• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జ‌న్యుశాస్త్రం  

1. సంకరణ ప్రయోగాల కోసం మెండల్‌ బటానీ మొక్కను ఎంచుకోవడంలో ఉన్న ప్రయోజనాలను తెలపండి. 

జ: * ఇది స్పష్టమైన లక్షణాలను కలిగి ఉన్న ఏక వార్షిక మొక్క.

* దీన్ని పెంచడం, సంకరణ చేయడం సులభం.

* ఇందులో పురుష, స్త్రీ భాగాలు కలిగిన ద్విలింగ పుష్పాలుంటాయి.

* దీనిలో స్వయం ఫలదీకరణ జరపడం సులభం.

* దీని జీవితకాలం చిన్నది, సంతతులు ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి.

2. పరీక్షా సంకరణాన్ని నిర్వచించి పట్టిక ద్వారా తెలపండి.

జ: విషమయుగ్మజ స్థితిలో ఉన్న F1 సంతతిని వాటి సమయుగ్మజ అంతర్గత స్థితిలో ఉన్న జనకంతో జరిపే సంకరణాన్ని పరీక్షా సంకరణం అంటారు. దీని ద్వారా జీవి సమ యుగ్మజంలో లేదా విషమయుగ్మజంలో ఉందో తెలుసుకోవచ్చు.

3. క్రోమోజోమ్, జన్యు/ బిందు ఉత్పరివర్తనాలను క్లుప్తంగా వివరించండి.

జ: a)  క్రోమోజోమ్‌ ఉత్పరివర్తనాలు: క్రోమోజోమ్‌ల సంఖ్యలో లేదా నిర్మాణంలో వచ్చే మార్పులను క్రోమోజోమ్‌ ఉత్పరివర్తనాలు అంటారు. ఇవి నిర్మాణాత్మక మార్పులు.

      b) బిందు ఉత్పరివర్తనాలు: దీవితి లోని ఒక జత క్షారాల్లో కలిగే మార్పులను బిందు ఉత్పరివర్తనాలు అంటారు. 

4. అసంపూర్ణ బహిర్గతత్వాన్ని ఉదాహరణతో వివరించండి.

జ: అసంపూర్ణ బహిర్గతత్వం: జన్యువులోని ఒక యుగ్మ వికల్పం సంపూర్ణంగా మరో యుగ్మవికల్పంపై బహిర్గతం కాకుండా ఉంటుంది. దీనివల్ల విషమయుగ్మజ మొక్క దృశ్యరూపం బహిర్గత, అంతర్గత సమయుగ్మజ జనకాలను పోలి ఉండకుండా మధ్యస్థంగా ఉంటుంది. ఉదా: శుద్ధ సమయుగ్మజ ఎరుపు పుష్పాలు ఉన్న మొక్కను ్బళిళ్శి, శుద్ధ సమయుగ్మజ తెలుపు పుష్పాలు ఉన్న మొక్కతో (RR) సంకరణం జరిపినపుడు F1తరంలో పింక్‌ పుష్పాలు ఉన్న మొక్కలు (Rr) ఏర్పడతాయి.  F1 మొక్కలతో స్వపరాగసంపర్కం జరిపితే F2తరంలో మొక్కలు ఒక ఎరుపు (RR), రెండు పింక్‌ (Rr), ఒక తెలుపు (rr) పుష్పాలు ఉన్న మొక్కలు 1 : 2 : 1 నిష్పత్తిలో ఏర్పడతాయి.

5. పృథక్కరణ సిద్ధాంతం, స్వతంత్ర వ్యూహన సిద్ధాంతాలను నిర్వచించండి.

జ: పృథక్కరణ సిద్ధాంతం: ఒక జన్యువు రెండు యుగ్మవికల్పాలు కలిసి విషమయుగ్మజ స్థితిలో ఉన్నప్పుడు అవి ఎప్పుడూ కలిసిపోవు లేదా మిళితం చెందవు. అవి క్షయకరణం చెందినపుడు లేదా సంయోగబీజాలు ఏర్పడేటప్పుడు పృథక్కరణ చెందుతాయి. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం: ఒక సంకరణంలో రెండు జతల లక్షణాలు కలిసి ఉన్నప్పుడు ఒక జత లక్షణాలు మరో జత లక్షణాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పృథక్కరణ చెందుతాయి. వాటిని ఆపుదల కోడాన్‌లు అంటారు.

6. జన్యుసంకేతం లక్షణాలను తెలపండి.

జ: జన్యుసంకేతం నిస్సందేహమైంది, విశిష్టమైంది. అంటే ప్రతి త్రికం ఒక నిర్దిష్టమైన అమైనో ఆమ్లానికి త్రిక సంకేతంగా పని చేస్తుంది. కొన్ని ఆమైనో ఆమ్లాలను ఒకటి కంటే ఎక్కువ సంకేతాలతో సూచిస్తారు. దీన్నే డీ జనరేట్‌ కోడ్‌ అంటారు.

* జన్యుసంకేతం కామాలేని సంకేతావళి. అంటే రెండు కోడాన్‌ల మధ్య కామా చిహ్నాలు ఉండవు.

* జన్యుసంకేతం సార్వత్రికమైంది. ఉదా: బ్యాక్టీరియమ్‌ల నుంచి మనుషుల వరకు  UUU అనే త్రికం, ఫినైల్‌ అలనిన్‌కు సంకేతంగా వ్యవహరిస్తుంది

* జన్యు నిఘంటువులో ' AUG '  ప్రారంభ త్రికంగా, ఇదే త్రికం మిథీయోనైన్‌కు త్రిక సంకేతంగా పనిచేస్తుంది. అంటే ' AUG ' ద్వంద్వ ప్రక్రియలను నిర్వహిస్తుంది

Posted Date : 14-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌