ద్రావణాన్ని కిణ్వప్రక్రియ జరగడానికి 1-3 రోజులపాటు 30ºC వద్ద అలాగే ఉంచుతారు.
ఈ ప్రక్రియలో జరిగే చర్యలు:


        

     వాష్‌ని ముందుగా అంశిక స్వేదనం, తర్వాత CaOతో స్వేదనం చేస్తే 100% ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది.


1) ఇది గ్రిగ్‌నార్డ్ కారకంతో చర్య జరిపి ఆల్కేన్‌ని ఇస్తుంది. 


      
2) ఇది CH3COOH తో చర్య జరిపి ఎస్టర్‌ను ఇస్తుంది.


      
3) ఇది Na తో చర్య జరిపి సోడియం ఇథాక్సైడ్ ను ఇస్తుంది.


       
4) ఇది 140ºC వద్ద గాఢ H2SO4 తో చర్య జరిపి డై ఇథైల్ ఈథర్‌ను ఏర్పరుస్తుంది.

     

2. ఎనిలిన్‌ను తయారుచేసే రెండు పద్ధతులు రాయండి. ఎనిలిన్ కిందివాటితో ఎలా చర్య జరుపుతుందో, సమీకరణాలతో వివరించండి.
        i) HCl                                               ii) CH3COCl
      iii) CHCl3 + ఆల్కహాలిక్ KOH                iv) NaNO2 + HCl
జ: నైట్రోబెంజిన్ నుంచి తయారు చేయడం: నైట్రోబెంజిన్‌ను ఆమ్లయానకంలో క్షయకరణం చేస్తే ఎనిలిన్ ఏర్పడుతుంది.


      
ఫినాల్ నుంచి తయారు చేయడం:
300ºC వద్ద ఫినాల్‌ను NH3 తో వేడిచేస్తే ఎనిలిన్ ఏర్పడుతుంది.


     
i) ఇది HCl తో ఎనిలీనియం క్లోరైడ్‌ను ఇస్తుంది.
            C6H5 NH2 + HCl  
 C6H5 N+H3Cl-
ii) ఇది CH3COCl తో చర్య జరిపి ఎసిటానిలైడ్‌ను ఏర్పరుస్తుంది.


        

iii) కార్బైల్ ఎమైన్ చర్య: ఎనిలిన్, క్లోరోఫామ్, ఆల్కహాలిక్ KOH లతో చర్య జరిపి దుర్గంధభరిత కార్బైల్ ఎమైన్‌ను ఇస్తుంది.
      C6H5 NH2 + CHCl3 + 3 alc. KOH 

                                            C6H5NC + 3 KCl + 3H2O
i) డయజొటీకరణం: ఎనిలిన్, 0-5ºC వద్ద HNO2 తో చర్య జరిపి బెంజిన్ డయజోనియం క్లోరైడ్‌ను ఏర్పరుస్తుంది.
     C6H5 NH2 + NaNO2 + 2 HCl  

                                      C6H5 N2Cl + 2 H2O + NaCl

3. ప్రయోగశాలలో నైట్రో బెంజిన్‌ను తయారు చేసే పద్ధతిని రాయండి. నైట్రో బెంజిన్ (ఎ) ఆమ్లయానకంలో (బి) క్షారయానకంలో (సి) తటస్థయానకంలో చర్య జరిపి ఇచ్చే ఉత్పన్నాలను తెలపండి.
జ: 60ºC కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద బెంజిన్‌ను నైట్రోకరణం చేస్తే నైట్రో బెంజిన్ వస్తుంది.


         
చర్యలు: ఎ) ఆమ్లయానకంలో నైట్రోబెంజిన్ క్షయకరణం చెంది ఎనిలిన్‌ను ఏర్పరుస్తుంది.


                 

బి) క్షారయానకంలో (Zn, ఆల్కహాలిక్ KOH) నైట్రో బెంజిన్ క్షయకరణం చెంది హైడ్రజోబెంజిన్‌ను ఇస్తుంది. 


        
సి) తటస్థ యానకంలో  (Zn, NH4Cl) నైట్రో బెంజిన్ క్షయకరణం చెంది ఫినైల్ హైడ్రాక్సిల్ ఎమైన్ ను ఇస్తుంది.


             
 

4. H-V-Z(హెల్- వోలార్డ్ - జెనెన్‌స్కీ) చర్య అంటే ఏమిటి?
జ: ఎసిటికామ్లంలోని 3 ఆల్ఫా H లు Cl2 తో ఫాస్ఫరస్ సమక్షంలో చర్య జరిపి వరుసగా మోనో, డై, ట్రై క్లోరో ఎసిటికామ్లాలను ఇస్తాయి.


           

5. రైమర్ - టీమన్ చర్య అంటే ఏమిటి?

జ: 65ºC వద్ద ఫీనోల్ NaOH, క్లోరోఫారమ్‌లతో చర్య జరిపి సాలిసిలాల్డిహైడ్‌ను ఇస్తుంది.


          
6. విలియంసన్ సంశ్లేషణ అంటే ఏమిటి?
జ: C2H5Cl, సోడియం ఇథాక్సైడ్‌తో చర్య జరిపి డై ఇథైల్ ఈథర్‌నిస్తుంది.


        
 

7. క్లోరోపిక్రిన్ అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడుతుంది?
జ: క్లోరోఫారమ్, నైట్రిక్ ఆమ్ల బాష్పంతో చర్య జరిపి క్లోరో పిక్రిన్‌ను ఏర్పరుస్తుంది.

     

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌