• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర కొలువులకు సిద్ధమా?

2065 ఖాళీలతో ఎస్‌ఎస్‌సీ ఫేజ్‌-10 నోటిఫికేషన్‌

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆహ్వానిస్తోంది. ఫేజ్‌-10 రిక్రూట్‌మెంట్‌ ద్వారా 2065 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదోతరగతి అర్హతతో కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉన్న ఈ ఉద్యోగాలతో ఆకర్షణీయమైన వేతనాలను అందుకోవచ్చు! 

పోస్టును అనుసరించి రాత పరీక్షలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయి ప్రశ్నలతో మూడు రకాలైన ప్రశ్నపత్రాలు ఉంటాయి. అభ్యర్థి ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తారో ఆ స్థాయి పరీక్ష రాయాల్సి ఉంటుంది. 

రాత పరీక్ష సమయం: 1 గంట.

ప్రతి తప్పు సమాధానానికి 0.5 రుణాత్మక (నెగెటివ్‌) మార్కు ఉంటుంది.

అభ్యర్థి ఆయా పోస్టులకు విడివిడిగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ పోస్టులు ఉండటం వల్ల దాదాపు అన్ని రకాల విద్యా నేపథ్యాల వారికీ అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. గత ప్రశ్నపత్రాలు పోల్చి చూస్తే ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్‌ అంశాలపై ప్రశ్నలు అడుగుతోంది. పేపర్‌ కాస్త కఠినంగానే ఉంటోంది. అయితే పోస్టులు ఎక్కువగా ఉండటం, అభ్యర్థులు ఇతర ప్రకటనలతో తీరిక లేకుండా ఉండటం వల్ల పోటీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సరైన సన్నద్ధతను పరీక్షల వరకు కొనసాగిస్తే విజయాన్ని ఆశించవచ్చు.

దరఖాస్తు చేసిన తర్వాత ప్రింటవుట్‌ తీసుకుని ఉంచుకోవాలి. ఒకవేళ ఉద్యోగానికి ఎంపికైతే ధ్రువపత్రాల పరిశీలన సమయంలో ఈ నకలు కూడా జతచేయాల్సి ఉంటుంది.  

ఎలా చదవాలి:

పరీక్షకు రెండు నెలల సమయం మాత్రమే ఉన్నందున వ్యవధిని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తూనే అదే సమయంలో ముఖ్యమైన, కష్టమైన పాఠాలకు సొంతనోట్సు తయారు చేసుకోవాలి. గత ఏడాది ప్రశ్న పత్రాలు, ఎంపిక చేసుకున్న మాదిరి ప్రశ్న పత్రాలకు సమాధానాలివ్వడం మొదటి నెలలోనే పూర్తిచేయాలి. 

రెండో నెలలో అంశాల పునఃశ్చరణ, ముఖ్యమైన సూత్రాలను గుర్తుపెట్టుకోవడం, షార్ట్‌ నోట్స్‌ను తిరిగి చదవడం చేయాలి. పూర్తిస్థాయిలో మాక్‌ టెస్ట్‌లు రోజుకు కనీసం ఒక్కటైనా రాయాలి. టెస్ట్‌ పూర్తయిన తర్వాత అవలోకనం అవసరం. అలా చేయకపోతే ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నామో గుర్తించలేని పరిస్థితి వస్తుంది. ఇది అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తుంది. కష్టమైన ప్రశ్నలను మార్క్‌ చేసుకుని మళ్లీ మళ్లీ సాధన చేయాలి.

కేటగిరీల వారీగా పోస్టులు

జనరల్‌ - 915

ఎస్సీ - 248

ఓబీసీ - 599

ఎస్టీ - 121

ఈడబ్ల్యూఎస్‌ - 182

మొత్తం ఖాళీలు: 2065

పోస్టులు: మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్‌ అసిస్టెంట్, ఇతర గ్రూప్‌ సి, డి ఉద్యోగాలున్నాయి.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్‌ 13

పరీక్ష: ఆగస్టులో నిర్వహిస్తారు. (తేదీ ప్రకటించాల్సి ఉంది)

అర్హత: పదోతరగతి, ఇంటర్, డిగ్రీ 

వయసు: 18-30 ఏళ్లలోపు ఉండాలి. 

ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ద్వారా... 

ఫీజు: రూ.100/-, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు. 

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రక్షణ రంగంలో ఉన్నత ఉద్యోగాలు!

‣ ఇంటర్‌తోనే ఎదురులేని కెరియర్‌!

‣ డిజిటల్‌ గేమింగ్‌కు ఉజ్జ్వల భవిత

‣ గణితంలో గరిష్ఠ మార్కులు

‣ టెన్త్‌తో పోస్టల్‌ ఉద్యోగాలు

Posted Date : 24-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌