• facebook
  • whatsapp
  • telegram

కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామ్

కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేయాలని చాలామంది కలలు కంటుంటారు. ఈ కొలువుల్లో రెండో అత్యుత్తమమైనవి... గ్రూప్‌-బీ, గ్రూప్‌ సీ పోస్టులు. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవారు ఈ సీజీఎల్‌ పరీక్షకు పోటీపడవచ్చు. మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) లేని ఈ కలల పోస్టులను గెల్చుకోవటానికి ఏ ప్రణాళికను ఎలా అమలు చేయాలి?

గ్రూప్‌-బీ పోస్టుల్లో రెండు గెజిటెడ్‌ ఆఫీసర్‌ పోస్టులుంటాయి (అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌). అలాగే సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌, ఇంటెలిజన్స్‌ బ్యూరో, రైల్వే మినిస్టరీ, విదేశాంగ శాఖ, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌, ఇన్‌కమ్‌ టాక్స్‌, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌, రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌, కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్లలో గ్రూప్‌-బీ, గ్రూప్‌-సీ పోస్టులుంటాయి. కేంద్రప్రభుత్వ శాఖల్లోని గ్రూప్‌-ఏ అధికారుల ఆధ్వర్యంలో వీరు పనిచేయాలి. ఫీల్డ్‌ జాబ్‌, డెస్క్‌ జాబ్‌లుంటాయి. ఫీల్డ్‌ ఉద్యోగంలో భాగంగా వివిధ కంపెనీలు, పరిశ్రమలు, కర్మాగారాలు సందర్శించి వారి నుంచి సమాచారం సేకరించడం, ప్రభుత్వ అనుమతుల, నిబంధనల ప్రకారం నడుపుతున్నారా లేదా పరిశీలించాలి. టాక్సులు సక్రమంగా చెల్లిస్తున్నారో లేదో లాంటివాటిపై శ్రద్ధ చూపాలి. వారు తీసుకున్న సమాచారం ఆధారంగా డెస్క్‌జాబ్‌ పోస్టుల విధులుంటాయి.
 

ఎంపిక ఎలా?

4 అంచెలుగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మొదటి రెండు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మూడోది డిస్క్రిప్టివ్‌ పరీక్ష. నాలుగోది కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌ (టైపింగ్‌). గతంలో నిర్వహిస్తుండే మౌఖిక పరీక్షను తొలగించి, ఆ స్థానంలో చివరి రెండు అంచెలను ప్రవేశపెట్టారు. ప్రతి పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందినవారిని మాత్రమే తర్వాత జరగబోయే పరీక్షకు అర్హులుగా ప్రకటిస్తారు. ఆన్‌లైన్‌ రాతపరీక్షలో రుణాత్మక మార్కులు (1/4వ వంతు) ఉన్నాయి.
టైర్‌-1 పరీక్ష: దీనిలో 100 ప్రశ్నలను 60 నిమిషాలలో పూర్తి చేయాలి. నాలుగు విభాగాలుగా విభజించి ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు..
టైర్‌-2 పరీక్ష: దీనిలో కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థులందరూ వారు దరఖాస్తు చేసిన పోస్టులకు అతీతంగా పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు రాయాలి.
పేపర్‌-1లో మేథమేటిక్స్‌, అరిథ్‌మెటిక్‌ అంశాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులకు జరిగే ఈ పరీక్షను 2 గంటల సమయంలో పూర్తిచేయాలి.
పేపర్‌-2లో ఇంగ్లిష్‌ లాంగ్వేజి ప్రశ్నలు 200 వస్తాయి. 200 మార్కులకు జరిగే ఈ పరీక్షకు కూడా 2 గంటల సమయం.
జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసినవారు పేపర్‌-3 పరీక్ష రాయాలి. స్టాటిస్టిక్స్‌ విభాగం నుంచి 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. 2 గంటల సమయంలో పూర్తిచేయాలి.
గ్రూప్‌-బీ గెజిటెడ్‌ పోస్టుకు దరఖాస్తు చేసినవారు పేపర్‌-4 పరీక్ష రాయాలి. ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ అంశాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులకు జరిగే పరీక్ష వ్యవధి 2 గంటలు.
టైర్‌-3 పరీక్ష: ఇంగ్లిష్‌ (లేదా) హిందీ మాధ్యమాల్లో ఏదైనా ఎంచుకుని పెన్‌, పేపర్‌ విధానంలో డిస్క్రిప్టివ్‌ పరీక్ష రాయాలి. ఎస్సే, ప్రెస్సీ, లెటర్‌, అప్లికేషన్‌ రైటింగ్‌ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. 100 మార్కులకు జరిగే పేపర్‌-3 పరీక్షను 60 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి.
టైర్‌-4 పరీక్ష: కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌ (లేదా) కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్షలో అభ్యర్థుల టైపింగ్‌ను పరీక్షిస్తారు.
నాలుగు పరీక్షల్లో ప్రతి దానిలో అర్హత మార్కులు పొంది, అన్ని పరీక్షల్లో కలిపి వచ్చిన మార్కుల్లో మెరిట్‌ ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తారు.

దేనిలో ఎన్ని మార్కులు?
టైర్‌-1, టైర్‌-2 పరీక్షల్లో పేపర్‌-3, పేపర్‌-4 మినహా మొత్తం 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో- జనరల్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి 50 మార్కులు, జనరల్‌ ఎవేర్‌నెస్‌ నుంచి 50 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 250 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, కాంప్రహెన్షన్‌ల నుంచి 250 మార్కులు.
కాబట్టి క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ల నుంచి అత్యధిక మార్కులు తెచ్చుకున్నవారికి అవకాశాలు ఎక్కువ!

Posted Date : 09-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌