• facebook
  • whatsapp
  • telegram

నియంత్రణ, సమన్వయ వ్యవస్థ

మద్యం మత్తులో తూలుతున్నా.. సక్రమంగా ఇంటికి చేరితే!

ఉన్నతస్థాయి జీవుల్లో, ప్రత్యేకించి మానవుల్లో శరీర నిర్మాణం అత్యంత సంక్షిష్టంగా ఉంటుంది. వివిధ అవయవాలు, అవయవ వ్యవస్థలు పనిచేస్తుంటాయి. అవి  సక్రమంగా పనిచేయాలంటే సరైన నియంత్రణ ఉండాలి. ఈ సమన్వయ బాధ్యతను మెదడు నిర్వహిస్తుంది. కదలిక, మాట, ఆలోచన, అనుభూతి లాంటివన్నీ దాని నియంత్రణలోనే ఉంటాయి. నేర్చుకోవాలన్నా, గుర్తుంచుకోవాలన్నా అదే ఆధారం. శరీరంలో జరిగే అన్నిరకాల విధులను నియంత్రించే  కేంద్ర స్థానమైన మెదడు గురించి అభ్యర్థులకు ప్రాథమిక స్థాయి అవగాహన ఉండాలి. దాని నిర్మాణం, పనితీరు, అందులోని భాగాలు, వాటి విధులు, నాడీవ్యవస్థ, గ్రంథులపై నియంత్రణ, మస్తిష్కం పనితీరును ప్రభావితం చేసే అంశాలు, వచ్చే వ్యాధులు తదితరాలను పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.


1. శరీరంలో జరిగే ఉద్దీపన, ప్రతిస్పందనలకు ప్రధాన కారణం?
1) నాడీ వ్యవస్థ    2) చర్మీయ వ్యవస్థ     3) శ్వాసక్రియ      4) పైవన్నీ


2. శరీర విధులను మెదడు నియంత్రిస్తుందని   మొదటగా కనుక్కున్నవారు?
1) జర్మన్‌లు     2) గ్రీకులు    3) భారతీయులు     4) పర్షియన్లు


3. శరీరం, శరీర విధులను రెండు రకాల నాడులు నియంత్రిస్తాయని తెలిపిన శాస్త్రవేత్త?
1) అరిస్టాటిల్‌     2) ప్రిస్ట్లే   3) లేవోయిజర్‌       4) గాలన్‌


4. నాడీవ్యవస్థలోని అతి సూక్ష్మ ప్రమాణాలు?
1) గ్లియల్‌ కణాలు      2) నాడీకణాలు   3) నెఫ్రాన్‌   4) వాయుగోణులు


5. నాడీకణ అధ్యయనాన్ని ఏమంటారు?
1) న్యూరాలజీ     2) నెఫ్రాలజీ    3) పల్మనాలజీ     4) లారింగాలజీ


6.  మానవుడి దేహంలో అతి పెద్ద నాడీకణం పొడవు?
1) 120 సెం.మీ. - 130 సెం.మీ.   2) 150 సెం.మీ.     3) 90 సెం.మీ. - 110 సెం.మీ.    4) 80 సెం.మీ.


7. నాడీకణంలో కేంద్రకం ఉన్న భాగం?
1) కణదేహం    2) డెండ్రైట్లు   3) తంత్రికాక్షం  4) నిస్సెల్‌ కణికలు


8. నాడీవ్యవస్థలోని నాడీకణాల సంఖ్య?
1) 10 మిలియన్లు      2) 10 బిలియన్లు    3) 100 మిలియన్లు       4) 2, 3


9.  శరీరంలో నాడీ ప్రచోదనాలను మెదడుకు పంపే నాడులు?
1) అభివాహి నాడులు    2) అపవాహి నాడులు   3) జ్ఞాన నాడులు    4) 1, 3


10. శరీర పరిమాణంతో పోల్చినప్పుడు ఏ జీవి మెదడు అతి పెద్దదిగా ఉంటుంది?
1) మానవుడు    2) కోతి    3) తిమింగలం   4) ష్రు


11. మస్తిష్కం ఎందులోని భాగం?
1) మధ్య మెదడు     2) వెనుక మెదడు    3) ముందు మెదడు    4) ఏదీకాదు 


12.  స్త్రీ, పురుషుల మెదడు బరువులో వ్యత్యాసం ఎంత (గ్రాముల్లో)?
1) 1400 గ్రా.    2) 100 గ్రా.    3) 1350 గ్రా.    4) 1275 గ్రా.


13. మానవ శరీరంలోని నాడుల సంఖ్య?
1) 12 జతలు    2) 31 జతలు    3) 43 జతలు    4) పైవన్నీ


14. వెన్నుపాములోని రెండు మూలాలు వేర్వేరు విధులు నిర్వర్తిస్తాయని తెలిపినవారు?
1) చార్లెస్‌ బెల్‌     2) ఫ్రాంకోయిస్‌ మెంజెండై    3) డావెన్సీ    4) స్టీఫెన్‌ హెల్స్‌


15. కిందివాటిలో కండర చలనాన్ని నియంత్రించేది?
1) ఉదర మూలం   2) పృష్ట మూలం   3) ఉదర కోశం   4) 1, 3


16. వేడి, నొప్పికి ప్రతిస్పందించడం అనేది కింది  వాటిలో దేని అధీనంలో ఉంటుంది?
1) మస్తిష్కం    2) అనుమస్తిష్కం    3) ద్వారగోర్ధం    4) మజ్జాముఖం


17. అల్లరిమూకను దండించే విషయంలో విపరీతమైన కోపాన్ని చూపిన ఉపాధ్యాయుడిలో సక్రమంగా పనిచేయని మెదడులోని భాగం?
1) ద్వారగోర్ధం     2) హైపోథాలమస్‌    3) అనుమస్తిష్కం       4) మజ్జాముఖం 


18. శ్వాసక్రియ, నాడీ స్పందనలు దేని అధీనంలో ఉంటాయి?
1) మస్తిష్కం    2) అనుమస్తిష్కం   3) మజ్జాముఖం    4) ద్వారగోర్ధం


19. శరీరంలోని కపాలనాడుల సంఖ్య?
1) 12 జతలు   2) 31 జతలు   3) 43 జతలు    4) పైవన్నీ


20. లైంగిక అవయవాల ఉత్తేజాన్ని తగ్గించే నాడులు?
1) సహానుభూత       2) సహానుభూత పర    3) స్వయంచోదిత     4) 1, 2


21. హృదయ స్పందన వేగాన్ని తగ్గించడం దేని  అధీనంలో ఉంటుంది?
1) సహానుభూత     2) సహానుభూత పర    3) స్వయంచోదిత    4) 1, 2


22. మానవుడి మెదడు బరువు (గ్రాముల్లో)?
1) 1400 గ్రా.    2) 1375 గ్రా.     3) 1275 గ్రా.    4) 1200 గ్రా.


23. కిందివాటిలో మెదడు అధ్యయనం ఏది?
1) లారింగాలజీ        2) క్రేనియాలజీ    3) ప్రీనాలజీ     4) మయాలజీ


24. మానవుడి శరీర బరువులో మెదడు బరువు శాతం?
1) 2%   2) 20%   3) 40%   4) 25%


25. దృష్టికి మూలమైన లంబిక?
1) ప్రంటల్‌   2) టెంపోరల్‌   3) ఆక్సిపెటల్‌    4) పెరైటల్‌


26. వెన్నుపాము బరువు (గ్రాముల్లో)?
1) 300 గ్రా.     2) 30 గ్రా.   3) 340 గ్రా.    4) 450 గ్రా.


27. కప్పలో మెదడును తొలగించినప్పటికీ అది  బతికుంటుందని గమనించింది ఎవరు?
1) లియోనార్డో డావెన్సీ      2) స్టీఫెన్‌ హేల్స్‌    3) చార్లెస్‌ బెల్‌        4) 1, 2


28. వెన్నుపాము ఆకారం?
1) H   2) S   3) I    4) M 


29. ఆకలి, దప్పిక అనేవి దేని అధీనంలో ఉంటాయి?
1) మస్తిష్కం    2) అనుమస్తిష్కం    3) ద్వారగోర్ధం    4) హైపోథాలమస్‌


30. కిందివాటిలో రెండో మెదడు?
1) స్వయంచోదిత నాడీవ్యవస్థ    2) జీర్ణ నాడీవ్యవస్థ    3) పరధీయ నాడీవ్యవస్థ        4) సహానుభూత నాడీవ్యవస్థ


31. మద్యం తాగిన వ్యక్తి తూలుతూ కూడా తన ఇంటికి సరిగా చేరితే, అతడి మెదడులో సక్రమంగా పనిచేసిన భాగం?
1) అనుమస్తిష్కం   2) మజ్జాముఖం    3) ద్వారగోర్ధం      4) పాన్స్‌ వెరోలి


32. మెదడులో కాడ ద్వారా అతికి ఉండే భాగంలోని గ్రంథి?
1) పీయూష గ్రంథి     2) ఆడమ్స్‌ యాపిల్‌    3) అధివృక్క గ్రంథి     4) 1, 2


33. నాడీ ప్రచోదన వేగం?
1) 100 మీ./సె.   2) 100 మీ./మీ.   3) 10 మీ./మీ.    4) 100 సెం./మీ.


34. ఒక నాడీ కణం వేరొక నాడీ కణం ఆక్సాన్‌తో కలిసే భాగం?
1) ష్వాన్‌ ప్రాంతం   2) రణ్‌వీర్‌    3) సినాప్స్‌      4) నాడీ అంత్యం


35. కిందివాటిలో మెదడు చుట్టూ ఉండే పొరల పేరు కానిది?
1) లౌతికళ     2) వరాసిక    3) మృద్వి      4) ప్లూరా


36. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి గ్రూప్‌-1 కు ఎంపికై, సన్మాన సభలో తను పడిన కష్టాలను మరిచి చిన్న పిల్లవాడిలా ఏడిస్తే, అతడి మెదడులో సరిగా పనిచేయని భాగం?
1) ద్వారగోర్ధం   2) మస్తిష్కం    3) అనుమస్తిష్కం    4) మజ్జాముఖం


37. మెదడు తీసుకునే ఆక్సిజన్‌ శాతం?
1) 2%   2) 80%   3) 20%   4) 30%


38. ఘ్రాణ లంబికలున్న మెదడులోని భాగం?
1) ముందు మెదడు      2) మధ్య మెదడు    3) వెనుక మెదడు     4) రెండో భాగం 


39. ఒక వ్యక్తిలో క్లోమ గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే సంక్రమించే వ్యాధి?
1) అతి మూత్ర వ్యాధి     2) చక్కెర వ్యాధి    3) రక్తం గడ్డ కట్టకపోవడం   4) ఎ, బి 


40. ఇన్సులా అనేది ఏ భాషా పదం?
1) ఇంగ్లిష్‌     2) జర్మన్‌    3) గ్రీకు    4) లాటిన్‌ 


41. ఇన్సులిన్‌ను మొదటిసారి ఏ జంతువుల్లో  కనుక్కున్నారు?
1) ఎలుక     2) పాము  3) కుక్క     4) మానవుడు


42. ఒక వ్యక్తిలో మూత్రాశయం సడలిందంటే అతడిలో పనిచేసిన భాగం?
1) సహానుభూత     2) సహానుభూతపర   3) స్వయంచోదిత      4) పైవన్నీ 


43. పరీక్షలో ఫెయిల్‌ అవడానికి కారణాలను విద్యార్థి  వెతికితే అతడి మెదడులో పనిచేసిన భాగం?
1) మస్తిష్కం    2) అనుమస్తిష్కం   3) ద్వారగోర్ధం    4) మజ్జాముఖం


44. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే మెదడులోని కేంద్ర భాగం?
1) మస్తిష్కం     2) అనుమస్తిష్కం   3) ద్వారగోర్ధం     4) మజ్జాముఖం


45. మెదడు చుట్టూ ఉండే పొరల సంఖ్య?
1) 2      2) 3      3) 4      4) 6


46. మెదడు బయటి వైపు ఏ రంగులో ఉంటుంది?
1) తెలుపు రంగు     2) వర్ణ రహితం 3) గోధుమ రంగు     4) బూడిద రంగు


47. మైలిన్‌ తొడుగును ఏర్పాటు చేసే కణాలు?
1) గ్లియల్‌ కణాలు    2) ష్వాన్‌ కణాలు    3) నాడీకణాలు     4) నాడీ అంత్యాలు 


48. ప్రతి వ్యక్తిలోనూ 20 ఏళ్ల తర్వాత ఎన్ని నాడీ   కణాలు క్రియారహితం అవుతాయి?
1) 10,000     2) 20,000     3) 30,000     4) 25,000


49. కిందివాటిలో మెదడుకు సంబంధించని వ్యాధి?
1) స్కిజోఫ్రీనియా      2) పెరాలసిస్‌    3) ఎపిలెప్సి       4) పెక్టోరిస్‌


50. మెదడును రక్షించే కపాలం అధ్యయనాన్ని ఏమంటారు?
1) క్రేనియాలజీ     2) ప్రీనాలజీ    3) క్రేనిషాలజీ      4) ఎంజీయాలజీ


సమాధానాలు

1-1; 2-2; 3-4; 4-2; 5-1; 6-3; 7-1; 8-4; 9-4; 10-4; 11-3; 12-2; 13-3; 14-2; 15-1; 16-1; 17-1; 18-3; 19-1; 20-1; 21-2; 22-1; 23-3; 24-1; 25-3; 26-2; 27-4; 28-1; 29-4; 30-2; 31-1; 32-1; 33-2; 34-3; 35-4; 36-1; 37-3; 38-1; 39-2; 40-4; 41-3; 42-1; 43-1; 44-3; 45-2; 46-4; 47-2; 48-2; 49-4; 50-1.


రచయిత: వట్టిగౌనోళ్ల పద్మనాభం 

Posted Date : 27-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు