• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకు పరీక్షలకు సబ్జెక్టుల వారీగా ముఖ్యమైన టాపిక్స్

అందరికీ అదే సిలబస్. అందరిదీ అదే శ్రమ. మరి కొందరే ఎందుకు విజేతలుగా నిలుస్తున్నారు? ఎందుకంటే... ఏది ముఖ్యం? ఏది కాదు? అని తెలుసుకొని, తేల్చుకొని తెలివిగా ప్రిపరేషన్ సాగిస్తారు కాబట్టి విజయం వారినే వరిస్తుంది. అందుకే ఏ పరీక్షకు హాజరవుతున్నా ముందుగా సిలబస్ ను పూర్తిగా అధ్యయనం చేయాలి. అంతా కంఠస్థం చేయగలిగినంతగా పాఠ్యప్రణాళికను పరిశీలించాలి. అనుకున్న సమయంలో పూర్తి చేయగలగడానికి వీలైన ప్రిపరేషన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలి. 

బ్యాంక్ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక సిలబస్ అంటూ ఏదీ ఉండదు. కొన్ని ముఖ్యమైన  టాపిక్స్ ఉంటాయి. వాటిని తప్పనిసరిగా చదివి, ప్రాక్టీస్ చేయాలి. వెయిటేజీ ప్రకారం టాపిక్స్‌ను విభజించుకుని ఏ టాపిక్‌కు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? ఎక్కువగా వేటిని సాధన చేయాలో అంచనా వేసుకోవాలి. టాపిక్స్ అన్నింటినీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తరవాత ప్రశ్నలను వివిధ స్థాయుల్లో సాధన చేయాలి (కఠిన స్థాయి నుంచి సులభ స్థాయి). అలాగే గత రెండు సంవత్సరాల్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారో చూడాలి. దానికి తగ్గట్టు పరీక్ష ప్రిపరేషన్‌ను మొదలు పెట్టాలి. 

2020 బ్యాంక్ పరీక్షల ఆధారంగా ముఖ్యమైన అధ్యాయాల వివరాలు

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

సింప్లిఫికేషన్స్ (10-15), అప్రోక్సిమేట్ వాల్యూస్ (2020లో ప్రశ్నలు రాలేదు), క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ (5), క్వాంటిటీ కంపారిజన్ (క్యూ 1, క్యూ 2)(ప్రశ్నలు రాలేదు), నంబర్ సిరీస్ (3-5), డేటా ఇంటర్‌ప్రిటేషన్ (10), అరిథ్‌మెటిక్‌(10-12).

రీజనింగ్

సీటింగ్ అరేంజ్‌మెంట్ (18-20), పజిల్స్ (ప్రశ్నలు రాలేదు), ఇనీక్వాలిటీ (3-5 ప్రశ్నలు), కోడెడ్ ఇనీక్వాలిటీ, కోడింగ్-డీకోడింగ్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ (5), బ్లడ్ రిలేషన్స్ (2), డైరెక్షన్స్ (3), సిలాజిజమ్ (2-3), లాజికల్ రీజనింగ్, ఇన్పుట్-అవుట్పుట్, ఎలిజిబిలిటీ టెస్ట్, కాజ్ ఎఫక్ట్, డాటా సఫీషియన్సీ.

ఇంగ్లిష్

రీడింగ్ కాంప్రెహెన్షన్ (8-12), ఒకాబ్యులరీ (-2), క్లోజ్ టెస్ట్ (5-7), ఎర్రర్ డిటెక్షన్ (4-7), రీ-అరేంజ్‌మెంట్‌ ఆఫ్ సెంటెన్సెస్ (4-5), సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్‌ (5), వర్డ్ రీ-అరేంజ్‌మెంట్‌/ వర్డ్ యూసేజ్ (5-7), ఫ్రేజ్ రిప్లేస్మెట్ (5-6), ఫిల్లర్స్ (5), రాంగ్ స్పెల్లింగ్ (4-5). గ్రామర్ బాగా నేర్చుకుంటే ఇంగ్లిష్ విభాగం చాలా సులభంగా ఉంటుంది.

జనరల్ అవేర్‌నెస్‌

జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి రోజూ వార్తాపత్రికలను చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అంతర్జాతీయ, జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, వార్తల్లో వ్యక్తులు, ఇటీవల చేపట్టిన నియామకాలు, అవార్డులు, సదస్సులు సమావేశాలు లాంటి వర్తమాన అంశాలన్నింటిపైన పట్టు సాధించాలి. అలాగే సొంతగా తయారు చేసుకున్న నోట్సును నెలవారీ మార్కెట్లో లభించే కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్‌నెస్‌ పుస్తకాలతో పోల్చి చూసుకుంటూ ఉండాలి.

సాధన ఎప్పుడూ ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్ నుంచి మొదలు పెట్టాలి. వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి. పైన ఇచ్చిన కొన్ని టాపిక్స్ నుంచి గత ఏడాది ప్రశ్నలు రానప్పటికీ వాటి నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మెయిన్స్‌కు వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా చదవాలి.

 

డా. జీఎస్‌ గిరిధర్‌ డైరెక్టర్‌, RACE

Posted Date : 22-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌