• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నగరగీతం

III. భాషాంశాలు

పదజాలం
1. కింది పదాలకు అర్థాలు రాసి, సొంతవాక్యాలు రాయండి.
 ఏకాకి = ఒంటరి

సొంత వాక్యం: అభిమన్యుడు పద్మవ్యూహంలో ఏకాకి అయ్యాడు.
 నగారా = పెద్ద ఢంకా, పెద్దగా చప్పుడు వచ్చే వాద్య పరికరం.

సొంత వాక్యం: నా మిత్రుడు వీరేశం నగారా మోగించడంలో నేర్పరి.
 హోరు = తీవ్రమైన ధ్వనికి అనుకరణం (గాలి వీచడం, వాన కురవడం)

సొంత వాక్యం: వరద నీటి హోరు వింటే భయం వేస్తుంది.
 ఘోష = ఉరుము, పెద్ద శబ్దం

సొంత వాక్యం: ఆకాశపు ఘోష వింటుంటే కొండ మీద పడ్డట్టు ఉంటుంది.
 ఊపిరాడని = ఊపిరి తీసుకోలేని స్థితి

సొంత వాక్యం: మా పక్క వీధిలోకి వెళితే చెత్తా చెదారాల దుర్వాసనకు ఊపిరాడదు.
 పఠనీయ గ్రంథం = చదవాల్సిన పుస్తకం

సొంత వాక్యం: రామాయణం పఠనీయ గ్రంథం.

 

2. కింది పదాలకు పర్యాయ పదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.
 
పల్లె - గ్రామం, జనపదం
వాక్యాలు: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కలలు కన్నారు. జనపదాన్ని
బాగుపరచడమే దేశ సౌభాగ్యంగా తలచారు.

 

నరుడు - మానవుడు, మనిషి, మర్త్యుడు
వాక్యాలు: నరుడు ప్రకృతి ఇచ్చిన వరాలను సక్రమంగా వాడుకోవడం లేదు. మానవుడు ప్రకృతిని  కలుషితం చేస్తున్నాడు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడుతున్నాడు మనిషి. అది తనకే ముప్పు అని తెలియదు మర్త్యుడికి.
 

అరణ్యం - విపినం, అడవి, వనం
వాక్యాలు: అరణ్యంలో అద్భుత చిత్రాలు గోచరిస్తాయి. విపినం వల్ల వర్షాలు వస్తాయి.అందుకే అడవిని నరక్కూడదు. వనాన్ని కాల్చకూడదు.
 

 రైతు - కర్షకుడు, కృషీవలుడు
వాక్యాలు: అన్నం పెట్టే రైతు వర్షం కోసం ఎదురుచూస్తున్నాడు. సకాలంలో కురిస్తే కర్షకుడు కంటి మీద కునుకు లేకుండా పనిలో ఉంటాడు. ధాన్యం పండించే ధన్యజీవి ఈ కృషీవలుడు.
 

పువ్వు - కుసుమం, పుష్పం
వాక్యాలు: పువ్వు అందాన్ని, సువాసనను ఇస్తుంది. అందుకే కుసుమాలను స్త్రీలు తలలో పెట్టుకుంటారు. పుష్పాలతో దేవుడికి పూజ చేస్తారు.
 

మరణం - మృత్యువు, చావు, నిర్యాణం
వాక్యాలు: పుట్టిన ప్రతి జీవికి మరణం ఉంటుంది. మృత్యువు వివిధ రూపాల్లో సంభవిస్తుంది. అందువల్ల చావు వచ్చే లోపే పరోపకారానికి పాటుపడాలి. ఆ తర్వాత నిర్యాణం పొందితే కీర్తి మిగులుతుంది.
 

వాంఛ - కోరిక, ఆసక్తి
వాక్యాలు: బలమైన ఆసక్తి ఉండాలి. అది మనల్ని గొప్ప స్థితికి తీసుకెళ్తుంది. తర్వాత మన కోరికలను తీర్చుకోవచ్చు. కుటుంబ సభ్యుల వాంఛలను నెరవేర్చవచ్చు.
 

వృక్షం - చెట్టు, తరువు, భూరుహం.
వాక్యాలు: అడవికి అందం వృక్షాలు. ఆ చెట్లే కాయలను ఇస్తాయి. ఆ తరువులే నీడనిస్తాయి. ఆ భూరుహాల వల్లే వర్షాలు కురుస్తాయి.
                                                                     

వ్యాకరణాంశాలు


1. కింది కవితా భాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి.
అ.
నగారా మోగిందా
నయాగరా దుమికిందా

జ: పై కవితా భాగంలో 'అంత్యానుప్రాస' అలంకారం ఉంది.
అంత్యానుప్రాస అలంకారం: పాదాల చివర ఒకే అక్షరం లేదా అక్షరాల సముదాయం మళ్లీ మళ్లీ వస్తే
అంత్యానుప్రాస అలంకారం అంటారు.

సమన్వయం: పై కవితా భాగంలో 'దా' అనే హల్లు రెండు పాదాల చివర వచ్చింది.

 

ఆ. రంగదరాతిభంగ; ఖగరాజతురంగ; విపత్పరంపరో
  త్తుంగ తమఃపతంగ; పరితోషితరంగ; దయాంతరంగ; స
  త్సంగ; ధరాత్మజా హృదయ సారసభృంగ; నిశాచరాజ్జ మా
  తంగ; శుభాంగ! ........

జ: పై పాదాల్లో 'అంత్యానుప్రాస' అలంకారం ఉంది.
అంత్యానుప్రాస అలంకారం: పాదాల్లోని సమాస పదాల చివర ఒకే అక్షరం లేదా, అక్షరాల సమూహం మళ్లీ మళ్లీ వస్తే అంత్యానుప్రాస అలంకారం అంటారు.
సమన్వయం: పూర్ణబిందువుతో కూడిన 'గ' (oగ) అనే హల్లు పాదాల్లో సమాస పదాల చివర పదేపదే వచ్చింది.

 

ఇ. కొందరికి రెండు కాళ్ళు
   రిక్షావాళ్ళకి మూడు కాళ్ళు
   ఉన్నవాళ్ళకి నాలుగు కాళ్ళు

జ: పై కవితా భాగాల్లోని అలంకారం 'అంత్యానుప్రాస' అలంకారం.
అంత్యానుప్రాస అలంకారం: పాదాల చివర ఒకే అక్షరం లేదా అక్షరాల సమూహం పదే పదే పునరావృతం అయితే అంత్యానుప్రాస అలంకారం అంటారు.

సమన్వయం: పై కవితలో 'కాళ్ళు' అనే పదం పాదాల చివర పునరావృతమైంది.
* శబ్దాలంకారాల్లో వృత్యానుప్రాస, అంత్యానుప్రాస లాంటివే మరికొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

 

1. ముక్తపదగ్రస్తం
కింది వాక్యాన్ని పరిశీలించి, ప్రత్యేకతను గుర్తించండి.


పై పద్యాన్ని పరిశీలిస్తే
మొదటిపాదంలోని చివరి పదం 'తనమా' రెండో పాదంలో మొదటి పదంగా వచ్చింది. రెండో పాదం చివరి పదం 'ననుమా' మూడో పాదంలో మొదటి పదంగా వచ్చింది. మూడో పాదం చివరి పదం 'దనరం' మళ్లీ నాలుగో పాదం మొదటి పదంగా వచ్చింది. ఒక పాదంలో అంతమైన పదం తర్వాతి పాదంలో మొదట్లో రావడాన్ని 'ముక్తపదగ్రస్త' అలంకారం అంటారు.
ముక్తపదగ్రస్త అలంకారం: ఒక పద్యపాదం లేదా వాక్యం ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాతి పాదం లేదా వాక్యం మొదలవుతుంది. దీన్నే 'ముక్తపదగ్రస్త' అలంకారం అంటారు.

 

2. యమకం
కింది వాక్యాలను పరిశీలించి, ప్రత్యేకతను గుర్తించండి.

(లేమా = స్త్రీ; గెలవగలేమా = గెలవడానికి మేమిక్కడలేమా (ఉన్నాం కదా!))

జ: పై వాక్యంలో 'లేమా' అనే పదం కింద గీత గీసి ఉంది. అవి ఒకేలా ఉన్నాయి. కానీ అర్థాలు వేరు.


(తోరణం = ద్వారానికి కట్టే అలంకారం, రణం = యుద్ధం)
జ: పై వాక్యంలో 'తోరణం' అనే పదం కింద గీతలు గీసి ఉన్నాయి.
అవి ఒకేలా కనిపిస్తున్నాయి. కానీ అర్థాలు వేరు.

ప్రత్యేకతలు: పై రెండు వాక్యాల్లోనూ ఒకే పదం రెండు సార్లు వచ్చింది. మొదటి వాక్యంలో 'లేమా', రెండో వాక్యంలో 'తోరణం' వచ్చింది. అర్థంలో తేడాలు ఉన్నాయి. అందువల్ల పై రెండు వాక్యాల్లో 'యమకాలంకారం' ఉంది.
యమకాలంకారం: ఒక వాక్యంలో ఒక పదం అర్థ భేదంతో వెంట వెంటనే కాకుండా ప్రయోగిస్తే 'యమకాలంకారం' అంటారు.
 

3. లాటానుప్రాస
కింది కవితా భాగాలను/ వాక్యాలను చదవండి. ప్రత్యేకతను గమనించండి.
అ.
హరి భజియించు హస్తములు హస్తములు ..... (చేతులే, నిజమైన చేతులు)
ఆ. చిత్తశుద్ధితో జేసెడి సేవ సేవ (సేవయే నిజమైన సేవ)
జ: పై రెండు వాక్యాల్లో ఒకే రకమైన పదాలు అంటే హస్తములు, హస్తములు; సేవ, సేవ అనే పదాలు వెంటవెంటనే వచ్చాయి. కానీ వాటి భావం వేరు. 'హస్తములు హస్తములు' అంటే అర్థం 'చేతులు చేతులు'. కానీ భావం చూస్తే 'చేతులే నిజమైన చేతులు' అనీ, అదేవిధంగా 'సేవ సేవ' అంటే అర్థం 'పని పని'. కానీ భావం గమనిస్తే 'సేవయే నిజమైన సేవ' అని తెలుస్తుంది. దీనిలో 'లాటానుప్రాస' అలంకారం ఉంది.
లాటానుప్రాస అలంకారం: ఒక వాక్యంలో ఒక పదం అర్థ భేదంతో కాకుండా తాత్పర్య భేదంతో వెనువెంటనే వస్తే 'లాటానుప్రాస' అలంకారం.


రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం