• facebook
  • whatsapp
  • telegram

భాషాభాగాలపై సాధిద్దాం పట్టు!

ఏ భాషకైనా భాషాభాగాలు (parts of speech) కీలకమైనవి. టెట్‌-టీఆర్‌టీకి సంబంధించి ఇంగ్లిష్‌లో ఈ భాగాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలి.

ఇంగ్లిష్‌ భాషలో ఇప్పుడు మొత్తం పదాల సంఖ్య పది లక్షలు దాటింది. ఈ పదాలన్నింటినీ Nouns, Pronouns, Adjectives, Verbs, Adverbs, Prepositions, Conjunctions, Interjections అని 8 భాషాభాగాలుగా విభజించవచ్చు. వాటి స్వరూప స్వభావాలను తెలుసుకుంటే ఇంగ్లిష్‌ నేర్చుకోవడం, వాడడం తేలికవుతుంది. పరీక్షల్లో మార్కులూ తెచ్చుకోవచ్చు.

Nouns

మనుషుల, వస్తువుల, స్థలాల, గుణాల, భావాల, ఆలోచనల పేర్లను Nouns అంటారు. గ్రామర్‌లో పేరు ఏదైనా Noun అవుతుంది. వీటిని Proper nouns, Common nouns, Material nouns, Collective nouns, Abstract nouns అని అయిదు రకాలుగా వర్గీకరిస్తారు.

* వాక్యంలో Proper nouns ఎక్కడ వచ్చినా వాటి మొదటి అక్షరాన్ని కాపిటల్‌ లెటర్‌తో రాయాలి.

* Common nouns కు పేర్లు వాడితే అవి Proper nounsగా మారతాయి.

* Material nouns (విడివిడి వస్తువులుగా కాకుండా కుప్పగానో ముద్దగానో పోగుగానో ద్రవ/ వాయు రూపంలోనో ఉండే పదార్థాలు)కు బహువచనం ఉండదు. వీటి తరువాత singular verbనే వాడాలి.

* Collective nouns తర్వాత సందర్భాన్ని బట్టి Singular verb/ plural verb వాడొచ్చు.

* భౌతికమైన ఉనికి లేకపోవడం వల్ల చూడలేని, తాకలేని గుణాల, స్థితుల, ఆలోచనల, భావావేశాల పేర్లు Abstract nouns.

* ఈ అయిదు రకాల nounsను count nouns, uncount అని రెండు రకాలుగా విభజిస్తారు.

* ఒక nounకు ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉన్నపుడు అది ఒక అర్థంలో count noun, మరో అర్థంలో uncount noun కావొచ్చు.

ఉదా: acquaintance- పరిచయం అనే అర్థంలో uncount noun, పరిచయస్తుడు అనే అర్థంలో count noun. అవుతుంది.

* ఇంగ్లిష్‌ భాషలో ఏకవచనంలో ఉన్న ప్రతి count noun ముందు సందర్భానుసారంగా ఒక determinerను తప్పనిసరిగా వాడాలి. He is student అనకూడదు. He is a student/ He is some student/ He is my student అనొచ్చు.

Pronouns

Nouns¹ బదులుగా వాడే I, me లాంటి పదాలు Pronouns. ఇవి తొమ్మిది రకాలు.

* mine, ours, yours, hers, theirsలను Possessive pronouns అంటారు. వీటిని nouns ముందు వాడకూడదు. yours carఅని కాకుండా your car అనీ, ours school బదులు our school అనీ వాడాలి.

* Reflexive/ Emphatic pronouns: myself, ourselves, yourself, yourselves, himself, herself, itself, themselvesలను subject pronouns/ nounsను నొక్కి చెప్పడానికి వాడినపుడు emphatic pronouns అంటారు.

ఉదా: I myself saw it first/ I saw it first myself.

ఒక వాక్యంలోని subject, object- రెండూ ఒకే వ్యక్తిని సూచిస్తే objectగా self pronoun వస్తుంది. ఇలా వాడే self pronouns Reflexive pronouns.

She blamed herself

He is looking at himself

* ప్రస్తావించే విషయం ఓ గ్రూపులోని వ్యక్తులందరికీ/ వస్తువులన్నింటికీ కలిపి కాకుండా విడిగా ఒక్కొక్కరికీ/ ఒక్కోదానికి వర్తించేటట్లుగా చెప్పడానికి వాడే each, either, neither, any లాంటి pronounsను Distributive pronouns అంటారు. వీటి తరువాత singular verb రావాలి.

ఉదా: Each of them is excellent.

* ఒకరినొకరు/ ఒకరికొకరు అనే అర్థాన్ని కలిగి ఉండే each other, one anotherలను Reciprocal pronouns అంటారు. ఇద్దరే ఉన్నపుడు each otherనూ, ఇద్దరికంటే ఎక్కువ ఉన్నపుడు one anotherనూ వాడతారు.

ఉదా: Gopi and Devi love each other.

The four girls helped one another.

Adjectives

Nouns/ pronounsను వర్ణించే పదాలైన Adjectives సాధారణంగా nouns ముందుగానీ link verbs తరువాత గానీ వస్తాయి.

ఉదా: He is a clever boy.

The boy is clever.

Order of Adjectives: OP SH A C O M సూత్రం. ఒక noun ముందు ఒకటికన్నా ఎక్కువ adjectives వాడాలంటే Opinion, Shape, Age, Colour, Origin, Materialను సూచించే adjectivesను అదే వరస క్రమంలో వాడాలి. 

* అతి తక్కువ సంఖ్యలో ఉండే designate, elect, incarnate లాంటి adjectives ను nouns ముందు కాకుండా nouns తరువాత వాడాలి. ఉదా: Now he is the president elect. తక్కువ సంఖ్యలో ఉండే concerned, involved, responsible లాంటి adjectivesను అర్థభేదంతో nouns ముందుగానీ తరువాత గానీ వాడొచ్చు.

ఉదా: The concerned teacher = విచారగ్రస్తుడైన ఉపాధ్యాయుడు, The teacher concerned = సంబంధిత ఉపాధ్యాయుడు.

* deadly, lively, lonely, lovely, manly, homely లాంటి పదాల spellingsలో -ly ఉన్నప్పటికీ అవి adverbs కావు. వీటిని nounsను వర్ణించడానికి వాడతారు కాబట్టి adjectivesగా పరిగణించాలి.

ఉదా: a deadly curve, a lively class

Verbs

క్రియలను verbs అంటారు. ఇంగ్లిష్‌ క్రియలు Auxiliary verbs, Main verbs అని రెండు రకాలు. Auxilary verbsనుHelping verbs అని కూడా అంటారు. Auxiliary verbsలో Primary auxiliary verbs, ('be' forms 'do' forms 'have' forms), Modal auxiliary verbs (shall, should, ought to, will, would, can, could, may, might, must) అని రెండు రకాలు.

Tenses ఏర్పరచడానికీ, negativesను తయారుచేయడానికీ, questions నిర్మించడానికీ auxiliary verbsను వాడతారు. వీటికి పెద్దగా అర్థం ఉండదు. Verb phraseలో ప్రధానంగా అర్థాన్ని సూచించే go లాంటి పదాన్ని Main verb అంటారు.

కొన్ని verbs తరువాత objectరాదు. objectవచ్చే verbsను Transitive verbs అనీ, objectరాని verbsనుIntransitive verbs అనీ అంటారు. Intransitive verbsను Passive voiceలో వాడకూడదు.

Adverbs

Verbs, Adjectives/ఇతర Adverbsను వర్ణించడానికి వాడే పదాలను Adverbs అంటారు. Verbsను వర్ణించడానికి వాడే adverbsసందర్భాన్ని బట్టి వాక్య ప్రారంభంలోగానీ, verbsకి ముందుగానీ తరువాత గానీ రావచ్చు.

ఉదా: Slowly, he opened his eyes.

I really enjoyed the party. Ravi went abroad.

* Normal order of Adverbs: Manner, Place, Time (MPT)

He married her secretly here yesterday (Manner Place Time)

Prepositions

ఒక noun/ pronounకి వేరే పదంతో సంబంధాన్ని ఏర్పరచడానికి వాడే at, in లాంటి పదాలు ఇవి. చాలా సందర్భాల్లో prepositionsవాడడం అర్థాన్ని బట్టి ఉండదు. ఫలానా పదం ముందు ఫలానా Preposition రావాలి, ఫలానా పదం తరువాత ఫలానా preposition రావాలి- అనే నియమాలున్నాయి.

* క్యాంపస్‌లో అనడానికి on the campusనూ, సిరాతో అనడానికి in inkనూ, కారులో అనడానికి by carనూ వాడాలి.

* 'అతనికి ఇంగ్లిష్‌లో మంచి పట్టు ఉంది' అని చెప్పడానికి He has a good command of English అనాలి. Command తరువాత over రాకూడదు, of రావాలి. 

Posted Date : 11-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌