• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వీర తెలంగాణ

భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాల అర్థాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
అ) గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుతున్నాయి.
జ: సయ్యాటలాడుట = కలిసి ఆడుట
మా పొలంలో ఒకరోజు నాగుపాము, జెర్రిపోతు రెండు కలిసి ఆడటం కనువిందు చేసింది.

 

ఆ) స్వాతంత్రోద్యమం బ్రిటిషర్ల గుండెల్లో కల్లోలం రేపింది.
జ: కల్లోలం = పెద్ద అల
సముద్రతీరంలో నుంచి చూస్తే పెద్ద అల వచ్చే తీరు పసందుగా ఉంటుంది.

 

ఇ) వీరులెప్పుడూ ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు.
జ: వెనుకాడరు = వెనక్కు వెళ్లరు
సమస్యలు తలెత్తినప్పుడు భయపడి వెనక్కు వెళ్లరాదు

 

ఈ)  ఆలోచనలెన్నో వస్తాయి.
జ: దిక్కుతోచనప్పుడు = ఎటు వెళ్లాలో తెలియనప్పుడు
ఎటువెళ్లాలో తెలియనప్పుడు పెద్దవారి సలహాలు తీసుకుని ముందుకెళ్లాలి

 

2. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) ఉదయం: పుట్టుక, పొద్దున
ఆ) ఆశ: కోరిక, దిక్కు
ఇ) అభ్రం: మేఘం, ఆకాశం

 

3. కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) మురళీ రవం మానసిక ఆహ్లాదాన్నిస్తుంది
జ: రవం = శబ్దం, చప్పుడు, ధ్వని

 

ఆ) రుద్రమదేవి కృపాణంతో శత్రువులను చెండాడింది.
జ: కృపాణం = కత్తి, చాకు, ఖడ్గం

 

ఇ) జలధి అనేక జీవరాశులకు నిలయం.
జ: జలధి = వార్థి, సముద్రం

 

ఈ)  ఉన్న జంతువులు ప్రమాదకరం.
జ: దంష్ట్రలు = కోరలు, పళ్లు

 

ఉ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.
జ: లంఘించడం = దాటడం, దుంకడం

 

వ్యాకరణాంశాలు
 

I. కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
అ) జగమెల్ల = జగము + ఎల్ల (ఉకార సంధి)
   సూత్రం: ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం
ఆ) సయ్యాటలాడెన్ = సయ్యాటలు + ఆడెన్ (ఉకార సంధి)
   సూత్రం: ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం
ఇ) దారినిచ్చిరి = దారిని + ఇచ్చిరి (ఇకార సంధి)
   సూత్రం: ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికం
ఈ) ధరాతమెల్ల = ధరాతలము + ఎల్ల (ఉకార సంధి)
   సూత్రం: ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం
ఉ) దిశాంచలం = దిశ + అంచలం (సవర్ణదీర్ఘ సంధి)
   సూత్రం: అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.
ఊ) శ్రావణాభ్రం = శ్రావణ + అభ్రం (సవర్ణదీర్ఘ సంధి)
   సూత్రం: అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.
ఋ) మేనత్త = మేన + అత్త (అకార సంధి)
   సూత్రం: అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళం.

2. కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి.
అ) కాకతీయుల కంచుగంట = కాకతీయుల యొక్క కంచు గంట (షష్ఠీ తత్పురుష సమాసం)
ఆ) కళ్యాణ ఘంటలు = కళ్యాణము కొరకు ఘంటలు (చతుర్థీ తత్పురుష సమాసం)
ఇ) బ్రతుకు త్రోవ = బ్రతుకు కొరకు త్రోవ (చతుర్థీ తత్పురుష సమాసం)
ఈ) మహారవం = మహాయైన రవం (విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం)
ఉ) వికార దంష్ట్రలు = వికారమైన దంష్ట్రలు (విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం)
ఊ) కాంతి వార్ధులు = కాంతి అనే వార్ధులు (రూపక సమాసం)
ఋ) తెలంగాణ రాష్ట్రం = తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం (సంభావన పూర్వపద కర్మధారయ సమాసం)
ౠ) మతపిశాచి = మతం అనే పిశాచి (రూపక సమాసం)

 

ఛేకానుప్రాస అలంకారం
కింది వాక్యాన్ని గమనించండి.
* నీటిలో పడిన తేలు తేలుతదా!
     పై వాక్యాన్ని గమనిస్తే తేలు, తేలు అనే పదాలు పక్కపక్కనే వేర్వేరు అర్థాలతో ఉన్నాయి. మొదటిసారి వచ్చిన తేలు అంటే కీటకమైన తేలు. రెండోసారి వచ్చిన తేలు అంటే పైకి (నీటిలో) వస్తుందా అని అర్థం.
    అలా ఒక పదం అర్థం వేర్వేరుగా వెంటవెంటనే వస్తే ఆ అలంకారాన్ని ఛేకానుప్రాస అలంకారం అంటారు.

 

ఛేకానుప్రాసాలంకారం
   హల్లుల జంటను అర్థ భేదంతో వెంటవెంటనే వాడితే దాన్ని ఛేకానుప్రాస అలంకారం అంటారు.
* ఛేక అంటే జంట అని అర్థం
   కింది వాక్యాలను సమన్వయం చేయండి.

అ) అరటి తొక్క తొక్కరాదు
జ: పై వాక్యంలో తొక్క, తొక్క అనే పదాలు వెనువెంటనే వచ్చాయి. మొదటిసారి వచ్చిన తొక్క అంటే అరటి తొక్క అని అర్థం. రెండోసారి వచ్చిన తొక్క అంటే కాలు పెట్టకూడదు అని అర్థం. ఇలా అర్థభేదంలో ఒక పదం వెంటవెంటనే వచ్చింది కాబట్టి ఇది ఛేకానుప్రాస అలంకారం.

ఆ) నిప్పులో పడితే కాలు కాలుతుంది
జ: పై వాక్యంలో కాలు అనే పదం రెండుసార్లు కనిపిస్తుంది. కానీ అర్థం వేరు. మొదటిసారి వచ్చిన కాలు అంటే నడిచే మన కాలు అని, రెండోసారి వచ్చిన కాలు అంటే మండటం అని అర్థం. ఇలా అర్థభేదంతో ఒక పదం వెంటవెంటనే వచ్చింది కాబట్టి ఇది ఛేకానుప్రాస అలంకారం.

 

ఇ) తమ్ముడికి చెప్పు! చెప్పు తెగిపోకుండా నడవమని
జ: పై వాక్యంలో చెప్పు అనే పదం రెండుసార్లు వచ్చింది. కానీ అర్థంలో భేదం ఉంది. మొదటిసారి వచ్చిన చెప్పు అంటే చెప్పడం, రెండోసారి వచ్చిన చెప్పు అంటే చెప్పులు అని అర్థం. ఇలా ఒక పదం వెంట వెంటనే అర్థభేదంతో వచ్చింది కాబట్టి ఇది ఛేకానుప్రాస అలంకారం.
వీర తెలంగాణ పాఠంలో ఛేకానుప్రాస అలంకారానికి సంబంధించిన వాక్యాలు గుర్తించండి.

 

1. వీరు వీరులు పరార్థుల్
పై వాక్యంలో వీరు అనే పదాన్ని రెండుసార్లు ప్రయోగించారు. కానీ ఇక్కడ అర్థాలు వేరు. వీరు అనే మొదటి పదానికి తెలంగాణ పుత్రులు అని, వీరు అనే రెండో పదానికి వీరత్వం ఉన్న అనే అర్థం. ఇలా అర్థభేదంతో పదం వెంటవెంటనే వచ్చింది కాబట్టి ఇది ఛేకానుప్రాస అలంకారం.

విశేషాంశం

1. కాపయ నాయకుడు:
   1323 నుంచి 1369 వరకు ఓరుగల్లు కోటను కేంద్రంగా చేసుకుని స్వాతంత్య్ర పోరాటం చేసినవాడు. మహాబలవంతుడైన ఢిల్లీ చక్రవర్తి మహ్మద్ బీన్ తుగ్లక్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్రోద్యమాన్ని లేవదీసిన ఘనత కాపయ ప్రోలయ నాయకులది.
   కాపానీడు లేదా కాపయ నాయకుడు ముసునూరి నాయకుల వంశానికి చెందినవాడు. కాపయ నాయకుడు తెలంగాణను మ్లేచ్ఛ పాలన నుంచి విముక్తి చేశాడు. కాకతీయుల పాలన తర్వాత ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ముసునూరి యుగం చరిత్రలో సువర్ణ ఘట్టం.

 

రచయిత: జి. అంజా గౌడ్

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం