• facebook
  • whatsapp
  • telegram

అమ్మాయిలూ... ఎన్‌డీఏకు ద‌ర‌ఖాస్తు చేసుకోండి

* అవివాహితుల‌కు మాత్ర‌మే అవ‌కాశం 

* ఎన్‌డీఏ, నేవల్‌ అకాడమీ పరీక్షలపై యూపీఎస్‌సీ

* సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రకటన

దిల్లీ: అర్హులైన మహిళా అభ్యర్థులకు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ), నేవల్‌ అకాడమీ పరీక్షలు రాసేందుకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సెప్టెంబరు 24న యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. ఇందులో జాతీయత, వయసు, విద్యార్హత.. తదితర అంశాల ఆధారంగా (ఎన్‌డీఏ), నేవల్‌ అకాడమీ పరీక్షలకు అవివాహిత మహిళా అభ్యర్థులు మాత్రమే upsconline.nic.in  లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. శారీరక ప్రమాణాలు, ఖాళీల సంఖ్యను రక్షణశాఖ నుంచి వివరాలు అందిన తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 8 సాయంత్రం ఆరు గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదు. నవంబర్‌ 14న పరీక్ష జరుగుతుంది. అయితే ఎన్‌డీఏ, నేవల్‌ అకాడమీల్లోకి మహిళా అభ్యర్థుల ప్రవేశం మాత్రం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న వ్యాజ్యాలపై వచ్చే తుది తీర్పు ఆధారంగా ఉంటుంది. 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఆత్మస్థైర్యమే రక్ష!

పాఠాలపై దృష్టి నిలవటంలేదా?

Posted Date : 14-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌