ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (జీఈఎస్‌టీ-2024)ను డిసెంబర్ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ విద్యాసంస్థ వెల్లడించింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నారు.
వివరాలు:
ఎన్టీఆర్ జీఈఎస్‌టీ (గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్)-2024
అర్హతలు: పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు అర్హులు.
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో జరుగుతుంది. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి 2 గంటలు.
పరీక్షాంశాలు: మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జీకే, పదో తరగతి స్థాయి రీజనింగ్.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2023.
పరీక్ష తేదీ: 17-12-2023.
స్థలం: ఎన్టీఆర్ జూనియర్ మహిళా కళాశాల, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్, హిమాయత్ నగర్ గ్రామం, మొయినాబాద్ మండలం, ఆర్‌ఆర్ జిల్లా.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!
‣ నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీలు
‣ ఆన్‌క్యాంపస్, ఆఫ్‌క్యాంపస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
CSSS: సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ స్కీమ్
AICTE: డిప్లొమా మహిళల ప్రగతి స్కాలర్‌షిప్ పథకం 2023
AICTE: మహిళల ప్రగతి స్కాలర్‌షిప్ పథకం 2023