• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌ పూర్తయితే ఇదిగో ఆర్మీ ఉద్యోగం!

టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రీ ప్రకటన విడుదల 

ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారిని టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లోకి ఇండియన్‌ ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈ విధానంలో ఎంపికైనవారికి స్టైపెండ్‌తో కూడిన శిక్షణ అందిస్తారు. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ప్రకటనకు సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం... 

అవివాహిత పురుషులు టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు అర్హులు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను బీటెక్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టు చేస్తారు. వీరికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో బెంగళూరులో అయిదు రోజులుపాటు రెండు దశల్లో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తొలిరోజు స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ (ఇంటలిజెన్స్‌) పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారిని స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని శిక్షణకు తీసుకుంటారు.

శిక్షణ

కోర్సులోకి ఎంపికైనవారికి ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, దేహ్రాదూన్‌లో జులై, 2022 నుంచి 49 వారాలపాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెల రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్‌ హోదాతో శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరినవారు తొలి నెల నుంచే సుమారు రూ.లక్ష వేతనం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయి హోదాలు సొంతం చేసుకోవచ్చు.  

ఖాళీలు: 40

విభాగాలవారీ సివిల్‌/ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ 9, ఆర్కిటెక్చర్‌ 1, మెకానికల్‌ 5, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ 3, కంప్యూటర్‌ సైన్స్‌ 8, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 3, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ 1, టెలికమ్యూనికేషన్‌ 1, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 2, ఏరోనాటికల్‌/ ఏరోస్పేస్‌/ ఏవియానిక్స్‌ 1, ఎలక్ట్రానిక్స్‌ 1, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 1, ప్రొడక్షన్‌ 1, ఇండస్ట్రియల్‌ 1, ఆప్టో ఎలక్ట్రానిక్స్‌ 1, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ 1.

అర్హత: నిర్దేశిత/అనుబంధ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌ పోస్టులకు ఎమ్మెస్సీ సీఎస్, ఎంసీఏ వారికీ అవకాశం ఉంది.   

వయసు: జులై 1, 2022 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. (జులై 2, 1995; జులై 1, 2002 మధ్య జన్మించాలి.)

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 4 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/Authentication.aspx
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భౌతికశాస్త్రంలో భళా!

‣ కొత్త సిలబస్‌తో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ - 2023

‣ ఫ్యాషన్‌ ప్రపంచంలోకి.. స్వాగతం!

‣ ఇంజినీరింగ్‌తో పాటు.. ఇవి నేర్చుకోవాలి!

‣ ప్రిపరేషన్‌కు కొన్ని పద్ధతులు!

Posted Date : 21-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌