• facebook
  • whatsapp
  • telegram

వ్యాక‌ర‌ణంలో ప్ర‌శ్న‌ల‌తీరు

అతి ముఖ్యం.. వ్యాకరణం
కంటెంట్‌లో సాహిత్యం తరువాత వ్యాకరణం అతి ముఖ్యమైనది. సంధులు, సమాసాలు, ఛందస్సు, వ్యాకరణం, అలంకారాలు, ప్రకృతి- వికృతులు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యాకరణ పరిభాష అనేవి క్షుణ్ణంగా చదవాల్సినవే. అందరూ లోగడ వీటిని చదివినవారే. అయితే అప్పుడు చదివే పద్ధతీ, ప్రశ్నలు అడిగే పద్ధతీ వేరు. ఇప్పుడు 'ఆబ్జెక్టివ్‌ పద్ధతి' కాబట్టి నిశితంగా చర్చించుకుంటూ అధ్యయనం చేయాలి. వ్యాకరణానికి అధ్యయనం ఒక్కటే చాలదు. గణిత శాస్త్రంలా అభ్యాసం చాలా ముఖ్యం. 'అభ్యాసం కూసు విద్య' అన్నారు కదా!

ఇక ప్రశ్నలడిగే పద్ధతి చూడండి
* స్వాగతం విడదీయండి
1. స్వ+ ఆగతం  2. స+వాగతము  3. సుః+ఆగతం  4. సు+ఆగతం
జవాబు: (4)
* గోరంతలు కొండంతలుగా చెప్పడాన్ని ఏ అలంకారమంటారు?

 

2. అతిశయోక్తి  2. శ్లేష  3. విశేషోక్తి  4. ఉత్ప్రేక్ష
జవాబు: (1)
* పద్మమునకు పర్యాయపదం?

 

3. అంబుజం  2. పంకజం  3. రెండూ  4. రెండూ కావు
జవాబు: (3)
ఈ విధంగా తిరగేసి కొన్ని, అయినది అంటూ కొన్ని, కానిదంటూ మరికొన్ని ప్రశ్నలు వస్తాయి. అందువల్ల వ్యాకరణం అంతా చదవాలి తప్ప ముఖ్యమైనవి అనే ఆలోచన ఉండకూడదు.
అనువాదం ఆంగ్లం నుంచి తెలుగులోకి గానీ, తెలుగు నుంచి ఆంగ్లానికి గానీ అడగవచ్చు. అనువాద పద్ధతుల గురించి స్థూలంగా తెలుసుకోవాలి. కొన్ని పదాలను ఇచ్చి అనువదించమని అడుగుతారని అనుకుని దానికి అనుగుణంగా నేర్చుకోవాలి.
'పఠనావగాహనం' అనేది కంటెంట్‌లో చివరి భాగం. ఒక పేరా వచనభాగం ఇచ్చి- కిందగల నాలుగైదు ప్రశ్నలకు పై వచనంలోగల సరైన సమాధానాన్ని గుర్తించడం. ఇది సరిగా చదివితే చాలా తేలిక.
ఆబ్జెక్టివ్‌ విధానపు పరీక్షలో ఛాయిస్‌ అనేది ఉండదని గ్రహించాలి. ఇప్పటివరకూ చదివినది డిగ్రీ కోసం మాత్రమే. ఇప్పుడు ఉద్యోగం కోసం, స్థిరజీవితం కోసం చదువుతున్నామనే లక్ష్యం అవసరం.

Posted Date : 11-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌