• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కొత్తబాట

ప్రాజెక్టు పని

అందమైన పల్లెటూరు చిత్రాలను సేకరించండి. పల్లెకు సంబంధించిన కవిత/పాట సేకరించి ప్రదర్శించండి. మీ మిత్రులు రాసినవన్నీ ఒక చోట చేర్చి సంకలనం తయారు చేయండి.
జ: పల్లెకు సంబంధించిన 'కవిత'
     హొయల సొంపులు - ఆకళింపుల కెంపులు
     భద్రమైన బాధ్యతలు - బరువు దించే మాటలు
     ఆయువును పెంచే అమృత తుల్యం - బాగు కోరే బంగారం
     అదే అదేనోయ్ నా పల్లె...
     జానపదాలు, యక్షగానాలు పొంగిపాడే పుణ్యనిలయం
     తులతూగే పంటలతో ఇలవేల్పుల సన్నిహితంతో
     కమ్మనైన తెలుగుపదం కదంతొక్కె తీపి గొంతుకలో
     ధర్మబోధలు దండిగా భక్తిభావం బహుమెండుగా
     వెలుగు నింపే వెన్నెలోలే నందనోద్యానమ్ములోలే
     సాగిపోయే కాలచక్రం కదిలె ఇదిగో చూడవా
     అదే అదేనోయ్ నాపల్లె...
     మాసిన బట్టల వెనుక మబ్బుల సుడిగుండాలెన్నున్నా
     మోములోని చిరునవ్వును చెదరనివ్వకుండా
     కాలానికి కబుర్లు చెప్పే కమనీయుడుండగా
     తృప్తిని మించినదేదీలేదని నమ్మే నావికుడుండే చోటు
     అదే అదేనోయ్ నాపల్లె...

పల్లెకు సంబంధించిన 'పాట'
పల్లవి: వెలుగులు నింపే వెన్నెలహాయి నాపల్లె
          వేకువ రేకుల పరిమళ జల్లు నా పల్లె
          అందాలొలికే వనాల జోడు
          అతిగా ఉండే ప్రేమల గూడు
          నాపల్లే... నాపల్లే... నాపల్లే ||వెలుగు||

 

చరణం 1: అనురాగ దీపికలై ఆత్మీయ వీచికలై
               నడయాడు కోవెల దీపం...
               పిల్లగాలుల తుళ్లింత కోయిలమ్మలు గానాలై
               పరవళ్ల పసిడి కాంతుల మాణిక్యమై
               కోయిలల కుహు కుహులు వినిపించె కిలకిలలూ
               చిరుగాలి దరహాసం వినిపించు సంగీతం ||వెలుగు||

 

చరణం 2:  ప్రకృతంతా పాదరసమై పరిగెత్తు దారయె
               నిండైన ఆరోగ్యాల ఊయల రూపం...
               మనసైన మనవాళ్లు మమకార లోగిళ్లు
               మదినిండ కురిపించు ఆనంద బంధాలై
               లేగదూడల లాలింపు లేతకొమ్మల గిలిగింపు
               సంబరాల సంబూరమే లేచి చూడు నా పల్లెలో ||వెలుగు||


రచయిత: జి. అంజాగౌడ్

 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం